రౌండ్ టేబుల్ సమావేశానికి సాహితీస్రవంతి గౌరావాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి అధ్యక్ష త వహించారు.ఆయన మాట్లాడుతూ నేడు దేశంలో హిందూత్వ శక్తులు దలితులపై ముస్లిం మైనారిటీ లపై దాడులు చేస్తొందని దీన్ని కవులు రచయిత లు ప్రజాసంఘాలు ఖండించాలని కోరారు.
ప్రముఖ చరిత్ర అధ్యాపకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామం లో ప్రతి సంవత్సరం దలితులు తమ పోరాట యొదులను స్మరించు కొంటున్న సందర్భంలో హిందూత్వ శక్తులు దాడులు చేశాయని దీనికి ప్రతిఘటన గా దళితులు వామపక్షాలు అభ్యుదయ శక్తులు బంద్ జరగడం అ. పూర్వమైనదని ఇలాంటి పోరాటాలను అందరూ సమర్తించాలని ఆయనకోరారు.ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రామిక వర్గ దృక్పథం అలవరుచుకోవాలన్నారు.కులవివక్ష పోరాట నాయకులు నల్లప్ప ~ బిసి సంఘ నాయకులు నాగరాజు , గన్నా నాయక్ ~ ప్రగతి~ రియాజుద్దీన్ , సురేష్, నాగేశ్వరాచారి, తరిమెల అమర్ నాధరెడ్ది, రాజమోహన్, యాడికి సూర్యనారాయణ రెడ్డి ,ె. జెన్నె ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment