Thursday, August 27, 2020

రౌండ్ టేబుల్ సమావేశం10.1.18


రౌండ్ టేబుల్ సమావేశానికి సాహితీస్రవంతి గౌరావాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి అధ్యక్ష త వహించారు.ఆయన మాట్లాడుతూ నేడు దేశంలో హిందూత్వ శక్తులు దలితులపై ముస్లిం మైనారిటీ లపై దాడులు చేస్తొందని దీన్ని కవులు రచయిత లు ప్రజాసంఘాలు ఖండించాలని కోరారు.

ప్రముఖ చరిత్ర అధ్యాపకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామం లో ప్రతి సంవత్సరం దలితులు తమ పోరాట యొదులను స్మరించు కొంటున్న సందర్భంలో హిందూత్వ శక్తులు దాడులు చేశాయని దీనికి ప్రతిఘటన గా దళితులు వామపక్షాలు అభ్యుదయ శక్తులు బంద్ జరగడం అ. పూర్వమైనదని ఇలాంటి పోరాటాలను అందరూ సమర్తించాలని ఆయనకోరారు.ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రామిక వర్గ దృక్పథం అలవరుచుకోవాలన్నారు.కులవివక్ష పోరాట నాయకులు నల్లప్ప ~ బిసి సంఘ నాయకులు నాగరాజు , గన్నా నాయక్ ~ ప్రగతి~  రియాజుద్దీన్ , సురేష్, నాగేశ్వరాచారి, తరిమెల అమర్ నాధరెడ్ది, రాజమోహన్, యాడికి సూర్యనారాయణ రెడ్డి ,ె.   జెన్నె ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


కదిరిలో విద్యార్థులకు కథల పోటీలు




2019 డిసెంబర్ లోవేమన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర, యస్ యఫ్ ఐ నాయకులు బాబ్ జాన్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా గౌరవా ధ్యక్షులు పిళ్లా కుమార స్వామి మాట్లాడుతూ విద్యార్థుల్లో మంచి సృజనాత్మక శక్తి ఉందని దానిని వెలికి తీయటానికి కథ కవిత్వ వ్యాసరచన మొదలైన సాహిత్య పోటీలు ఉపకరిస్తాయని చెప్పారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో  ఈ పాఠశాలలో నెలనెలా కథల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి చదువులో బాగా రాణిస్తారని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నాయకులు  బాబ్ బాన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాల సందర్భంగా  భగత్ సింగ్ పై వ్యాస రచన పోటీలు కూడా నిర్వహిస్తామని విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు . కార్యక్రమాన్ని  సమన్వయ  పరచిన కృష్ణ మూర్తి రాజు  మాట్లాడుతూ పిళ్లా కుమార స్వామి  సాహిత్యరంగంలో విశేష కృషి జరుపుతున్నారని, విద్యార్థి లోకాన్ని  కూడా సాహిత్య రంగం లోకి తీసుకురావడం కోసం కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో  లో తెలుగు ఉపాధ్యాయులు పవన్ ,రమణ ,హరి ప్రసాద్ రెడ్డి,  జయంతి ,చలపతి ,లతీఫ్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. బహుమతులు పొందిన వారిలో ఫర్హాన్, సోహెల్, శ్రావణ్ కుమార్ , కేదార్నాథ్ ,ఈ ఎస్ కరిష్మా విద్యార్థులు ఉన్నారు

సింపోయిజం


సాహితీస్రవంతి సాహిత్య అకాడెమీ సంయుక్తంగా కన్నడ తెలుగు కథల్లో సామాజిక మార్పు‌అంశం పై సింపోయిజం ను ఈ నెల 29న శనివారం రోజున.    హిందూపురం లోని‌సప్తగిరి డిగ్రీకళాశాలలో      జరుపుతున్నట్లు సాహితీస్రవంతి జిల్లా గౌరవాధ్యక్షు లు పిళ్లా కుమారస్వామి    ఒ క ప్రకటన లో తెలిపారు.ఈ సమావేశానికి సాహిత్యాకడెమీ సంచాలకులు ప్రముఖ కవి కె శివారెడ్డి అధ్యక్సులుగా,అకాడెమీ సభ్యులు రాచపాళెం చంద్రసేఖర రెడ్డి కీలకోపాన్యసకులుగా ,పరిచయకర్థగా కుమారస్వామి, అకాడెమీ భాధ్యులు మహాలింగేస్వర్ హాజరవుతున్నారు.ఇందులో వివిధ అంశాలపై రచయితలు పత్రసమర్పణ చేస్తారు.సాహిత్యాభిమానులు హాజరై సభను జయప్రదం చేయాలని పిళ్ళాకుమారస్వామి కోరారు.27.9.2018

2018 లో నగర కమిటీ






సాహితీ స్రవంతి అనంతపురం నగరంలో సాహిత్య కార్యక్రమాలను విరివిగా నిర్వహించడానికి ప్రజాశక్తి బుక్ హౌస్ దగ్గర సాహితీ స్రవంతి కార్యాలయం లో సభ్యులు హాజరై జిల్లా గౌరవాధ్యుక్షులు పిళ్ళాకుమారస్వామి, జిల్లా అధ్యక్షులు కటకం క్రిష్నవేణి,జిల్లా    ప్రధానకార్యదర్సిహిదయతుల్లా సమక్షంలో నగర కమిటీ ని 6.3.2018న ఎన్నుకున్నారు. కమిటీ లో నగరాధ్యక్షులుగా నగరూరు రసూల్,ప్రధానకార్యదర్సిగా దాదా ఖలందర్,ఉపాధ్యక్షులుగా మడూరు ప్రగతి,రాముడులను,సహాయకార్యదర్సిలుగా యల్ ఆర్ వెంకటరమణ, కిశోర్ లను,కోశాధికారి గా రాంప్రసాద్ ను,కమిటీ సభ్యులు గా లహరి,సుధాకర్,నిర్మల,నానీల నాగేంద్ర,ఆదినారాయణ, జెన్నె ఆనంద్,మిద్దెమురలీక్రిష్న,జూటూరిషరీఫ్,యమునారాణి,ముకుందాపురం పెద్దన్న,రియజుద్దీన్,షేక్షావలిలను ఎన్నుకొన్నారు.తదనంతరం ఈ నెల మార్చి 18న ఉగాది కవిసమ్మేలనం నిర్వహించాలని కమిటీ నిర్నయించింది.అల్లాగే శ్రీ శ్రీ ,జషువా,గురజాడ జయంతులను నిర్వహించాలని, విధ్యార్తులకు కవితల పోటీలు నిర్వహించాలని కమిటీ సమావేశం నిర్నయించిందని జిల్లా అధ్యక్షులు క్రిష్నవేణి ఒకప్రకటనలో తెలిపారు.



అనంత సాహిత్య రంగంలో చెరగని చిరునామా ఆశావాది ప్రకాశ రావు



సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డా! ఆశావాది సాహిత్యం పైన 22.4.2018న సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కటకం క్రిష్ణ వేణి , ఖట్టే వాలే దాదా ఖలందర్, చిట్రా రామ్మోహన్ , అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. కటకం క్రిష్ణ వేణి మాట్లాడుతూ ఆశావాది ఒక సాహితీ వట వృక్షం అనీ వర్ధమాన సాహిత్య కారులు ఆయన సాహిత్యం అధ్యయనం చేయాలని కోరారు. సాహితీ స్రవంతి జిల్లా గౌరవ అధ్యక్షులు పిళ్ళ కుమార స్వామి మాట్లాడుతూ ఆశావాది బాల్యం నుండి ఎన్నో కష్టాలు కడగండ్లు అవమానాలను చిరునవ్వుతో ఎదుర్కొని సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో ఎన్నో మైళ్లు రాళ్ళు దాటారు అన్నారు. తనది కవితా కులమని సగర్వంగా చెప్పిన ఆశావాది అందరికీ ఆదర్శనీయుడు అన్నారు.నగర  కార్య  దర్శి దాదా ఖలందర్ మాట్లాడుతూ ఆశావాది తెలుగు సాహిత్యానికి చేసిన సేవ విశిష్టతమైనదని అమోఘమైనది కొనియాడారు. చిట్రా రామ్మోహన్ మాట్లాడుతూ దళితులు పడే కష్టాలను తమ పద్యాల్లో వివరించిన సాహిత్య జీవి ఆశావాది అని కొనియాడారు. ఆశావాది అవధానాలపై మల్లిపూడి రవిచంద్ర మాట్లాడుతూ అవధాన ప్రక్రియ కొన్ని వర్గాలకే చెందినదనే  అభిప్రాయాన్ని  బద్దలు కొడుతూ దళితుడైన ఆశావాది స్వయం కృషితో అవధాన విద్యలో సాధికారత సాధించారని అన్నారు.అష్టావధానాలు ఎన్నో చేసి చాలా రచనలు చేశారు అన్నారు. ఆశావాది పద్య రచనల పై ఏలూరి ఎంగన్న మాట్లాడుతూ ఆశావాది పద్యాలు హృదయానికి హత్తుకునే విధంగా వినడానికి ఇంపుగా ఉంటాయి అన్నారు. ఆశావాది సాహిత్య వ్యాసాలలో వీటూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్తమాన సామాజిక అంశాలను తన సాహిత్య వ్యాసాల్లో వ్రాశారు అన్నారు. ఆశావాది వచన కవిత్వం అంతరంగ తరంగాలుపై దాముగట్ల హిదయతుల్ల మాట్లాడుతూ ఆశావాది కవిత్వంలో రైతాంగ సమస్యలు,  ప్రపంచీకరణలో సంక్షోభ జీవితం గురించి ఎక్కువగా ఉంది అన్నారు. షేక్ రియాజిద్దీన్ తో  సభ ప్రారంభం అయి సత్య నిర్ధారణ వందన సమర్పణ తో కార్యక్రమం అంతపురం  ప్రెస్ క్లబ్ లో చాలా ఘనంగా జరిగింది.

2016 లో నూతన జిల్లా కమిటీ


17.4. 2016 ఆదివారం నాడు జరిగిన సాహిత్యశాల లో జిల్లా వ్యప్తంగా గా వచ్చిన సాహితీ స్రవంతి కార్యకర్తలతో అనంతపురం లో మూడవ నూతన జిల్లా కమిటీని  ఎన్నుకొన్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర గారిని ,అధ్యక్షురాలిగా ప్రగతిగారిని  ,ఉపాధ్యక్షులుగా వై సూర్యనారాయణ రెడ్డి ,సత్యనిర్దారన్(ధర్మవరం) ,అశ్వర్థనారాయణ
(హిందూపురం)  గార్లను ,కార్యదర్శులుగా నీరుగంటి  వేంకటేశు ,పిళ్ళా కుమారస్వామి, ఇటికంటి మహేష్(ధర్మవరం)  గార్లను ఎన్నుకొన్నారు . కమిటీ సభ్యులుగా హిదయతుల్లా ,యమున ,రసూల్,నాగేంద్ర, ,శ్రీధర్నాయుడు, గంగాదేవి ,ధరిత్ర్రీదేవి, చంద్రశేఖర్(యూనివర్సిటి) ,లక్ష్మీనారాయణ(యూనివర్సిటి) ,నర్సిరెడ్డి(పెనుగొండ ) ,ఆవుల వెంకటేశులు(ఉరవకొండ ), రాజశేఖర్(కదిరి )తిప్పేస్వామి(కల్యాణదుర్గం)గార్లను ఎన్నుకొన్నారు . 

2016 లో అనంతపురం లో సాహిత్యశాల

            17.4.2016 న అనంతపురంలో సాహిత్యశాల కార్యక్రమానికి పర్యవేక్షకులుగా వై   సూర్యనారా యణ రెడ్డి  (నగర అధ్యక్షులు) ,ప్రజ్ఞా సురేష్ ఆచార్యులుగా  వ్యవహరించారు . ముఖ్య అతిధి గా సింగమనేని నారాయణ ,ఆత్మీయ  అతిధి గా జంధ్యాల రఘుబాబు ,ప్రారంభ  భోధకునిగా పిళ్ళా కుమారస్వామి పాల్గొన్నారు .సింగమనేని నారాయణ గారు   రాయలసీమ కథాచిత్రము గురించి ప్రసంగించారు. కథలు వ్రాసేవారు ముందుగా ప్రసిద్ధ కథలను చదవాలన్నారు. ముఖ్యంగా మార్క్సిస్టు దృక్పథాన్ని అలవరుచుకొవాలాన్నరు. ప్రతి విషయాన్ని చారిత్రిక  గమనం లో చూడాలన్నారు . మార్క్సిజమంటే చాలామంది భయపడుతుంటారని అది సరియైనది కాదని ఆయన అన్నారు .కథ మొట్టమొదట కోస్తా ప్రాంతంలో ప్రారంబమైందని దీనికి కారణం అక్కడ నీళ్ళు వుండటం ,నాగరికత అభివృద్ధి చెందటం గా  చూడవచ్చని ఆయన అన్నారు. నీళ్ళు లేని రాయలసీమలో కత చాలా  ఆలస్యంగా మొదలైనదన్నారు. మార్క్సిస్టు ఆలోచన విధానం తో మొట్టమొదట రాసిన వారు కడపజిల్లా వారని  వారిలో ముఖ్యులు రాచమల్లు రామచంద్రారెడ్డి ,కేతు  విశ్వనాథరెడ్డి ,సొదుం జయరాం ,రామకృష్ణారెడ్డి మదలైన వారున్నారనిఆయన     పేర్కొన్న్నారుసామాజిక చారిత్రిక దృక్పథముతో చూడకుండా సాహిత్యాన్ని అధ్యనం చేయలేమని సింగమనేని అన్న్నారు. ప్రగతిశీల దృక్పథం వున్నవే చరిత్రలో నిలుస్తాయన్నారు .పాలకవర్గ భావాలే ప్రజల భావాలుగా వుంటా యన్నారు. కథలో వస్తువును ఇతివృత్తం అంటారు. రాసేవిదానాన్ని రూపం అంటారు .  భావజాలాన్ని దృక్పథం అంటారు . సమాజ పరిణామంతో  సంబందం లేకుండా  చూస్తె   అర్థం కాదన్నారు. 

 


కుమారస్వామి  తరువాత సాహిత్య  పరిణామక్రమాన్నివివరించారు . 18వ శతాబ్దంలో యూరప్ లో వచ్చిన పారశ్రామిక విప్లవం ఫలితంగా అక్కడ రొమాంటిసిజం వచ్చింది . దానిప్రభావం మనదేశం లో 20వ శతాబ్దం లో వచ్చింది . బ్రిటిష్  ఆంగ్లవిద్యని  ప్రవేశ పెట్టడం వల్ల  భారతీయుల భావజాలం లో మార్పు వచ్చింది . రాజరామమోహనరాయ్ బ్రహ్మసమాజాన్న్ని సాపించడం వలన సతీ సహగమనం పై పోరాడటం మూలంగా దాని ప్రభావం ఆంధ్రదేశం పై పడింది . అందువల్ల ఇక్కడ భావకవిత్వం వచ్చింది .నండూరి సుబ్బారావు ,కృష్ణశాస్త్రి ,మొదలైన వారంతా భావకవిత్వం లో  మునిగిపోయారు . స్త్రీ పురుషులమధ్య కామసంబంద భావాలు లేకుండా స్నేహ సంబంధ భావాలు  వుండటం భావకవిత్వ లక్షణం . 1920 నాటికి గాంధీ  జాతీయోద్యమ ప్రభావం వలన మాలపల్లి నవలను  వున్నవలక్ష్మినారాయణ రాశారు .గురజాడ ఆధునిక కథానిక దిద్దుబాటు వచ్చింది . అప్పటికే కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం అనే కావ్వ్యాన్ని  రాశారు . దీన్ని ఆధునిక కవిత్వానికి వేగుచుక్కగా భావిస్తారు .భావకవిత్వం పోయి  జాతీయోద్యమకవిత్వం ప్రారంభమైంది . 1930 నాటికి ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభంవచ్చింది . ఫలి తంగా బ్రిటన్ లో లెఫ్ట్ వింగర్స్ తమ న్యూ  సిగ్నేచర్స్ అనే కవితా సంకలనాన్ని రాశా రు . 1930 లో ఇటలీలో ముస్సోలినీ ,జర్మనీలో  హిట్లర్ ల ఫాసిజం విజయవంతం అయింది .  1935 లోఫాసిజానికి  వ్యతిరేకంగా పారిస్ లో రోమారోలా ,వేల్స్ ,థామస్ మాన్ మాక్సింగోర్కీ మొదలైన రచయతలు సమావేశమై ఒక మహాసభ జరిపారు. అందులో భారత దేశం నుండి సజ్జాద్ జహీద్ ,ముల్కరాజ్ ఆనంద్ ,జె సింఘీష్ ,ప్రమోద్సేన్ గుప్తా వంటి వాళ్ళు పాల్గొన్నారు. ఆతరువాత  మన దేశం లో 1936లో ప్రేమ్చంద్ అధ్యక్షతన అభ్యుదయ రచయతల మహాసభ జరిగింది . ఈ సభ కు మన ఆంధ్రదేశం నుండి అబ్బూరి రామకృష్ణారావు  హాజరయ్యారు . అబ్బూరి   రామకృష్ణారావు విశాఖ వచ్చిన తరువాత శ్రీ శ్రీ ,పురిపండా   అప్పలస్వామి లతో కలిసి  ఆంద్ర లేఖిని సంఘం స్తాపించారు . శ్రీశ్రీ  భావకవిత్వం నుండి అభ్యుదయ కవిత్వం లోకి ప్రవేశించారు . 

1942 లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది . ప్రపంచ యుద్ధం జరుగుతూ వుంది . ఫాసిజం రష్యా చేతిలో ఓడిపోతూ వుంది  1943లో తాపిధర్మారావు అధ్యక్షతన అభ్యుదయ రచయతల  సంఘం ఏర్పడింది శ్రీ మహాప్రస్తానంఆరుద్ర త్వమేవాహం ,సోమసుందర్ వజ్రాయుధం,రమణారెడ్డి అ డవి ,గంగినేని ఉదయిని మొదలైన కవిత సంపుటాలు   వచ్చాయి . చాసో కుంకుడాకు ,బొండుమల్లెలు ,కుక్కుటేశ్వర మ్ మొదలైన  కథలు రచించారు . 1935-45 వరకు అభ్యుదయం మొదటి దశ ,ఆతరువాత 1945 -50వరకు రెండవ దశగా భావించవచ్చు . రెండవ దశలో తిలక్,కుందుర్తి ,మొదలైన వారున్న్నారు. వీరంతా నెహ్రూ ప్రభావంలో  వున్నారు. వీరు శాంతి గీతాలను ఆలపించారు. 1950  నుండి 1965 వరకు సాహిత్యరంగంలో స్తబ్దత ఏర్పడింది . అయితే 1952 లో సాహిత్య అకాడెమీ ఏర్పడింది . 1952 లో పాలగుమ్మి  పద్మరాజు రాసిన  గాలివాన కథకు అంతర్జాతీయ బహుమతి లభించింది . ఈ కాలం లో సాహిత్యం ఒక వుద్యమంగా సాగలేదు 1955లో  లో  ప్రేమ  కథలు వచ్చాయి . ఈ కథలన్నీ మధ్య తరగతికి చెందిన కాలేజీచదువుకొనే   అబ్బాయి అ మ్మాయి ల ప్రేమ కథలు ..55-67 మధ్య తిలక్ కథలు వచ్చాయి . ఇవన్నీ పునాదిలేని కథలు . 1952లో  కమ్యూనిస్తుపార్టీ  ఎన్నికల్లో ఓడిపోయింది . అభ్యుదయ కవులంతా సినిమారంగం లోకి వెళ్ళిపోయారు . 1964లో కమ్యునిస్టు పార్టీ చీలిపోయింది . 1950లో  అమెరికాలో బీట్నిక్స్ కవులు  వచ్చారు . బ్రిటన్లో యాంగ్రీయంగ్మన్ కవులు నేక్డ్ పొయట్స్ వచ్చారు . 1958లో బెంగాల్ లో ఆకలితరం కవులు తిరుగుబాటు చేసారు . వీరి ప్రభావం వల్ల కావచ్చు 1965లో  స్తబ్దతను బద్దలు చేస్తూ దిగంబరకవులు వచ్చారు . తమకవిత్వానికి దిక్ లని పేరు పెట్టారు .


వీరునగ్నముని ,నిఖిలేశ్వర్,జ్వాలాముఖి ,చెరబండరాజు మహాస్వప్న ,భైరవయ్య . వీళ్ళు లైంగిక ప్రతీకలను తమ కవితల్లో వాడారు . అశ్లీలత ఎక్కువ . సమాజానికి షాక్ ట్రీట్మెంట్ అనేవాళ్ళు . ఇవన్నీ స్త్రీలను కించపరిచేవిధంగా ఉండేవి .పుండ్లు    పడిపోయిన వక్షం ,పుచ్చిపోయిన పిండం ,మెదడు పురుగు తినేసింది. చర్మం కుళ్ళిపోయింది . అవయవం  పుచ్చిపోయింది . కళ్ళకి కన్నం పడింది . 

1969-71లో కిర ణ్ బాబు ,దేవిప్రియ,ఓల్గా ,కమలనాథ్ లు  పైగంబరకవులుగా వచ్చారు . 1968-70 ,వరంగల్ లో కిషన్రావు ,సుదర్సన్రాలవు లోచన్ ,యాదగిరిరావు ,వరవరరావు ,టంకశాల అశోక్  తిరగబడు కవులుగా వచ్చారు . 1967 లోసి పి  యం  పార్టీ  చీలిపోయింది . సిపిఐ (యమ.ల్ ) ఎర్పడింది  . అదే సందర్బంలో  1970 లో శ్రీ శ్రీ  షష్టి  పూర్తీ జరుగుతుండగా  రచయతలారా మీరెటువైపు అనే కరపత్రం వేసి  శ్రీ శ్రీ తో సహా చాలామంది విరసం ఏర్పాటు చేసారు . శ్రీ శ్రీ అధ్యక్షుడు గా అయ్యాదు. కోకు ,రావిశాస్త్రి ,కే.వి.ఆర్ ,కారాగద్దర్ ,వంగపండు,నగ్నముని,జ్వాలాముఖి ,కే.శివారెడ్డి ,వరవరరావు ,నిఖిలేశ్వర్  మొదలైన వారు చేరారు . సృజన మాసపత్రిక  ప్రారంబ మైన్ది. కాని 1975 నాటికి విరసం తన ప్రాభవం కోల్పోయింది . విరసం లో చీలికలు వచ్చాయి . జనసాహితి  ఏర్పడింది . ఇదికూడా మళ్ళీ చీలిపోయింది . 


1980లో స్త్రీ వాదం దళిత వాదం  ప్రవేశించాయి . 1960-70 లలో యూరప్ దేశాలలో వచ్చిన స్త్రీ వాదం 1980 లలో ఆంధ్రదేశం లో  ప్రవేశించింది .1980లో రష్యాలో పెరిస్త్రోయికా గ్లాస్నోస్త్  మొదలైన మార్పులు వచ్చాయి .  1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్బవించింది . రామారావు మహిళకు ఆస్తిహక్కులో సమానవాటా ఇస్తానని ప్రకటించి అధికారములోకి వచ్చాడు . మగకీ ఆడకీ శీలాన్నీ ఆస్తినీఎ సమంగా వర్తిమ్పించండి  / కాగితాల మీద  వేదికల మెడ కాదు. ,నిజంగా సమంగా వర్తిమ్మ్పించండి ఇలా  కవిత వచ్చింది .   1993లో నీలిమేఘాలు  కవితా సంకలనం వచ్చింది . స్త్రీ వాదం క్రింది సమస్యలను ప్రస్తావించింది . స్త్రీని పురుషుడు దోపిడీ చేస్తున్నాడు . 2. స్త్రీఎ పురుషుల మధ్య సమానత్వం వుండాలి . 3.స్త్రీ పునరుత్పత్తి లో నిర్ణయాధికారం స్త్రీ     కి  వుండాలి . ప్రపంచీకరణ ,వ్యాపార ధోరణులు ప్రభావం తో స్త్రీ వాదం బలహీన పడింది .

 1969 నుండి దళిత సాహిత్యం ముందుకు వచ్చింది .పూలేఅంబేద్క ర్ ,మార్క్స్  ఆలోచనా ప్రభావంతో దళిత సాహిత్యం రూపు దిద్దుకుంది .నలుపు పత్రిక నదిచిన్ది.1970లో వికసించింది 1980లో ప్రవాహంగా రూపుదిద్దుకుంది . 1983లో రామారావు ప్రభుత్వం వచ్చింది . ఆకాలం లోనే వేంపెంట ,చుండూరు ,కారంచేడు  సంఘటనలతో దళిత సాహిత్యం ప్రబలంగా  వచ్చింది .  నాకు చరిత్ర లేదునాలుగు వేదాల్లోంచిపాదాఅలలొంచి నన్ను తొలగించారు అంటూ బోజ్జాతారకం రాసారు . నిజం చెప్పండి ,పంచముడంటే  వేలు లేని వాడ్నేనా అర్థం,మా ముత్తాత  ఏకలవ్యుడు చెప్పాడు అని ప్రశ్నించాడు సత్తీష్ చందర్ . 

మైనారిటి వాద సాహిత్యం పుట్టుమచ్చతో ప్రారంబమైనా గుజరాత్ లో మోడీ నాయకత్వం లో ముస్లిం ల పై పై జరిగిన అమానుష కాండ తరువాత గుజరాత్ గాయం వచ్చింది . జలజల ఆజా ,మొదలైన మైనారిటి  వాద సాహిత్యం ముందుకు వచ్చింది . నేను పుట్టక ముందే ,దేసద్రోహుల జాబితాలో నమోదైవుంది  నా పేరు  అంటూ ఆక్రోశం వ్యక్తం చేసాడు ఖాదర్ మొహిద్దీన్ . 


1990 తరువాత ప్రపచీకరణ ప్రారంబం అయ్యాక మనిషి మాయమై పోయాడు . 20 వ శతాబ్దంలో మనిషి మరనిస్తున్నాడని  ఫ్రామ్ అన్నాడు . వ్యకి వాదం,ఆసలుస్వార్థంవుద్యొగాకవశాలు సంపాదనలు ప్రదానమైనాయి . 

బషీర్బాగ్ లో విద్యుత్ చార్జీల  పెంపు పై ప్రజాపోరాటం పై ప్రభుత్వం జరిపిన మారణకాండ తో  కవులు రచయతలు మెల్కొన్నారు. వికసించిన విద్యుత్ తేజం కవితా సంకలనం వచ్చింది . వ్యక్తులుగా విడిపోయిన సాహిత్యకారులను ఒక్క్కటి చేసేందుకు సాహితీ స్రవంతి ఏర్పడింది . ప్రపంచీకరణ మతోన్మాదం ఉగ్రవాదం లకు వ్యతిరేకంగా కలిసి వచ్చే సాహిత్యకారులందరిని ఒకవిశాలవెదిక మీదకు తెచ్చేందుకు సాహితీ స్రవంతి కృషిచేయడం ప్రారంబించింది . 2001 లో ఏర్పడిని ఈ సంస్త సాహిత్య ప్రస్తానం పత్రికను  తప్పకుండా ప్రచురిస్తోంది . నూతన సాహిత్యకారులకు ప్రోత్సాహానిస్తోంది . సాహితీ  యవనికపై చెరగని ముద్రను ముద్రను వేస్తోంది .

 

రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు గారు మాట్లాడుతూ రాయలసీమ లో వేమన బ్రహ్మంగారు,అన్నమయ్య ప్రసిద్ద్దకవులని పేర్కొన్నారు . రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం  వామపక్ష రాజకీయాలకు పెట్టింది పేరని చెప్పారు. 

తరిమెల నాగిరెడ్డి ,నీలం రాజశేఖర రెడ్డి,రవూఫ్ మొదలైన వారంతా  వామపక్షరాజకీయాలను పెంపొందించా రని  ఆయన అన్నారు . నేటి రచయతలు సింగమనేని రాచపాలెం మొదలైన వారంతా మార్క్సిస్టు దృక్పథం తో రాస్తున్న రచయతలని వారి మధ్య మీరు వుండటం అదృష్టమని ఆయన అన్నారు . కథ కవిత్వం పై సాహిత్య సాల నిర్వహించడం యువరచయతలకు చాల ప్రోత్సాహ కరంగా ఉంటుందని ఆయన అన్నారు . 


కథా రచయిత్రి శశికళ గారు కొన్ని కథ లను చెప్పి కథలెలా రాస్తారో వుదహరించారు. చిన్నపిల్లల  కథలు కొన్ని వినిపించి పిల్లలకు వుత్సాహాన్ని కలిగించారు .

బండి నారాయణ స్వామి  తన చావుకూడు కథను చెప్పాడు . కథలో సంఘటలన్నీ ఒక చోట నుంచీ తీసుకోలేదని వేరు వేరు ప్రాంతాలలో జరిగిన వాటిని కలిపి ఒక కథగా రాసానని అయన వివరించారు . కథలెలా రాస్తారు అన్న ఒక వ్యాసం నకళ్ళ ను  కొన్నింటిని తెచ్చి అందరికి పంచారు . 

                   భోజనాంతరం కవిత్వం పై సాహిత్యశాల నిర్వహించారు 

    కథావస్తువును ఎలా గుర్తించాలో ప్రముఖ కవి రాధేయ గారు వివరించారు . చేనేత కార్మికుల వ్యధ లైనా,రైతుల ఆత్మహత్యలైనా విద్యార్ధి విజయమైనా మహిళల ఆక్రందనైనా కవిత్వంలో ఒదిగించవచ్చని చెప్పారు .మన చుట్టూ వున్న సమాజమే మనకు కవితా వస్తువును అందిస్తుందని ఆయన అన్నారు. రాసిన కవితను పలు మార్లు దిద్దుకోవాలని ఆయన చెప్పారు . కవిత్వం బాగా రాయాలంటే మంచి  కవితా  పుస్తకాలను బాగా చదవాలని ఆయన కొరారు. 


కవితా శిల్పాన్నిగురించ ప్రముఖ కవి మల్లెల నరసింహమూర్తి గారు చక్కగా వివరించారు . నల్ల ద్రాక్షపందిరి లోని కవితలను ఆయన వుదహరించి  ఎలా తీర్చి దిద్దాలో ఆయన వివరించారు . ఘూర్కా  శిఖామణి రాసిన కవితను ఉదహరిస్తూ సిల్పనిర్మానం ఎలాచేయాలో వివరించారు . మన చుటూ వున్నా విషయాలను మనం గమనించి వాటిని పద చిత్రాలలోనూ భావ చిత్రాలలోనూ రాయాలని ఆయన చెప్పారు . ఎలా చెప్పితే  పాటకునికి హత్తుకుంటుందో అదే  శిల్పమని ఆయన చెప్పినారు . శిల్పము ,వస్తువు కవిత్వానికి రెండు రథ చక్రాలాంటివని అన్నారు . కవిత్వం కావాలి కవిత్వం లేదంటే వచనమై తేలిపోతావ్ అని అంటాడు త్రిపురనేని శ్రీనివాస్ . శిల్పం మెరుగు పరుచుకోవాలంటే కవిత్వం ఒక శ్వాసగా ధ్యాసగా చదవాలి అని ఆయన ఆన్నారు . 

 

 

 

 


Friday, August 21, 2020

మానవతా సామాజిక సంస్కార దీపిక సాహితీ స్రవంతి


సాహితీ స్రవంతి ప్రజలకు సాంస్కృతిక కర్తవ్యాలను గ్రహించేలా చేయటానికి గత పదహైదు
ఏళ్ళుగా సముచితమైన కృషి చేస్తున్నది, సాహిత్య సంఘంలో పాఠకులను సంస్కార వంతులుగా
చేయటానికి కవిత్వం, కథ, నవల, విమర్శ లాంటి ప్రక్రియలలో నిజాయితీ, చిత్త శుద్ధితో పరిశ్రమిస్తున్నది.
                __సింగమనేని నారాయణ, సాహితీవేత్త

సమకాలీన సామాజిక అవగాహనల దొంతి సాహితీ స్రవంతి, భావి సాహితీవేత్తలను స్ఫూర్తిని పంచే విజ్ఞానజ్యోతి సాహితీ స్రవంతి, భవిష్యత్ తరానికి భద్రమైన అక్షర భవంతి సాహితీ స్రవంతి

                    ___ఏలూరి ఎంగన్న జనప్రియ కవి

సాహితీవేత్తలు, సాహిత్య పాఠకులు కలిసి ఉత్తమ సాహిత్యాన్ని దర్శించి విశ్లేషించుకునే
సాహిత్య కళాసౌందర్యవేదిక, సమున్నత మానవతా సామాజిక సంస్కార దీపిక సాహితీ స్రవంతి
                  ____మల్లెల నరసింహమూర్తి, అరసం

మతతత్వ ఫ్యూడల్ భావజాలాన్ని ధిక్కరిస్తూ సాహిత్య సాంస్కృతిక చైతన్యానికి శక్తివంచన
లేకుండా కృషి చేస్తున్న సంస్థ సాహితీ స్రవంతి
                                   __రాధేయ, సాహితీవేత్త

'సాహితీ స్రవంతి, సాహిత్య ప్రస్థానం (పత్రిక) జన కవనం (కవిసమ్మేళనం) ఇదొక త్రిపుటి.
ఈ త్రిపుటి సామాజిక పరివర్తన ఏకైక లక్ష్యంగా గురుతర బాధ్యత నిర్వహిస్తున్నది. వామపక్ష భావజాలం ప్రధాన తాత్వికతగా ఉంటూ, ప్రజాస్వభావం గలఇతర భావజాలాలను గౌరవిస్తూ, విశాల ప్రాతిపదిక మీద ఈ త్రిపుటి నిరంతరం శ్రమిస్తున్నది.
                    ___ డా॥రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి,
           కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత



వసంతం తరువాత మరో వసంతం

   
          ఒక సాహితీ సమాలోచన... ఒక ప్రస్థానం
వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది...సాహిత్య కార్యక్రమాలను ఒంటరిగా చేయలేము. ఎంతో మంది సాహిత్యకారులు
కలవాలి. సాహిత్యాభిమానులు ఉండాలి. ఒక వసంతం దాటగానే మరో వసంతం వచ్చినట్లు ఒక సాహిత్య కార్యక్రమం చేయగానే మరో సాహిత్య కార్యక్రమం ముందుకు వస్తుంది. బాధ్యతగా ఉన్నప్పుడు సాహిత్యాన్ని ఉద్యమంగా చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా చేస్తాము. సాహితీ పరులకెప్పుడూ అలసట ఉండదు.‌సాహితీ మిత్రులను ఎప్పుడు ఆహ్వానించినా సభలో కూర్చొని సాహిత్యాన్ని ఆస్వాదిస్తారు.‌కార్యక్రమమంటేనే కాలాన్ని ఘనీభవింపజేయడం. ప్రసంగమంటేనే భావాలను
ఒకళ్ళ నుంచి మరొకళ్ళలోకి ప్రవహింపచేయడం. పదైదేళ్ళ సాహిత్య ప్రస్థానం గతానికి పొడిగింపే. గతమెంతో ఘనకీర్తి, లేకపోతే ఈ ప్రస్థానం సునాయసంగా సాగేది కాదు. ఎంతో మంది ప్రసిద్ధి సాహితీవేత్తలు - రాచపాళెం, సింగమనేని, శాంతి నారాయణ, రాధేయ, మల్లెల, రాజారాం ఇలా ఎంతో మంది జిల్లాలో వున్న సాహితీమూర్తులు సాహితీ స్రవంతికి చేదోడువాదోడుగా, వెన్నుదన్నుగా నిలబడ్డారు. సాహిత్య ప్రస్థానం పత్రికకు చందాదారులుగా, రచయితలుగా ఎంతోసహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నారు.
       కొత్త గొంతుకను పరిచయం చేయటానికి నిరంతరం సాహితీస్రవంతి శ్రమిస్తోంది. పాతతరం సాహిత్యకారులను పరిచయం చేస్తూ కొత్త కలాలకు, గళాలకు ఊతమిస్తూ సాగుతోంది సాహితీ స్రవంతి. అనంతపురం జిల్లాలో సాహితీస్రవంతి ఇప్పటికే రెండు రచనలను 
    Anantha kavithaa swaraalu అనంత కవితా స్వరాలు

ప్రచురించింది. ఒకటి పిళ్ళా కుమార స్వామి రచించిన 'ప్రపంచీకరణపై పోటెత్తిన కవితా 
సముద్రం' రెండు 'అనంతకవితా స్వరాలు', ఇప్పుడు 'అనంత సాహితీసమాలోచన'. ఇంకా 
మరెన్నో రచనలు వర్థమాన సాహిత్యకారుల నుంచి రావాలి.అలా రావాలంటే ఈ సాహిత్య కృషి నిరంతరం కొనసాగాలి.
        జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నాము. జిల్లాలో సాహితీస్రవంతి పదహైదేండ్ల ప్రస్తానాన్ని అక్షరీకరించి పుస్తకరూపంలో మీ ముందుంచాము. దీనిని సాదరంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాము.
ఇదొక సంఘటిత స్వరం. అక్షరాల మాలిక, వ్యాస మంజరి, సాహితీ పూదోట. దీనిలోకి తొంగిచూసి ఒకరినొకరు కరచాలనం చేసుకొన్నప్పుడు ప్రతి స్వరంలోనూ మన హృదయస్పందనలు ఒకళ్ళ నుంచి మరొకళ్ళలోకి ప్రవహించేలా....
    ‌                   
                       పిళ్ళా కుమారస్వామి,
సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు

ప్రపంచీకరణలో దిశానిర్దేశం చేసిన సాహితీస్రవంతి





          

         1990 తరువాత సోషలిజం విచ్ఛిన్నంవల్ల చాలా మంది అభ్యుదయ రచయితల్లో, మార్క్సిస్టు రచయితల్లో భవిష్యత్తుపట్ల నిరాశనిస్పృహలు పెరిగాయి. కొంత మంది మాత్రమే భవిష్యత్తు పట్ల అచంచల విశ్వాసం ప్రకటించారు.ప్రపంచ వాణిజ్య సంస్థలో మనదేశ పాలకులు సంతకం పెట్టిరావడంతో ప్రపంచీకరణ ప్రారంభమైంది. నూతన ఆర్థిక విధానాలు పేరుతో ప్రైవేటీకరణ సరళీకరణ ప్రారంభమైంది. విదేశీ పెట్టుబడి ప్రబలంగా మన దేశంలోకి ప్రవహించింది.అదే సందర్భంలో విదేశీ వస్తువులు ఇబ్బడిముబ్బడిగా మనదేశంలోకి ప్రవహించ సాగాయి. పడమటిగాలి విపరీతంగా వీచింది. భాషా సంస్కృతుల్లో పెనుమార్పులు సంభవించి వాటి అస్థిత్వానికి పెనుప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి పేరిటసామాజిక మూలాలు ధ్వంసం అయ్యాయి. మానవసంబంధాలు విచ్ఛిన్నం కాసాగాయి. ఏది గాయమో ఏది గేయమో అర్థంకాని గందరగోళ స్థితిలోసాహిత్యకారులున్నారు.
           చరిత్ర అంతమైందని జపాన్ తత్త్వవేత్త ఫుకుయామా ప్రకటించారు.అస్థిత్వవాదమే సరైనదేనే దృక్పథం పెరిగింది. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే,పెట్టుబడిదారి వర్గానికి ఊడిగంచేసే ఆధునికానంతరవాదం సాహిత్యంలోకి చొరబడింది. సమాజంలో వేలవేల చీలికలు వచ్చాయి. దళితుల్లో మాదిగదండోరా, మాలమహానాడు, బహుజనాల్లో తుడుందెబ్బ, చాకిరేవుదెబ్బ, వడ్డెర ... ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘాలు వచ్చాయి. ప్రపంచీకరణలో వ్యాపారీకరణ పెరిగి స్త్రీల అందాన్ని పెట్టుబడిగా మార్చారు. దీనితో స్త్రీవాదం పదును తగ్గిపోయింది. దళిత స్త్రీవాదులుస్త్రీవాద లక్ష్యాన్ని ప్రశ్నించసాగారు. సాహిత్యంలో కవులు, రచయితలు ప్రపంచీకరకణ వెల్లువలో కొట్టుకుపోసాగారు.    
           
        ఏది అభివృద్ధి ? ఏది వినాశనమో ? అర్థంకాని అయోమయంలో సాహిత్యకారులు ప్రపంచీకరణ చౌరాస్తాలో నిలబడ్డారు. బషీర్ బాగ్ 
లో ప్రభుత్వం ప్రజల పైన జరిపిన దారుణ దమణకాండ సాహిత్యకారులను కదిలించింది. అందరినీ ఒక్కటి చేసింది. ప్రపంచీకరణ, ప్రపంచ బ్యాంకుల వాస్తవ స్వరూపం సాక్షాత్కరించింది. ప్రపంచీకరణ ప్రతిఘటన మొదలైంది. 'వికసించిన విద్యుత్తేజం' కవితా సంకలనం వచ్చింది. అదే సందర్భంలో ప్రజలలో ఏర్పడిన నైరాశ్యాన్ని ఆసరాగా తీసుకొని
మతోన్మాద శక్తులు విజృంభించాయి. హిందూ, ముస్లిం మతోన్మాదం రెండూ పెరిగిపోయాయి. 'గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్' అనే పరిస్థితి నెలకొంది. నోస్టాల్జియాలోకి సాహిత్యం వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మతోన్మాదానికి, ప్రపంచీకరణకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసివచ్చే సాహిత్యకారులందరిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు 2001లో 'సాహితీ స్రవంతి' తన ప్రథమ సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలకపల్లి రవి, వరప్రసాద్, లక్ష్మయ్యగార్లతో రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఏర్పడింది. దళిత, స్త్రీవాదులనుకలుపుకు పోవాలని నిర్ణయించింది.

          2002లో సాహితీస్రవంతి తన 'సాహిత్య ప్రస్థానం' పత్రికను సాహిత్య కారుల వేదికగా తీసుకువచ్చింది. ఇది త్రైమాసిక పత్రికగా మూడేళ్లు వచ్చింది. తరువాత మాసపత్రికగా నిరంతరాయంగా వస్తోంది. సాహితీ సృజన లోకంలో మంచికదలికను తీసుకువచ్చింది. ప్రగతిశీల సాహిత్యకారుల హృదయాల్లో మంచి సుస్థిర స్థానాన్ని సంపా దించింది. 2001 ముందు 

దర్పణం, గమనం, ప్రస్థానం,‌సాహిత్య సంచికలను తెలకపల్లిరవిగారి సంపాదకత్వాన ప్రజాశక్తి సాహితీసంస్థ తరపున అందించారు. ఈ ఒరవడిలో సాహిత్య ప్రస్థానం పత్రిక అన్ని వర్గాల సాహిత్య కారులకు ముఖ్యంగా కొత్తతరం సాహిత్య సృజన కారులకు మంచి వేదికైంది.

          2014లో  తెలంగాణా విడిపోవాలనే వాదన బలంగా పెరిగి అంతిమంగా విడిపోయింది. ఆ తరువాత రాయలసీమ అస్థిత్వవేదన ప్రారంభ మైంది.

      - పిళ్ళా విజయ్,9490122229

Thursday, August 20, 2020

సామాజిక పరివర్తనే ఏకైక లక్ష్యంగా

          
         'సాహితీ స్రవంతి' (సంస్థ) సాహిత్య ప్రస్థానం (పత్రిక) జన కవనం (కార్యక్రమం) ఇదొక త్రయం, లేదు త్రిపుటి. 

ఈ త్రిపుటి పుష్కర కాలంగా తెలుగు
సమాజంతో పెనవేసుకుపోయింది. 
సామాజిక పరివర్తన ఏకైక లక్ష్యంగా గురుతర బాధ్యత నిర్వహిస్తున్నది. తెలుగు సాహిత్య పునర్వికసనం పరమ లక్ష్యంగా కృషి చేస్తున్నది. వామపక్ష
భావజాలం ప్రధాన తాత్వికతగా ఉంటూ, ప్రజాస్వభావం గల ఇతర భావజాలాలను గౌరవిస్తూ, విశాల ప్రాతిపదిక మీద ఈ త్రిపుటి నిరంతరం శ్రమిస్తున్నది. సాహితీ స్రవంతి కార్యక్రమాలలో పాల్గొనడం, సాహిత్య ప్రస్థానంలో రచనలు ప్రచురణ కావడం, జనకవనంలో కవులుగా పాల్గొనడం, గౌరవంగా, మర్యాదగానే గాక, గొప్ప బాధ్యతగా సాహితీ పరులు భావిస్తుండడం నిజం. వర్తమాన సమాజ పరివర్తనకు అవసరమైన భావ ప్రచార
నిర్వహణలో ఈ త్రిపుటి పాత్ర తిరుగులేనిది, తిరస్కరించలేనది. ఈ త్రిపుటి ద్వారా ఎందరో ఔత్సాహికులు విమర్శకులుగా, రచయితలుగా వెలుగులోకి వచ్చారు. సామాజిక గౌరవం పొందారు.
        2002 నాటి బషీర్ బాగ్ దుర్ఘటనతో మొదలై రాష్ట్ర స్థాయిలోనూ,జిల్లాల స్థాయిలోనూ అనేక జనకవనం కార్యక్రమాలు జరిగాయి. ప్రతి జనకవనం అప్పటి సామాజిక పరిణామాలకు కళాత్మకమైన కైఫియత్ గా నమోదవుతున్నది.
          లబ్ధ ప్రతిష్ఠులైన కవుల నుండి ఔత్సాహికుల దాకా ఒకే వేదిక పైకి వచ్చి జనం గురించి తమ గళం విప్పడానికి సంకోచించని కార్యక్రమం జనకవనం. 

తెలకపల్లి రవి గారి నిబద్ధత, నిమగ్నతలు ఈ త్రిపుటిని ప్రజాపరం చేస్తున్నాయి. ఆనందాచారి,

వొరప్రసాద్ వంటి సహ సైనికుల ద్వారా ఉద్యమస్థాయిలో సాహిత్య చర్చలు,ప్రచురణలు, కార్యక్రమాల నిర్వహణ సాగుతున్నాయి. ఈ సైన్యంలో భాగస్వామి అనంతపురం జిల్లాలో పిళ్ళా కుమారస్వామి. 
  
           అనంతపురం జిల్లా సాహితీ స్రవంతిని బాధ్యతగా కుమారస్వామి గత పదహైదు ఏండ్లుగా ప్రతి సందర్భంలోనూ కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. ఇతర సాహితీ సంస్థలు స్తబ్ధంగా ఉన్న సమయంలో 

కుమారస్వామి తనదైన మార్గంలో సాహితీ స్రవంతిని ప్రవహింపజేస్తున్నారు. ఆయన కృషిలో భాగమే ఈ 'అనంతసాహితీ స్రవంతి'. అనంతపురం జిల్లా సాహితీ స్రవంతి సుదీర్గ ప్రయాణంలోఇదొక కేంద్ర బిందువు. ఈ దశకు చేరుకోవడానికి 'అనంత' రచయితల, కార్యకర్తల సహకారం మరువలేనిది.

     - (అనంత కవితాస్వరాలు కవితా సంకలనానికి
రాసిన ముందు మాట నుంచి)

  - డా॥ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి