Sunday, October 4, 2020

అనంతపురంజిల్లాలో సాహితీస్రవంతి_ నివేదిక 9/2019




                                 
            సాహితీ స్రవంతి కి పార్టీతో సరైన అనుసంధానం  జిల్లాలో లేనందున ఫ్రాక్షన్ ఏర్పాటు అవసరమని కుమారస్వామి
భావించి రాంభూపాల్ గారితో సంప్రదించి ప్రగతి,రవిచంద్ర,యమున ,కుమారస్వామి గార్లతో ఒక ఫ్రాక్షన్ ను ఏర్పాటుచేయడం
జరిగింది.
           కా!రాంభూపాల్ గారి సలహా మేరకు  కల్బుర్గి మొదలైన సాహిత్యకారుల హత్యలను ఖండిస్తూ నిరసన సమావేశాన్ని నిర్వహించాము. రాష్టృ కేంద్రం స్వేచ్చా స్వరం పుస్తకాన్ని  2016 డిసెంబరులో ఆవిష్కరించారు.ఆ సందర్భంగా అనంతపురం నుండి 50000 రూపాయల యాడ్స్ సేకరించి పంపినాము .

                     2017 ఫిబ్రవరి లో సాహితీ స్రవంతి ప్రచురించిన "అనంత సాహితీ సమాలోచన" పుస్తకాన్నిప్రచురించి ఆవిష్కరించాము .2017 ఏప్రిల్‌లో 30న వివిధ సాహిత్య సంఘాల తో కలిసి వేమన సాహిత్యం పైరాష్ట్ర సదస్సును నిర్వహించాము.ప్రజానాట్యమండలి వేమన రూపకాన్ని ప్రదర్సించింది.పార్టీ సహకారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం జరిగేది కాదు.దీని కోసం రూ. 4.85  లక్షలు విరాళాలు సేకరించాము. ఇందులో దాదాపు 3.49 లక్షలు ఖర్చు అయింది.. రాష్ట్ర కేంద్రానికి 50000 మొత్తాన్ని అక్టోబరులో పంపినాము.రాష్ట్రకేంద్రం కోరినపిమ్మట రాంభూపాల్ గారితో సంప్రదించి ఈ మొత్తాన్ని పంపాము.
      జూన్ నెలలో శ్రీ శ్రీ వర్ధంతి నిర్వహించాము. ప్రతి సంవత్సరం జరిగినట్లే జూలై 2017 లో
కార్యకర్తలకు ఒక ' కార్యశాల 'నిర్వహించి నూతన జిల్లా కమిటీని నగర కమిటీని నిర్మించాము. ఈ కార్యశాలకు రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ గారు  హాజరయ్యారు. కార్యశాలలో "సాహిత్యం లో ప్రాపంచిక దృక్పథం" పై పిళ్ళాకుమారస్వామి, కథాపరిణామక్రమం పై రాచపాలెం సంఘ నిర్మాణం పనిపద్దతులపై వొరప్రసాద్ ప్రసంగించారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి , అధ్యక్షులుగా కటకం కృష్ణవేణి , ప్రధాన
కార్యదర్శిగా చెన్నా రామమూర్తి ,కోశాధికారిగా అశ్వర్త రెడ్డి లను ఇతరకమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జులైలో 'రాయలసీమ సాహిత్యంం' పై ఒక పుస్తకాన్ని ప్రచురించాము . కదిరిలో జాషువా వర్ధంతి ని, నసీర్ అహమ్మమద్ రచించిన హిందూ ముస్లింల ఐక్యత కు ప్రతి రూపాలు అనే  పుస్తకావిష్కరణ
జరిపాము.హిందూపురం లో సాహిత్య అకాడమీ తోకలిసి  కథల్లో చేతివృత్తుల పై సదస్సు నిర్వహించాము .
                 నవంబరులో వేమన సభ కు కొనసాగింపుగా 13 పుపుస్తకాల పై సమీక్ష సదస్సు నిర్వహించాము. డిసెంబరులో" ఆధునిక సాహితీ ప్రస్తానము"  పుస్తకాన్ని ఆవిష్కరించాము.
ప్రధాన కార్యదర్శి చెన్నా రామమూర్తి ఉద్యోగ రీత్యా బదిలీ కావడం తో దాముగట్ల
హిదయాతుల్లా ను ప్రధాన కార్యదర్శి గా ఫ్రాక్షన్ లో నిర్ణయించి తీసుకున్నాము.
                        2018 లో ఫిబ్రవరినుండి "వర్తమాన సాహితీ తరంగాలు" పేరుతో ప్రతి నెలా అనంతపురం లో
ఉన్న వర్తమాన  సాహితీ మూర్తుల రచనలను కొత్త తరానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపట్టినాం .ఇది నవంబరు
నెల వరకు సాగింది.   ఇందులో పాల్గొన్న   వారికీ సాహిత్య విమర్శ ఎలా చేయాలన్న  దానిపై రాచపాళెం గారితో 
రెండు గంటలు క్లాసు కూడా నిర్వహించాము. ప్రతి కార్యక్రమంలో అధ్యక్షత వహించడానికి   కమిటీ సభ్యులకే ప్రాధాన్యత నిచ్చాము. ఈ కార్యక్రమం ద్వారా సాహిత్య కారుల్లో సాహితీ స్రవంతి పట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. అదే సమయం లో కొన్ని అవాంఛనీయ ధోరణులు తలెత్తాయి . కొంత మందిలో సాహితీస్రవంతి పట్ల అసూయ లాంటివి కూడా ఏర్పడ్డాయి.
మార్చి లో దాదాఖాలందర్ ప్రధాన కార్యదర్శిగా ,  రసూల్ అధ్యక్షులుగా ప్రగతి   ఉపాధ్యక్షులుగా నగరకమిటీ ఏర్పడింది. 
వీరి ఆధ్వర్యం లో ఉగాది కవిసమ్మేళనం,పుస్తకావిష్కరణ జరిగాయి. కొత్తగా వచ్చిన వారిలో కెరీరిస్టు లక్షణాలు ఉన్నాయి.వారిలో
ఉన్న ఈ లక్షణాన్ని మన సంఘం సమన్వయం చేసుకోలేక వారిని వదులు కున్నది. వారి సామాజిక తరగతిని బట్టి వారిని 
మనం  నిలుపు కోగలిగి ఉంటె బాగుండేది. నగర కమిటీ ని రాష్ట్ర కేంద్రం సలహా మేరకు రద్దు చేయడం జరిగింది. 
జూన్ నెలలో సాహిత్యశాల నిర్వహించాం . జూలై లో నూతన జిల్లా కమిటీ ని  నియమించడం జరిగింది. ఈ 
కమిటీ లో గౌరవాధ్యక్షులుగా కుమారస్వామి , అధ్యక్షులుగా ప్రగతి , ప్రధాన కార్యదర్శి గా హిదయతుల్లా మొదలైన 
వారున్నారు. వేమన సదస్సు సందర్బంగా నిర్ణయించిన  మేరకు వేమన సాహిత్య పీఠం కు అధ్యక్షులు గా ఏలూరి 
ఎంగన్న ,ప్రధాన కార్యదర్శిగా కృష్ణవేణి గార్లను నియమించడం జరిగింది. ఆయేషా హత్య ఉదంతానికి సంబంధించి నిరసన గళాలనుప్రజానాట్యమండలి తో కలిసి నిర్వహించాము. ప్రగతి గారు రాసిన కోయిలచెట్టుపుస్తకాన్ని కుమార స్వామి గారు రాసిన మట్టిపోగు పుస్తకాన్ని ఆవిష్కరించాము. ఎడారి బతుకులు ,కటిక పూలు పుస్తకాలను ఆవిష్కరించాము.
          హిందూపురంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బాధ్యులు నాగశేషు ,అశ్వర్థ నారాయణ లు కలిసి సాహిత్య అకాడమీ సహకారంతో అక్టోబర్ లో సింపోసియం నిర్వహించారు. గురజాడ శ్రీశ్రీ జాషువాల జయంతులను కూడా నిర్వహించారు.
                              2019 మార్చి నెలలో అనంతపురం లో మహిళా దినోత్సవం ,జూన్ లో శ్రీశ్రీ జయంతి, జూన్ నుండి ఇప్పటివరకు  నెలనెలా సాహితీ సంగమం లో భాగంగా కవిత్వంతో కరచాలనం ,కథాసంగమం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం . ఐద్వా చేపట్టిన కందుకూరి  శత వర్ధంతి కార్యక్రమాలలో ప్రధాన పాత్రను సాహితీ స్రవంతి తీసుకుంది. 
          ఈ సంవత్సరం జూన్ నెలలో కదిరిలోఎద్దుల సిద్ధారెడ్డి  స్మారక సాహిత్య పోటీలు కథ, కవిత్వంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో  కుమారస్వామి నిర్వహించారు. అదేవిధంగా ఎద్దుల సిద్ధారెడ్డి  స్మారకార్థం కడపలో రాయలసీమ సాహిత్యంపై సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కుమారస్వామి నిర్వహించారు.
                       సాహితీ స్రవంతి కోశాధికారిగా రవిచంద్ర గారు ఉన్న సమయం లో వేమన సదస్సు సందర్బంగా కుమారస్వామి,రవిచంద్ర కలిసి  సాహితీ స్రవంతి పేరుతొ అకౌంట్ ను స్టేట్ బ్యాంకు లో తెరిచారు.రవిచంద్ర గారు దీనికి తగిన సమయం కేటాయించలేక కుమారస్వామిని నిర్వహించమన్నారు.దీనికి సంబందించిన జమ ఖర్చు వివరాలను కింది పత్రం లో చూడగలరు. 

Thursday, September 24, 2020

అనంతపురం జిల్లాలో సాహితీస్రవంతి ప్రస్థానం



                          


           అనంత పురం జిల్లాలో సాహితీ స్రవంతి
ప్రస్థానం ప్రారంభమైంది. పిళ్ళా కుమారస్వామి రెడ్డి
డా. గేయానంద్,డా. మోక్షప్రసూన లతో 
సాహితి స్రవంతి కోసం ఏర్పడిన కన్వీనింగ్ కమిటీ 2002 నుండి పనిచేయడం ప్రారంభించింది. అప్పటి నుండి శ్రీశ్రీ ,జాషువా, గురజాడ వర్థంతులను లేదాజయంతులను క్రమం తప్పకుండా సాహితీ స్రవంతి   నిర్వహిస్తూ వస్తోంది.
        2003లో అమెరికా ఇరాక్ పై యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో సాహితీ స్రవంతి 'యుద్ధవ్యతిరేక కవితాగళాలు' పేరుతో ఇరాక్ పై అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కవి సమ్మేళనం
నిర్వహించింది. ముందస్తు ఎన్నికలపై కవితాగానాన్ని నిర్వహించింది. 
         అనేక ప్రజాసంఘాలు 2005 లో సమగ్రాభివృద్ధి కోరుతూ చేస్తున్న అనంతపురం  జిల్లాలో ప్రజాఉద్యమాలు జరుపుతున్న నేపథ్యంలో 'జిల్లా వెనుకబాటుతనం నిర్మూలన' పైసాహితీ స్రవంతి కవి సమ్మేళనం నిర్వహించింది. 2007 లో కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటి జిల్లాలో సామాజిక న్యాయం, కులవివక్ష అంశాలపై సైకిల్ యాత్ర నిర్వహించింది. ఆ సందర్భంలో సాహితీస్రవంతి 'కులవివక్షపై కవితాసమరం' పేరుతో కవిసమ్మేళనం నిర్వహించింది.వారికి మద్దతుగా సాహితీ స్రవంతి కన్వీనరు పిళ్ళా కుమారస్వామి సైకిలు యాత్రలో పాల్గొన్నారు. 
      వివిధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు కథ, కవిత్వ రచనలలో పోటీలు నిర్వహించింది. తరువాత జిల్లాలో పేదలు చేస్తున్న భూపోరాటానికి అక్షరసంఘీభావం పేరిట శ్రీ శ్రీ వర్థంతి రోజున కవి సమ్మేళనం నిర్వహించింది. 

           సాహితీ స్రవంతి ఉద్యోగ, ఉపాధ్యాయ
రంగాలలో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి
వారిలో సాహితీ సృజనగలవారిని గుర్తించాలని
నిర్ణయించింది. అప్పటి నుండి సెప్టెంబరు 5 ఉ
పాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యా యులకు కథ, కవిత్వంలో సాహి త్య పోటీలు నిర్వహించి బహుమతులను అందజే యటం
ప్రారంభించింది.
         జీవితబీమాసంస్థలో కడప డివిజన్ లోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ఉద్యోగులందరికి కవితల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసింది.
       సాహితీ స్రవంతి చురుకుగా పనిచేయడం వల్ల రాష్ట్ర స్థాయిలో,జిల్లా స్థాయిలో సాహిత్య రంగంలోని ఇతర సంఘాల కదలికలు పెరిగాయి.రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తివాదులూ, సంప్రదాయవాదులు, పాలకవర్గాలు, కార్పొరేట్ వర్గాల పాత్ర కూడా సాహిత్య రంగంలో పెరిగింది. సాహిత్య ప్రముఖుల్లో
ఊగిసలాట ధోరణులు కొనసాగుతున్నాయి. విశాల ప్రాతిపదికన వారందరినీ కలుపుకొని సాహితీ స్రవంతి పనిచేయసాగింది. అనంతపురంలో స్త్రీ, దళిత,మైనార్టీ, బహుజనవాదాల పై చర్చ జరిగిన తరువాత ఆధునికాంతర ధోరణులు జిల్లాలో సాహిత్య రంగంలో ప్రవేశించాయి.
         పేద ప్రజలు 2007లో ప్రభుత్వ మిగులు భూములు పంచాలని భూపోరాటం చేస్తున్నారు. ఆ సందర్భంగా ముదిగొండలో భూపోరాటం చేస్తున్న ప్రజల పై కాల్పులు జరిపి ఐదుమందిని పొట్టన పెట్టుకొంది ప్రభుత్వం. దీనికి నిరసనగా సాహితీస్రవంతి నిరసన గళాలను నిర్వహించింది. అలాగే రాష్ట్రస్థాయిలో వచ్చిన కవితాగ్రహాన్ని 'భూస్వరాలు' పేరుతో సాహితీ స్రవంతి రాష్ట్ర శాఖ కవితా సంకలనాన్ని తీసుకువచ్చింది.  ఈ సంకలనంలో అనంతపురం కవులు రాసిన కవితలు చాలా ఉన్నాయి.
         విశాఖకు సంబంధించిన యు.ఎ. నరసింహారావు గారు రచించిన 'కన్యాశుల్కం - ఆధునిక భారతీయ నాటకాల'తో పాటు భూస్వరాలు ను కూడా  సాహితీ స్రవంతి ఆవిష్కరించింది. 

           జిల్లా, నగర స్థాయిల్లో అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం వల్ల వచ్చిన సంబంధాలతో 2011లో సాహితీ స్రవంతికి
జిల్లా స్థాయి కమిటీ ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది.
       ప్రధాన కార్యదర్శిగా తగరం క్రిష్ణయ్య,
జిల్లా అధ్యక్షునిగా పిళ్లా కుమారస్వామి, కార్యదర్శులుగా ఆకుల రఘురామయ్య,
ముకుందాపురం పెద్దన్న, ఉపాధ్యక్షులుగా అంకె
రామలింగమయ్య, ఎర్రిస్వామి, కోశాధికారిగా ప్రజ్ఞ సురేష్, సభ్యులుగా ఆవులజయప్రద (ఉరవకొండ), శివన్న (మడకశిర),రామకృష్ణ, శేషాచార్యులు, జూటూరి షరీఫ్ తో  జిల్లా స్థాయి కమిటీ ఏర్పడింది. నూతన కమిటీ చురుకుగా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. జిల్లా స్థాయి కవితా సంకలనం
తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ప్రారంభించిన కొంతకాలానికి తెలంగాణా
ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో సాహిత్య రంగంలో స్తబ్దత ఏర్పడింది.
సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ ఈ ఉద్యమాలపట్ల తటస్థ వైఖరితో ఉండాలని నిర్ణయించింది. ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు సాహిత్యకారులను చీలుస్తు న్నాయని ఇవి ప్రపంచీకరణకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి దోహదపడవని
సాహితీ స్రవంతి భావించింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమ
కారుల ఆవేశాలు, ఆశలు చల్లారిపోయాయి. ఆ సందర్భంలో అనంతపురం జిల్లాలోని చాలా మంది సాహిత్యకారులు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.
       అంతకుముందు జిల్లా వ్యాప్తంగా ఆహ్వానించగా వచ్చిన కవితలను సంస్కరించి మల్లెల నరసింహమూర్తి పిళ్ళా కుమారస్వామి సంపాదకత్వంలో 'అనంత
కవితాస్వరాలు' పేరుతో కవితా సంకలనాన్ని సాహితీ
స్రవంతి తీసుకు వచ్చింది. ఈ పుస్తక ఆవిష్కరణకు
ముందుగా 'చిక్కనవుతున్న పాట' పేరుతో ఒక కవితా సంకలనాన్ని సాహితీస్రవంతి ప్రచురింది. దీనిని ప్రముఖ విమర్శకులు సూర్యసాగర్ ఆవిష్కరించారు. అదే సందర్భంలో రెండవ
జిల్లా కమిటీ కూడా ఏర్పడింది. కమిటీలో ప్రధాన కార్యదర్శి'గా ప్రజా సురేష్, అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా అంకె రామలింగ మయ్య, బాల భారతమ్మ, కార్యదర్శులుగా రియా జుద్దీన్, ఆకుల రఘురామయ్య గార్లు బాధ్యతలు తీసుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అనంత కవితాస్వరాలు పుస్తకావిష్కరణ సభకు మేడిపల్లి రవికుమార్ గారు తిరుపతి నుంచి
వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా డా. గేయానంద్ గారు పాల్గొన్నారు.

       అనంత కవితా స్వరాలు కవితా సంకలనాన్ని పరిచయం చేసేందుకు కదిరి, హిందూపురం, ఉరవకొండ, ధర్మవరం ప్రాంతాలలో జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి  పర్యటించి జనకవనాలను కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా కదిరిలో ఆ శాఖ అధ్యక్షులుగా చలపతి, ప్రధాన కార్యదర్శిగా చిన్నారావులతో ఒక కమిటీ ఏర్పడింది. హిందూపురంలో డా|| నాగశేషు, అశ్వర్ధ నారాయణ
ప్రధానకార్యదర్శి, అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కమిటీ ఏర్పడింది. ఉరవకొండలో ఆవుల వెంకటేశులు గంగాధర్ లు అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీ ఏర్పడింది. ధర్మవరంలో నూతన శాఖ ఏర్పడింది. ఈ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఇటికంటి మహేష్, అధ్యక్షులుగా శారద, ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ తదితరులతో కమిటీ నిర్మాణం జరిగింది.
         నెలనెలా క్రమం తప్పకుండా సంవత్సరం
పాటు సాహితీ సమయం కార్యక్రమాన్ని నిర్వహిం
చడం ద్వారా అనంతపురం నగర కమిటీ కూడా
ఏర్పడటానికి దోహదపడింది. నగర కమిటీలో
అధ్యక్షులుగా వై. సూర్యనారాయణరెడ్డి, నగర ప్రధాన కార్యదర్శిగా పోకూరి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా నీరుగంటి వేంకటేశు, కార్యదర్శిగా రవిచంద్ర బాధ్యతలు తీసుకున్నారు.
అనంతపురం నగర కమిటీ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కవులు రచయితలతో 2016 సం|| కేలండర్‌ను రూపొందించి ఆర్ట్స్ కళాశాలలో ఆవిష్కరించింది. అలాగే ఆర్ట్స్ కళాశాలతో కలిసి జిల్లాలోని దివంగత సాహిత్యకారులపైప్రతి నెలా 3వ ఆదివారం సాహితీ సమాలోచన ఆ కళాశాల తెలుగుశాఖతో
కలిసి నిర్వహించాలని నిర్ణయించింది. 
      ప్రథమంగా మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న 'వేమన-సామాజిక దృక్పథం' పై నిర్వహించిన సభలో అప్పిరెడ్డి హరినాథరెడ్డిముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. హిందూపురం, ధర్మవరం, అనంత పురంకమిటీలు కూడా మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాయి. మార్చి నెలలో మహిళా దినోత్సవాన్ని ధర్మవరం, అనంతపురం, హిందూ పురం శాఖలు నిర్వహించాయి.
       ఏప్రిల్ మాసంలో జిల్లా శాఖ కథ, కవిత్వంలపై
సాహిత్యశాల నిర్వహిం చింది. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పడిన ప్రాంతీయ కమిటీ సభ్యులతో మూడవ జిల్లా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో అధ్యక్షులుగా ప్రగతి, ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర, ఉపాధ్యక్షులుగా సత్య నిర్ధారన్ (ధర్మవరం), అశ్వథనారాయణ (హిందూ పురం), వై. సూర్యనారా
యణరెడ్డి (అనం తపురం), సహాయ కార్యదర్శులుగా నీరుగంటి వెంకటేసు (అనంతపురం), ఇటికంటి మహేష్ (ధర్మవరం) పిళ్ళా కుమారస్వామి (రాష్ట్ర
కమిటి సభ్యులు, కోశాధికారి), సభ్యులుగా నానీల నాగేంద్ర (అనంతపురం, నర్సిరెడ్డి (పెనుగొండ), తిప్పేస్వామి (కళ్యాణదుర్గం), గంగాదేవి,ధరిత్రీదేవి, యమునా, హిదయతుల్లా, రసూల్, శ్రీధర్ నాయుడు, చంద్రశేఖర్ (యూనివర్శిటీ),
లక్ష్మినారాయణ (యూనివర్శిటీ) బాధ్యతలు
తీసుకున్నారు.
         సాహిత్యశాలలో రాయలసీమ కథా చిత్రంపై
సింగమనేని నారాయణ, కథలెలా రాస్తారు పై శశికళ,
బండి నారాయణస్వామి, సాహిత్య పరిణామ క్రమంపై పిళ్ళా కుమారస్వామి, కవిత్వంలో వస్తువు పై రాధేయ, కవితా శిల్పంపై మల్లెల నరసింహమూర్తి  బోధించారు. సాహితీ స్రవంతి ఆవిర్భావంపై జంధ్యాల రఘుబాబు వివరించారు.
        ఆంధ్రరాష్ట్రం విడిపోయాక జిల్లాలో రాయలసీమ ప్రత్యేక ఉద్యమ సన్నాహాలు రచయితలు మేధావులతో ప్రారంభమయ్యాయి. రాయలసీమ, అందులోఅనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. అందువల్ల ఈ ఉద్యమం అనంతపురంలోనే రాజుకుంటున్నది. కొంత మంది రచయితలు బహిరంగంగా దీనినిప్రోత్సహిస్తున్నారు. అంతేగాక ప్రపంచీకరణ ప్రభావంతో జిల్లాలో భాషా సంస్కృ
తులపై పెనుప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు భాషా సంస్కృతులనురక్షించు కోవాలని సాహితీస్రవంతి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగు తున్నది.
       వర్తమాన పరిస్థితుల్లో సాహితీ స్రవంతి కొత్తతరం సాహితీ సృజనకారులను
గుర్తించి ప్రజాసాహిత్యకారులుగా తీర్చిదిద్దాల్సిన కర్తవ్యాన్ని గుర్తించింది. జిల్లాలో సాహిత్యా
భివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉగాది రోజున తూతూ మంత్రంగా కవిసమ్మేళనాలను నిర్వహిస్తోంది. అధికార భాషాసంఘం నామ మాత్రంగా కూడా లేదు. అదే సందర్భంలో వర్ధమాన సాహిత్యకారుల్లో సాహిత్యం
పట్ల తపన ఉండటం గమనార్హం. వీరి తపనను గుర్తించి సాహితీ స్రవంతి సాహిత్యకార్యశాలలను విరివిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. 

పాతతరం సాహిత్యకారుల స్ఫూర్తిని పొందేందుకు నెల నెలా అనంతపురం నగరశాఖ జిల్లాలోని
దివంగత సాహిత్య కారులపై సాహితీ సమాలోచన ను చేపట్టింది. వేమనపై అప్పిరెడ్డి హరినాథ రెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సాహిత్యంపై అంకె శ్రీనివాస్, గుత్తిరామకృష్ణపై సాయినాథ్, తలమర్ల కళానిధిపై ఆశావాది ప్రకాశరావు మరియు
ఆయన కుమారుడు తలమర్ల శ్యామ్ సుందర్, బెల్లూరు శ్రీనివాసమూర్తి సాహిత్యంపైఏలూరి ఎంగన్న ఆయన కుమార్తె సర్దేశాయి తిరుమలరావుపై రాచపాళెం, విద్వాన్ విశ్వంపై ఏలూరి ఎంగన్న, కోగిర జైసీతారాంపై ఆయన కుమారుడు కోగిరజయచంద్రా రెడ్డి, ఏలూరి ఎంగన్నతో కలిసి ప్రసంగించారు.
సాహితీస్రవంతి, సాహిత్య అకాడమి సహకారంతో 'కార్మిక సాహిత్యం' పై 2016 డిసెంబరు 25న సదస్సు నిర్వహించింది. కదిరిలో 'ఇప్పుడు వీస్తున్న
గాలి' పేరుతో నెలనెలా వర్తమాన కవులు, రచయితల పుస్తకాలపై సమీక్షలు,సాహిత్య గోష్టి నిర్వహిస్తున్నారు.
      ప్రభుత్వం వేమన, రాళ్ళపల్లి, తలమర్ల కళానిధి, మొదలైన సాహిత్యకారుల విగ్రహాలను కలెక్టరు కార్యాలయం బయట నెలకొల్పాలి. సాహిత్య ప్రస్థానం పత్రికను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సాహిత్యకారులు తమపుస్తకాలను ప్రచురించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహా యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

( అనంత సాహితీ సమాలోచన నుండి)

___పిళ్లా విజయ్

Friday, September 11, 2020

2016లో పురస్కార సభ లో సింగమనేని




జిల్లాస్థాయిలో కథల పోటీ నిర్వహించి పిళ్లా కుమారస్వామి తల్లిదండ్రుల పేర్లతో పిళ్లా లక్ష్మి రెడ్డి పిళ్లా రామలక్ష్మి పురస్కారం అందజేశాము.ముఖ్య అతిథిగా సింగమనేని నారాయణ గారు హాజరై
కథల గురించి కొత్త కథకులకు మార్గదర్శనం చేయించారు.




Thursday, August 27, 2020

రౌండ్ టేబుల్ సమావేశం10.1.18


రౌండ్ టేబుల్ సమావేశానికి సాహితీస్రవంతి గౌరావాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి అధ్యక్ష త వహించారు.ఆయన మాట్లాడుతూ నేడు దేశంలో హిందూత్వ శక్తులు దలితులపై ముస్లిం మైనారిటీ లపై దాడులు చేస్తొందని దీన్ని కవులు రచయిత లు ప్రజాసంఘాలు ఖండించాలని కోరారు.

ప్రముఖ చరిత్ర అధ్యాపకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామం లో ప్రతి సంవత్సరం దలితులు తమ పోరాట యొదులను స్మరించు కొంటున్న సందర్భంలో హిందూత్వ శక్తులు దాడులు చేశాయని దీనికి ప్రతిఘటన గా దళితులు వామపక్షాలు అభ్యుదయ శక్తులు బంద్ జరగడం అ. పూర్వమైనదని ఇలాంటి పోరాటాలను అందరూ సమర్తించాలని ఆయనకోరారు.ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రామిక వర్గ దృక్పథం అలవరుచుకోవాలన్నారు.కులవివక్ష పోరాట నాయకులు నల్లప్ప ~ బిసి సంఘ నాయకులు నాగరాజు , గన్నా నాయక్ ~ ప్రగతి~  రియాజుద్దీన్ , సురేష్, నాగేశ్వరాచారి, తరిమెల అమర్ నాధరెడ్ది, రాజమోహన్, యాడికి సూర్యనారాయణ రెడ్డి ,ె.   జెన్నె ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


కదిరిలో విద్యార్థులకు కథల పోటీలు




2019 డిసెంబర్ లోవేమన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర, యస్ యఫ్ ఐ నాయకులు బాబ్ జాన్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా గౌరవా ధ్యక్షులు పిళ్లా కుమార స్వామి మాట్లాడుతూ విద్యార్థుల్లో మంచి సృజనాత్మక శక్తి ఉందని దానిని వెలికి తీయటానికి కథ కవిత్వ వ్యాసరచన మొదలైన సాహిత్య పోటీలు ఉపకరిస్తాయని చెప్పారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో  ఈ పాఠశాలలో నెలనెలా కథల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి చదువులో బాగా రాణిస్తారని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నాయకులు  బాబ్ బాన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాల సందర్భంగా  భగత్ సింగ్ పై వ్యాస రచన పోటీలు కూడా నిర్వహిస్తామని విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు . కార్యక్రమాన్ని  సమన్వయ  పరచిన కృష్ణ మూర్తి రాజు  మాట్లాడుతూ పిళ్లా కుమార స్వామి  సాహిత్యరంగంలో విశేష కృషి జరుపుతున్నారని, విద్యార్థి లోకాన్ని  కూడా సాహిత్య రంగం లోకి తీసుకురావడం కోసం కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో  లో తెలుగు ఉపాధ్యాయులు పవన్ ,రమణ ,హరి ప్రసాద్ రెడ్డి,  జయంతి ,చలపతి ,లతీఫ్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. బహుమతులు పొందిన వారిలో ఫర్హాన్, సోహెల్, శ్రావణ్ కుమార్ , కేదార్నాథ్ ,ఈ ఎస్ కరిష్మా విద్యార్థులు ఉన్నారు

సింపోయిజం


సాహితీస్రవంతి సాహిత్య అకాడెమీ సంయుక్తంగా కన్నడ తెలుగు కథల్లో సామాజిక మార్పు‌అంశం పై సింపోయిజం ను ఈ నెల 29న శనివారం రోజున.    హిందూపురం లోని‌సప్తగిరి డిగ్రీకళాశాలలో      జరుపుతున్నట్లు సాహితీస్రవంతి జిల్లా గౌరవాధ్యక్షు లు పిళ్లా కుమారస్వామి    ఒ క ప్రకటన లో తెలిపారు.ఈ సమావేశానికి సాహిత్యాకడెమీ సంచాలకులు ప్రముఖ కవి కె శివారెడ్డి అధ్యక్సులుగా,అకాడెమీ సభ్యులు రాచపాళెం చంద్రసేఖర రెడ్డి కీలకోపాన్యసకులుగా ,పరిచయకర్థగా కుమారస్వామి, అకాడెమీ భాధ్యులు మహాలింగేస్వర్ హాజరవుతున్నారు.ఇందులో వివిధ అంశాలపై రచయితలు పత్రసమర్పణ చేస్తారు.సాహిత్యాభిమానులు హాజరై సభను జయప్రదం చేయాలని పిళ్ళాకుమారస్వామి కోరారు.27.9.2018

2018 లో నగర కమిటీ






సాహితీ స్రవంతి అనంతపురం నగరంలో సాహిత్య కార్యక్రమాలను విరివిగా నిర్వహించడానికి ప్రజాశక్తి బుక్ హౌస్ దగ్గర సాహితీ స్రవంతి కార్యాలయం లో సభ్యులు హాజరై జిల్లా గౌరవాధ్యుక్షులు పిళ్ళాకుమారస్వామి, జిల్లా అధ్యక్షులు కటకం క్రిష్నవేణి,జిల్లా    ప్రధానకార్యదర్సిహిదయతుల్లా సమక్షంలో నగర కమిటీ ని 6.3.2018న ఎన్నుకున్నారు. కమిటీ లో నగరాధ్యక్షులుగా నగరూరు రసూల్,ప్రధానకార్యదర్సిగా దాదా ఖలందర్,ఉపాధ్యక్షులుగా మడూరు ప్రగతి,రాముడులను,సహాయకార్యదర్సిలుగా యల్ ఆర్ వెంకటరమణ, కిశోర్ లను,కోశాధికారి గా రాంప్రసాద్ ను,కమిటీ సభ్యులు గా లహరి,సుధాకర్,నిర్మల,నానీల నాగేంద్ర,ఆదినారాయణ, జెన్నె ఆనంద్,మిద్దెమురలీక్రిష్న,జూటూరిషరీఫ్,యమునారాణి,ముకుందాపురం పెద్దన్న,రియజుద్దీన్,షేక్షావలిలను ఎన్నుకొన్నారు.తదనంతరం ఈ నెల మార్చి 18న ఉగాది కవిసమ్మేలనం నిర్వహించాలని కమిటీ నిర్నయించింది.అల్లాగే శ్రీ శ్రీ ,జషువా,గురజాడ జయంతులను నిర్వహించాలని, విధ్యార్తులకు కవితల పోటీలు నిర్వహించాలని కమిటీ సమావేశం నిర్నయించిందని జిల్లా అధ్యక్షులు క్రిష్నవేణి ఒకప్రకటనలో తెలిపారు.