Saturday, June 27, 2020

అనంతపురంలో కార్మిక సాహిత్యంపై సదస్సు



       

          సాహిత్య అకాడమీ, సాహితీస్రవంతి కలిసి కార్మిక
సాహిత్యంపై ఒక రోజు సదస్సును అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో 15-12-2016 ఆదివారం నాడు ఒక రోజంతా   సదస్సు నిర్వహించాయి.
            ప్రారంభ సమావేశానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లిరవి విచ్చేశారు.  సింగమనేని నారాయణ (కార్మికకథలు). మేడిపల్లి రవికుమార్ (కార్మికకవిత్వం) శ్రీమతి సంజీవమ్మ (కార్మిక నవలలు), శాంతారావు (కార్మిక నాటకాలు)  వారికి కేటాయించిన అంశాలపై ప్రసంగించారు.  సాహితీ స్రవంతి జిల్లా ప్రధానకార్యదర్శి వల్లెపు రవిచంద్ర ఆహ్వానం పలికారు.
               అధ్యక్షత వహించిన పిల్లా కుమారస్వామి  మాట్లాడుతూ కార్మికుల సాహిత్యం మొత్తం సాహిత్యంలో చూస్తే చాలా తక్కువగా ఉందని ఆ లోటును పూడ్చడానికి సాహిత్యకారులు కార్మికుల సంబంధించి విరివిగా రచనలు చేయాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, జీవనపోరాటాల గురించి సాహిత్యంలోకి తీసుకురావాల్సిన అవసరం గురించి తెలిపారు. అస్థిత్వవాదాలపై చర్చ జరిగినంతగా కార్మిక సాహిత్యం పై జరగలేదన్నారు. కార్మిక సాహిత్యం పై చర్చ జరిగితే ఆస్థిత్వవాదాలు వెనుకబడు తాయని ఆయన చెప్పారు.
             గురజాడ కన్యాశుల్కంలో ప్రస్తావన కొచ్చిన శ్రమ గురించి అంశాల వారీగా వివరించారు రాచపాళెం గారు.
తెలకపల్లి రవి గారు ప్రసంగిస్తూ శ్రమ అనేది సాహిత్యంలో ఎంత వరకు ప్రతిఫలించిందని పరిశీలిస్తే రాజుల కాలంలో రాజులకు సంబంధించిన అంశాలు తప్ప శ్రమజీవుల గురించి ఏమాత్రం కనిపిందన్నారు.భక్తి సాహిత్యంలో అక్కడక్కడ తమకు తెలియకుండానే శ్రమజీవుల గురించి రాశారన్నారు. పోతన రాసిన భాగవతంలో కొన్ని ఉదాహరణలు వివరించారు. సోవియట్ రష్యాలో కార్మికుల రాజ్యం ఆవిర్భవించాక శ్రామికుల గురించి సాహిత్యంలోకి ప్రవేశించిందన్నారు. 1922లో మాలపల్లి నవలలు, 1934,35లో వచ్చిన అమ్మ నవల అనువాదం ద్వారా, 1934లో శ్రీశ్రీ రచనలు ద్వారా శ్రామిక సాహిత్యం తెలుగులోనికి వచ్చిందన్నారు.

           రెండో సెషన్లో   సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు ప్రగతి అధ్యక్షత వహించారు.కార్మికుల కథల పై  సింగమనేని నారాయణ మాట్లాడుతూ సాహిత్యాన్ని శ్రామికకోణం నుంచి
చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. . మార్క్స్ భావజాలం మూలంగానే శ్రామిక దృక్పథం చాలా మందిలో ఏర్పడింది.
కె.సభా రాసిన కథల్లో ఎక్కువ భాగం వ్యవసాయ కార్మికుల గురించే ఉందన్నారు. మధురాంతకం రాజారాం
శ్రమజీవులకు సంబంధించిన అనేక కథలు రాశారు. తెలంగాణా ప్రాంతం నుంచి చేనేత కార్మికులు, వృత్తిదారుల కథలు విరివిగా వచ్చాయన్నారు. కల్లుగీత, వడ్రంగి, కమ్మరి, కుమ్మరుల కథావస్తువులు వచ్చాయన్నారు. మధురాంతకం
నరేంద్ర భవన నిర్మాణ కార్మికుల గురించి కథలు రాశారన్నారు. శ్రమకు గౌరవం ఇవ్వగలిగిన సాహిత్యం శ్రామిక
సాహిత్యమన్నారు. ప్రపంచం శ్రమమూలంగానే నడుస్తున్నదని చెప్పినవాడు మార్క్స్ .మానవ చరిత్ర నిర్మాతలు శ్రామికులే నన్నారు.

          కార్మిక నాటక సాహిత్యం సెషన్‌కు ప్రముఖ నాటక రచయిత యక్కలూరి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ప్రధానవక్త శాంతారావు కార్మిక నాటక సాహిత్యంపై ప్రసంగించారు. శ్రమసాహిత్యం గురించి మాట్లాడాలంటే
మొదట వేమన నుంచి చెప్పుకోవాలన్నారు. శ్రీశ్రీ నుంచి మాట్లాడుకోవాలన్నారు. శ్రామికులకు సంబంధించి మా భూమి,
ముందడుగు నాటకాలు వచ్చాయన్నారు. రక్తకన్నీరు. జగన్నాథ రథ చక్రాలు వంటి నాటకాలు ప్రజలను కదలించాయి.
సప్దర్ హష్మి నాటకం పూర్తిగా వీధినాటకం. ప్రజల మధ్యన ఉంటూ ఎలాంటి స్టేజి లేకుండా వేసే నాటకం వీధి నాటకం.
కళాజాతలు జరిగినప్పుడు నాటకాలు వేస్తే జనం నాటకంలో పాత్రలతో కలసిపోయేవారు. 'కార్మికులారా ఏకం కండి'
అంటే ప్రజలు కూడా ఏకంకండి' అనే నినాదాలు ఇచ్చేవారు. ప్రపంచీకరణతో జీవితం సంక్షోభ భరితం అవుతున్న వేళ
ప్రజలకు ఆశను,  ధైర్యాన్ని ఇచ్చే నాటకం రావాలి. మీడియాను వదలి ప్రజలు నాటకాలు చూసే దశ రావాలంటే కొత్తగా
రాయాలి. భార్య చనిపోతే మోసుకుపోయే పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఉంది. ఇలాంటి అమానవీయ దృత్యాలపై ప్రజలు
స్పందించే విధంగా మనం నాటకాలు రాయాలి, వేయాలి.
ప్రముఖకవి ఏలూరి ఎంగన్న దానికి స్పందనగా కొన్ని నాటకాల గురించి వివరించారు. పాలేరు, నంది, ముఠామేస్త్రీ
పంటి నాటకాలు శ్రామికుల గురించి రాసినవన్నారు. వాటిని ప్రదర్శించినప్పుడు ప్రజలు బాగా స్పందించారన్నారు.
              భోజనానంతరం జరిగిన కార్మిక కవిత్వం సెషనుకు  కవి నాగేంద్ర అధ్యక్షత వహించారు.డా|| మేడిపల్లి రవికుమార్, కార్మిక కవిత్వంపై ప్రసంగించారు. నన్నయ కాలం నుంచి తెలుగు సాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల అంతకు ముందున్న సాహిత్యం మరుగునపడి పోయిందన్నారు. నన్నయకు ముందు విశేషమైన జూనపద సాహిత్యం ఉంది. అందులో శ్రామికుల గీతాలే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఆ గేయాలను కవిత్వాలుగా శ్రామికులే పాడారు.  వారి సమిష్టి సంపద అది. శ్రామిక కవిత్వం పై పెద్దగా పరిశోధన లేదు. కేవలం దళితవాదం, స్త్రీవాదం బహుజనవాదం పై జరిగిన పరిశోధన శ్రామికుల కవిత్వంపై పెద్ద చర్చ జరగలేదు. దీనిని విశ్వ విద్యాలయాలు పట్టించుకోవాలన్నారు.
             కార్మిక నవలా సాహిత్యం'పై సభ కొనసాగింది. ఈ సభకు ప్రముఖ కథారచయిత్రి శశికళ అధ్యక్షత వహించారు. ప్రధానవక్త డా॥ సంజీవమ్మ గారు హాజరయ్యారు. ఆమె అక్కినేని కుటుంబరావు రచించిన 'కార్మికగీతం' నవలపై, శిరంశెట్టి కాంతారావు రచించిన 'వ్యూహం' నవలలపై కూలంకుషంగా చర్చించారు. ఇవి రెండూ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ప్రధాన నవలలు.కార్మిక సాహిత్యం సంబంధించిన నవలలు తక్కువగా ఉన్నాయన్నారు. కార్మికగీతం 'సిటు' (సి.ఐ. టి.యు.) సంస్థ ప్రచురించిందని చెప్పారు. దీనిలో కార్మికులు పడే బాధలు, వాటి నుండి బయటపడటానికియాజమాన్యంతో చేసే పోరాటాలు, చట్టాలు మొదలైనవి ఉన్నాయన్నారు. వ్యూహం నవల చదివితే కార్మికులు ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నారా? అని బాధ కలుగుతుందన్నారు. నవల ప్రారంభమే ఒక భీభత్స దృశ్యంతో ప్రారంభమవుతుంది. కార్మికుడు నిర్మాణంలో వున్న ఏడు అంతస్థుల టవర్ పై పనిచేస్తూ పై నుంచి జారి కిందకు పడుతూ కడ్డీలపై బడి దాన్లో ఇరుక్కొని చనిపోయే సంఘటనతో నవల ప్రారంభమువుతంది. ఆ కార్మికునికి నష్టపరిహారమిప్పడానికి యాజమాన్యం ఒప్పుకోదు. సంఘాలు ప్రవేశిస్తాయి. కొన్ని సంఘాలుగా నటిస్తూ కార్మికులకు ద్రోహం చేస్తుంటాయి. ఒక సంఘం నికరంగా నిలబడి ఆ కార్మికుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పిస్తారు. ఇలా సాగుతుంది నవల అని చెప్పారు. ఈ నవలలో యజమానుల వ్యూహాలు ఎత్తగడలు తెలుస్తాయన్నారు.
            జనరల్ కార్మిక సాహిత్యంపై ప్రఖ్యాత కథ, నవలా రచయిత, కవి, నాటక రచయిత, పాటల రచయిత అయిన తెలకపల్లి రవి కార్మికవర్గ సాహిత్యం గురించి సోదాహరణంగా చెప్పారు. మార్క్సిస్టు అయితేనే కార్మికుల గురించి రాయ గలడని చెప్పడం అంత సవ్యంగా లేదన్నారు. మార్క్సిజం తెలియకపోయిన, మార్క్సిస్టు కాకపోయిన వారుకూడా, శ్రామిక సాహిత్యం రాశారన్నారు. వివిధ అస్థిత్వ వాదాలు చర్చల్లో వున్నా కూడా శ్రామిక సాహిత్యం గురించి చర్చలేదన్నారు. విశ్వవిద్యాయాలు విద్యార్థులచే ఈ దిశగా పరిశోధనలు చేయించటం అవసరమన్నారు. కార్మిక సాహిత్యం రూపొందించ డానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాహిత్య అకాడమీ ఇలాంటి వారికి చేయూతనివ్వదం ఎంతో గొప్ప విషయమన్నారు.
           పిళ్లా కుమారస్వామి వందన సమర్పణతో లిటరరీ ఫోరమ్ కార్యక్రమం ముగిసింది.

Friday, June 19, 2020

2017

2/2017
సమాజదుర్లక్షణాలను కవులు ప్రశ్నించాలి.~~~ చంద్రశేఖరశాస్త్రి





సాహితీస్రవంతి ఆద్వర్యంలో స్తానిక యమ్ ఆర్ సి భవనం లో అదినారాయణరెడ్డి అధ్యక్ష తన జరిగిన ఇపుడు వీస్తున్నగాలి కార్యక్రమం లో ముక్య అథితిగా చంద్రశేఖరశాస్త్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కవులు సమాజంలో ప్రజలకు జరుగుతున్న  అన్యాయాలను తమ కవిత్వం ద్వారా ప్రస్నించాలని ప్రజలకు ప్రశ్నించే శక్తిని ఇవ్వాలని కోరారు.
కవులు కవిత్వం ద్వారా కష్టజీవులకు కుడిఎడమల నిలబడాలని ఆయన కోరారు.
చంద్రశేఖర శాస్త్రిగారు రచించిన కత్తులవంతెన కవితా సంపుటిపై సాహితీస్రవంతి రాష్త్ర సభ్యుడు పిల్లా కుమారస్వామి రెడ్డి సమీక్ష చేస్తూ కవి సమాజాన్ని బాగా అధ్యయనం చేశాడన్నారు.రైతుల ఆత్మహత్యలన్ని రాజ్యం చేస్తున్న హత్యలని కవి చెప్పడం కవి ఎవరి పక్షమో తెలుస్తోందన్నారు.కవిత్వం కష్టజీవి కన్నీరు తుడిచే ఓ చల్లని హస్తం కావాలని ఆయన కోరాడన్నారు.తరువాత సాహితీస్రవంతి పట్టణ అధ్యక్షుడు చెన్నక్రిష్న మాట్లాడుతూ చంద్రశేఖరశాస్త్రి సమకాలీన జీవితాన్ని తన కవిత్వంలో వ్యక్తీరించాడన్నారు.సాహితీస్రవంతి ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ చం ప్రజాకవి అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ధర్మవరం నుండి వచ్చిన సాహితీవేత్త షమీవుల్లా అనంతపురం నుండి  వచ్చిన అంకె శ్రీనివాస్ కవులు శంకరనారాయణరాజు సుందరమోహన రెడ్డి లెక్చరర్ కవిత గారు ఓబులపతి అబ్దుల్ఖఖాన్ తదితరులు పాల్గొన్నారు.

30.4.2017 న వేమన సాహిత్యం పై రాష్ట్ర సదస్సు నిర్వహించాను.









సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి సంయుక్తంగా
కార్మిక సాహిత్యంపై అనంతపురంలో ప్రెస్‌క్లబ్‌లో డిసెంబర్‌,2017,
15న ఒకరోజు సదస్సు నిర్వహించాయి.




ప్రారంభ సమావేశానికి సాహితీసప్రవంతి రాష్ట్ర కమిటి
సభ్యులు పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య
అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (గ్రహీత
రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, సాహిత్య ప్రస్థానం ప్రధాన
సంపాదకులు తెలకపల్లి రవి విచ్చేశారు. ప్రసంగకర్తలు
సింగమనేని నారాయణ (కార్మికకథలు), మేడిపల్లి రవికుమార్‌
(కార్మికకవిత్వం) శ్రీమతి సంజీవమ్మ (కార్మిక నవలలు),
శాంతారావు (కార్మిక నాటకాలు) వేదిక నలంకరించారు.
వీరందరిని వేదికపైకి సాహితీప్రవంతి జిల్లా ప్రధానకార్యదర్శి
వల్లెపు రవిచంద్ర ఆహ్వానించారు.

అధ్యక్షత వహించిన పిళ్లా కుమారస్వామి ఆ రోజు
జరిగే కార్యక్రమాన్ని సభికులకు వివరించారు. ప్రధానంగా
కార్మికుల సాహిత్యం చాలా తక్కువగా ఉందని ఆ లోటును
పూడ్చడానికి సాహిత్యకారులు కార్మికులకు సంబంధించి
విరివిగా రచనలు చేయాలని కోరారు. కార్మికులు
ఎదుర్కొంటున్న సమస్యలు సాహిత్యంలోకి తీసుకురావాల్సిన
అవసరం గురించి తెలిపారు. అస్తిత్వవాదాలపై చర్చ
జరిగినంతగా కార్మిక సాహిత్యంపై జరగలేదన్నారు. కార్మికసాహిత్యంపై చర్చ జరిగితే అస్తిత్వవాదాలు వెనుకబడుతాయని
ఆయన చెప్పారు.

వివిధ అంశాలపై నిరంతరం
సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందని రాచపాళెం
చంద్రశేఖరరెడ్డి వివరించారు. గురజాడ కన్యాశుల్కంలో శ్రమ
గురించి అంశాల వారీగా వివరించారు.
కార్మిక నాటక సాహిత్యంపై ప్రసంగించారు. శ్రమసాహిత్యం
గురించి మాట్లాడాలంటే మొదట వేమన గురించి
'చెప్పుకోవాలన్నారు. శ్రీశ్రీ నుంచి మాట్లాడుకోవాలన్నారు.
శ్రామికులకు సంబంధించి మా భూమి, ముందడుగు
నాటకాలు వచ్చాయన్నారు. రక్తకన్నీరు, జగన్హాథరథ చక్రాలు
వంటి నాటకాలు ప్రజలను కదిలించాయని, సప్టర్‌ హష్మి
నాటకం పూర్తిగా వీధినాటకమని, ప్రజల మధ్యన ఉంటూఎలాంటి స్టేజి లేకుండా వేసే నాటకం వీధినాటకమని
తెలిపారు. కళాజాతాలు జరిగినపుడు నాటకాలు వేస్తే జనంనాటకంలో పాత్రలతో కలసిపోయేవారని, ప్రపంచీకరణతో
జీవితం సంక్షోభ భరితం అవుతున్న వేళ ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని
ఇచ్చే నాటకం రావాలన్నారు.

ప్రముఖ కవి ఏలూరి ఎంగన్న స్పందనగా కొన్ని
నాటకాల గురించి వివరించారు. 'పాలేరు, నంది, ముఠామేస్త్రీ"
వంటి నాటకాలు (శ్రామికుల గురించి రాసినవన్నారు. వాటిని
ప్రదర్శించినపుడు ప్రజలు బాగా స్పందించారన్నారు.

మధ్యాహ్నం భోజనానంతరం జరిగిన కార్మిక కవిత్వం'సెషనుకు వర్ధమాన కవి నాగేంద్ర అధ్యక్షత వహించారు.'డా॥ మేడిపల్లి రవికుమార్‌, నన్నయ కాలం నుంచి తెలుగుసాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల అంతకుముందున్న సాహిత్యం మరుగునపడి పోయిందన్నారు.
నన్నయకు ముందు విశేషమైన జానపద సాహిత్యం ఉందనీ,అందులో శ్రామికుల గీతాలే ఎక్కువగా ఉన్నా వాస్తవానికి ఆగేయాలను కవిత్వాలుగా శ్రామికులే పాడేవారని, వారే కర్తలు,
వార్లకు పేర్లు లేవని, అవి వారి సమిష్టి సంపద అన్నారు.
శ్రామిక కవిత్వంపై పెద్దగా పరిశోధన జరగలేదన్నారు.విశ్వవిద్యాలయాలు పట్టించుకోవాలన్నారు.

తదనంతరం “కార్మిక నవలా సాహిత్యం" పై సభ
కొనసాగింది. ఈ సభకు ప్రముఖకథారచయిత్రి “శశికళా అధ్యక్షతవహించారు. వ్రధానవక్త డా!సంజీవమ్మ హాజరయ్యారు. ఆమె అక్కినేని  కుటుంబరావు రచించినకార్మిక గీతం” శిరంశెట్టి కాంతారావురచించిన “వ్యూహం” పై ప్రసంగించారు.

LITERARY FORUM ON "AGRARIAN NOVELS IN TELUGU LITERATURE“ PROGRAMME REPORT
To
SP Mahalingeswar,
Regional Secretary,
Sahiti Academy,
RO Bangalore.
Sahitya Academy Benguluru & Sahiti Sravanti jointly conducted Literary forum on
"Agrarian novels in telugu literature" at S.V.U. Arts Block Auditorium Tirupati, on 4 September
2017. Two hundred spectators were participated in this programme. Telugu lit students,
Scholars, lectures, writers, farmers and cultural artists were also participated. The program
started 10 o'clock and closed 2 o'clock
Sahiti Sravanti, Tirupati, convener O.Venkataramana introduced the literary forum
program and invited Guests & participants. Popular Telugu Literature Critic, Writer, Professor
Medipali Ravi Kumar presided the meeting. He spoke that most of the Agrarian Novels were
written by the Rayalaseema writers. Farmers' happiness is only nation's strength. Chief Guest
S.V.U. Arts College principal Professor Savaraiah gave most valuable information about downfall
in agricultural economy since two decades. He added that globalization destroyed the
agriculture hence lackhs of farmers commited suicide
Professor N. Munirathanamma presented Lankipalli Kannaiah Naidu's novel "PACHAGA
NOORELLU. She admired and explained family relationships at village & the effects of drought
on the farmer's family and farmer's affection on land.
Professor S. Rajeswari presented Sannapa Reddy Venkatarami Reddy's navel "OKKA
VAANA CHALU". She categorically described them and characterized the economic situation of
village culture. Farmer migrates to city leaving his land due to heavy drought. Then farmerbecomes labour. He returned to village soon after rain comes. She also quoted the attitude of humanity, affection towards crap, whereas corporate capitalists selfishness Professor R. Rajeswaramma presented Sunkoji Devendra Chari's "VAANA NELA NEERU"She described novel in all aspects. Chittoor district farmers depend on bore wells, spending lakhs of rupees to dig. As ground waters are nil, farmer commits suicide. His wife confidentlyenters into agriculture. She struggled against hardies. Even the debts raised double, but she continues the cultivation confidently Writer and critic Sri Piilaa Kumara Swami, presented Palamaneru Balaji's "NELA NAVVINDI. He explained novel in historical aspect where the Government prestigiously brought an Israeli Company to introduce new way of farming at Kuppam. The company took lands from farmers and they promised them to pay Rs. 30,000/Acre after crop. But they paid only Rs.5,000/-, Land fertility induced, farmers ruined and migrated to Bengaluru.Praja Natya Mandali artists Jagananna, Venu, Suhasini, Palani, Subbu sang Rythula Paatalu (Farmers' songs) Sunkoji Devendra Chari, Lankipalli Kannalah Naicu, MadurantakaNarendra, Shanmugam and Sakam Nagaraju were attended. Vote of thanks addressed byresearch scholar Adi Seshaiah.

Yours faithfully,

(CONVENOR, SAHITI SRAVANTHI)
O, VENKATA RAMANA
14-638, Panchali Nagar, Renigunta,
Chittoor Dist. A.P. -517 520.
Contact: +91-9494512930
E-mail: ovramana 1961@gmail.com
CS Scanned with CamScanner

అనంతపురంలో సాహితీ స్రవంతి ప్రస్థానం2016నివేదిక


      1990 తరువాత సొషలిజం విచ్హిన్నం వల్ల చాలామంది అభ్యుదయ రచయతల్లో,మార్క్సిస్టు రచయితల్లో  భవిష్యత్తు పట్ల నిరాశా నిస్ప్రుహలు పెరిగాయి.కొంతమంది మాత్రమే  భవిష్యత్తు పట్ల అచంచల విశ్వాసం ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య సంస్టలో మన దెస పాలకులు సంతకం పెట్టిరావడంతొ పడమటిగాలి  ప్రారంబమైంది. నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రభుత్వరంగ సంస్తల  ప్రవేటీకరణ,  చట్టాల  సరలీకరణలను పాలకులు ప్రాంభించారు. స్వేచ్చా వాణిజ్యమంటేనే దేశాలన్నిటిని సంతలులుగ మర్చడం.  అవధులులేని పెట్టుబడి దేశంలోకి ప్రవహించడం. వస్తు సముదాయమంతా ప్రజలను ముంచెత్తడం. అప్పులతొ అభివ్రుద్ధి పాలకుల నినాదమైంది. అభివ్రుద్ధిపేరుతొ సామాజిక మూలాలు ధ్వంసం కాసాగాయి.పర్యావరనం దెబ్బతినింది.  భాషా సంస్క్రుతుల్లొ పెను మార్పులు సంభవించాయి. మానవ సంబంధాలు విచ్చిన్నం కాసాగాయి.  ఏదిగాయమో ఏదిగేయమో అర్థం కాని గందరగోళస్తితిలో సాహిత్యకారులున్నారు.

                  చరిత్ర  అంతమైందని జపాన్ తత్వవేత్త పుకుయామా తీర్మానిచారు.పెట్టుబదీ దారివ్యైమమని సొషలిజం అన్నది లేదని చెప్పారు.అస్తిత్వవాద ద్రుక్పధం పెరిగింది.  ఆధునికాంతరవాదాన్ని  సహిత్యంలోకి  ప్రవేశపెట్టారు .సమిష్టి నినాదం స్తానం లొ వ్యక్తిగత నినాదం పెరిగింది.  సమాజంలో  వేల వేల చీలికలు వచ్చాయి.ఇక్యంగా పోరాడాల్సిన  దలితులు మాదిగ దండోరా, మాలమహానాడుగా  చీలిపోయారు. బహుజనుల్లో తుదుందెబ్బ,చాకిరేవుదెబ్బవద్దేర ఇలా కుల సంఘాలు పుట్టుకొచ్చాయి. ఫట్టనీకరణ పెరిగి   పల్లెలు మాయమయ్యాయి. వాణిజ్య రంగం స్త్రీల అందాన్న్ని పెత్తుబడిగా మార్చింది.విదేశీ వలసలు  ప్రారంభమైనాయి.    వృద్దుల సమస్య పిల్లల సమస్య  మొదలైన కొత్త సమస్యలు రావడం మూలంగా స్త్రీ వాదానికి పదును తగ్గిపొయింది.    దళిత  వాదం కూడా   చీలికల వలన  మునుపటి వేడి  తగ్గిపోయింది. ప్రపంచీకరణ వెల్లువలో సాహిత్యకారులు  కొట్టుకు పోయారు. తెలంగాణా విడిపోవాలనే వాదన పెరిగింది.

                     ఏది అభివృద్దో ఏది వినాశనమో అర్థంకాని అయోమయంలో సాహిత్యకారులు ప్రపంచీకరణ  చౌరస్తాలో నిలబడ్డారు.  గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అనే పరిస్తితి లోకి వెళ్ళారు. నోస్టాల్జియా  లోకి వెళ్ళారు . బషీర్బాగ్ లో ప్రభుత్వం జరిపిన దారుణ దమనకాండ సాహిత్య కారులను కదిలించింది.అందరినీ ఒక్కటి చేసింది. ప్రపంచీకరణ ప్రపంచబ్యాంకుల  వాస్తావ  స్వరూపం సాక్షాత్కరించింది.ప్రపంచీకరణ ప్రతిఘటన మొదలైంది.  వికసించిన విద్యుత్తేజం  కవితా సంకలనం వచ్చింది.అదే సందర్భంలో ప్రజల్లో ఏర్పడిన  నైరాశ్యాన్ని   ఆసరాగా తీసుకొని మతోన్మాదశక్తులు  విజృంభించాయి . ఈ నేపధ్యం లో మతోన్మాదానికి ప్రపంచీకరణకుఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే  సాహిత్యకారులందరిని ఒక వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు 2001 లో     సాహితీ స్రవంతి  ప్రధమ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేసింది.ఈ సమావేశం లొ తెలక పల్లి రవివొరప్రసాదు,  గార్లతో రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఏర్పడింది . దళిత స్త్రీవాదులను కలుపుకొని పోవాలని నిర్ణయించింది . 2002 లో సాహితీ స్రవంతి సాహిత్య కారుల కోసం ఒక వేదిక గా ఒక  ఏర్పాటు చేయాలని నిర్ణయించింది 

         సాహిత్య ప్రస్థానం పత్రిక    త్రైమాసిక పత్రికగా మూడేళ్ళు నడిచి తరువాత మాసపత్రికగా నిరంతరంగా వస్తోంది . సాహితీ సృజన లోకం లో మంచికదలికలను తీసుకు వచ్చింది . ప్రగతి శీల సాహిత్యకారుల హృద యాల్లొ సుస్తిరస్తానాన్ని  సంపాదించింది. 2001 ముందు దర్పణం గమనం ప్రస్తానం సాహిత్య సంచికలను తెలకపల్లి రవిగారి సంపాదకత్వాన ప్రజాశక్తి సాహితీ సంస్త తరపునఅందించారు ఈ ఒరవడిలో సాహిత్య ప్రస్తానం పత్రిక అన్ని  వర్గాల సాహిత్య కారులకు ముఖ్యంగా కొత్తతరం సాహితీ సృజనకారులకు  మంచి వేదిక అయ్యింది .

                                   అనంతపురం లో  కూడా 2001 లోనే సాహితి స్రవంతి ఏర్పాట్లు ప్రారంభమైనాయి.ఒక కన్వీనింగ్ కమిటీ  డా.geyaanand ,డా . మోక్షప్రసూన ,పిళ్ళా కుమారస్వామి రెడ్ది లతో ఏర్పడింది. వీరి ఆధ్వర్యంలో 2002లో ప్రస్తానం పత్రిక ఆవిశక్రణను నిర్వహించారు .  తెలుగు భాషా సంస్క్రతులు  ప్రపంచీకరణ తో వస్తున్న ముప్పు అనే అంశం పై తెలకపల్లి రవి గారు ప్రసంగించారు . సింగమనేని నారాయణరాచపాలెం చంద్ర శేఖర రెడ్డి మొదలైన సాహితీ వేత్తలు ప్రస్తానం పత్రిక నిరంతరాయంగా వస్తుందని ఆకాంక్షించారు . 

                      శ్రీ శ్రీ జాషువా గురజాడ వర్ధంతు లను క్రమం తప్పకుండా  సాహితీ స్రవంతి కన్వీనింగ్ కమిటీ నిర్వహించింది .2002లో పిళ్ళా కుమారస్వామి కన్వినర్ గా భాద్యత తీసుకొన్నారు . 2003లో యుద్ధవ్యతిరేక కవితాగలాలు పేరుతొ ఇరాక్ పై అమెరికా  యుద్దాన్ని వ్యతిరేకిస్తూ కవిసమ్మేలనం నిర్వహించింది . 2004లో ముందస్తు ఎన్నికలపై కవితాగానాన్ని నిర్వహించింది .                      

                              2006లో పిళ్ళా కుమారస్వామి ,తాడేపల్లి రామకృష్ణ ,మధురశ్రీ గార్లతో కమిటీ పునర్వస్తీకరిం పబడింది . 2006లో జిల్లా వెనుకబాటుతనం,సామాజికన్యంకులవివక్ష అంశాలపై కవిత్వసమ్మేళనం నిర్వహించింది . సెప్టెంబరు గురు పూజో త్సవం  సందర్భంగా ఉపాధ్యాయులకు కథ ,కవిత్వంలలో సాహిత్య పోటీలు నిర్వహించి బహుమతులను అందజేసింది . 

 

                              2007లో డిగ్రీ కళా శాల విద్యార్థులకు కథకవిత్వ రచనలలో పోటీలు నిర్వహించింది . పేదల భూపోరాటానికి అక్షర సంఘీభావం పేరిట శ్రీశ్రీ వర్ధంతి రోజున కవిసమ్మెలనం నిర్వహించింది . 2007లో కమిటీలొకి హరికృష్ణ (కేక ),ఎస్వీ ప్రసాదులను కలుపుకొని కార్యక్రమాలను నిర్వహించింది . 

                       

                             సాహితీ స్రవంతి  పనిచేయడం వల్ల 2007 నాటికి రాష్ట్ర స్తాయి లో సాహిత్య రంగం లో ఇతరసంఘాల కదలికలు పెరిగాయి . రాజకీయాలతో సంభంధం లేని   వ్యక్తివాదులూసంప్రదాయవాదులు ,పాలక వర్గాలుకార్పోరేట్ వర్గాల పాత్రకూడాసాహిత్య రంగం లో   పెరిగింది. సాహిత్య ప్రముఖుల్లో ఊగిసలాట దొరణులు కొనసాగుతున్నాయి . విశాల ప్రాతిపదికన వారందరినీ కలుపుకొని సాహితీ స్రవంతి పనిచేయసాగింది.  అనంతపురం లో ఆధునికాంతర దొరణులు ప్రవేశించడం మొదలైంది . స్త్రీ ,దళిత ,మైనారిటీ ,బహుజనవాదాల పై చర్చ జరిగిన తరువాత ఇది జరిగింది . 

 

                            2007లో ముదిగొండ లో భూపోరాటం చేస్తున్న ప్రజలపై కాల్పులు  జరిపి ఐదుమందిని పొట్టన పెట్టుకొంది ప్రభుత్వం . ఈ సందర్బంగా  వచ్చిన కవితాగ్రహాన్ని భూస్వరాలు పేరుతొ సాహితీస్రవంతి రాష్ట్ర శాఖ కవితా సంకలనాన్ని తీసుకు వచ్చింది . ఈ సంకలనాన్ని అనంతపురం లో యు .ఎ . నరసింహారావు గారు రచించిన కన్యాశుల్కం - ఆధునిక  భారతీయ నాటకాలు తో పాటు సాహితీ స్రవంతి ఆవిష్కరించింది . 

                          

                        2009లో అనంతపురం నగరకమిటీ కన్వీనర్ గా మిద్దె మురళీ కృష్ణ గారు భాద్యత తీసుకున్నారు . జిల్లనగర స్తాయి సాహిత్య  కార్యక్రమాల  ను నిర్వహిస్తూ వచ్చింది . పలు సాహిత్య కార్యక్రమాలవల్ల వచ్చిన సంబందాల వల్ల 2011 లో సాహితీ స్రవంతికి జిల్లా స్తాయి కమిటీ ఏర్పడింది . ప్రధాన కార్యదర్శిగా తగరం క్రిష్ణయ్య ,జిల్లా అధ్యక్షునిగా పిల్లా కుమారస్వామి ,కార్యదర్శులు గా ఆకుల రఘురామయ్య ,ముకుందాపురం పెద్దన్న ,ఉపాధ్యక్షులుగా అంకె రామలింగామయ్య ,ఎర్రిస్వామి ,కొశాదికారిగా ప్రజ్ఞ సురేష్ కమిటీ సభ్యులుగా ఆవుల జయప్రద (ఉరవకొండ ),సివన్న(మడకశిర),రామకృష్ణ,శేషాచార్యులు ,జూటూరి షరీఫ్ లతో ప్రధమం గా జిల్లా స్తాయి కమిటీ ఏర్పడింది . 

 

 



    2012  లో జిల్లా స్థాయి కవితా సంకలనం తీసుకు రావాలని కమిటీ నిర్ణయించింది తెలంగాణా ఉద్యమం,సమైక్యాంద్ర ఉద్యమం రావడంతో సాహిత్య రంగంలో స్తబ్దత ఏర్పడింది .   సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ  ఉద్యమాలపట్ల తటస్థ వైఖరితో ఉండాలని నిర్ణయించింది. ప్రాంతీయఅస్తిత్వ  ఉద్యమాలు సాహిత్యకారులను చీలుస్తున్నాయని ఇవి ప్రపంచీకరణ కు ,మతోన్మాదానికి వ్యతిరకంగా పోరాడటానికి దోహదపడవని సాహితీ స్రవంతి భావించింది ఏది ఏమైనప్పటికీతెలంగాణారాష్ట్రం  2014 జూన్  .ఆవిర్భవించింది . ఆంధ్రప్రదేశ్ విడిపోయింది . సమైక్యంద్ర ఉద్యమకారుల ఆవేశాలు ఆశలు  చల్లారి పోయాయి . ఆ  సందర్భం లో అనంతపురం జిల్లా రాష్ట్రం లో ఎక్కడా లేనంత గ విపరీతంగా స్పందిన్చించింది . 

                              2015లో ముందు తలపెట్టిన కవితా సంకలనాన్ని అనంతకవితా స్వరాలు పెరుతో వివిధ వర్గాల ప్రజల ఆర్ధిక సహకారం తో ప్రచురించింది .  అదే సందర్భంలో జిల్లా నూతన కమిటీ ఏర్పడింది . కమిటీలో 'ప్రధానకార్యదర్శి   గా ప్రజ్ఞా సురేష్ ,అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి,ఉపాధ్యక్షులుగా అంకె రామలింగమయ్య , బాలభారతమ్మ కార్యదర్శులుగా రియాజు ద్దీన్ ,ఆకులరఘురామయ్య గార్లు భాద్యతలు తీసుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో   జరిగిన  అనంతకవితా స్వరాలు  పుస్తకావిష్కరణ సభకు  మేడిపల్లి రవికుమార్ గారు తిరుపతి నుంచి వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు .  ముఖ్య అతిధి గా డా గేయానంద్ గారు పాల్గొన్నారు . నెలనెలా క్రమం తప్పకుండా సాహితీ సమయం కార్యక్రమాన్నినిర్వహించడం ద్వారా    అనంతపురం నగర కమిటీ కూడా ఏర్పడటానికి దోహదపడింది . నగరకమిటీ లోఅధ్యక్షులుగా   వై.సూర్యనారయన రెడ్డి ,నగర ప్రధాన కార్యదర్శి గా పొకూరి చంద్రశేఖర్ ,ఉపాధ్యక్షులుగా నీరుగంటి వేంకటేశు ,కార్యదర్శిగా రవిచంద్ర భాద్యతలు తీసుకొన్నారు . 

                      201 5లో అనంత కవిత స్వరాలు కవితా సంకలనాన్ని పరిచయం చేసేందుకు కదిరి,హిందూపురం,ఉరవకొండ ధర్మవరం ప్రాంతాలలో జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి గారు  

పర్యటించి జన కవనాలను కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా కదిరిలో ఆ శాఖ అధ్యక్షులుగా చలపతి,ప్రధాన కార్యదర్శిగా చిన్నారావు లతో ఒక కమిటీ ఏర్పడింది . హిందూపురం లో నాగసేషు,అశ్వర్థనారాయణ ప్రధానకార్యదర్శి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కమిటీ ఏర్పడింది . ఉరవకొండ లో ఆవులవెంకటెసులు ,గంగాధర్ లను అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీ ఏర్పడింది . ధర్మవరం లో 2016 జనవరి లో నూతనశాఖ ఏర్పడింది . ఈ శాఖ ప్రధాన  కార్యదర్శిగా ఇటికంటి మహేష్ అధ్యక్షులుగా శారద ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ తదితరులతో కమిటీ నిర్మాణం జరిగింది . 

 

                                2016లో అనంతపురం నగర కమిటీ రాష్ట్రం లో నే ప్రధమంగా కవులు రచయతలతో కేలండరును రూపొందించి ఆర్ట్స్ కళాశాలలో ఆవిష్కరించింది . అలాగే ఆర్ట్స్ కళాశాల తో కలిసి నెలనెలా సాహితీ సమాలోచన నిర్వహించాలని నిర్ణయించింది . ప్రధమంగా వేమనపై నిర్వహించిన సభ లో అప్పిరెడ్డి హరనాధరెడ్డి ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు .  

          హిందూపురం ,ధర్మవరం ,అనంతపురం కమిటీలు మాతృ భాషాదినో త్సవాన్ని నిర్వహించాయి . ప్రభుత్వం మాత్రం నిర్వహించలేదు . కదిరిలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఎర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి కోరారు . మహిళా దినోత్సవాన్ని ధర్మవరం ,అనంతపురం నగరం,హిందూపురం శాఖలు నిర్వహించాయి . 

                               ఏప్రిల్ 2016 లో జిల్లా శాఖ కథ ,కవిత్వం లపై  సాహిత్య శాల   నిర్వహించింది  . ఈసందర్భంగా జిల్లా నూతన కమిటీ ఏర్పడింది . ఈ కమిటీ లో అధ్యక్షులుగా ప్రగతి ప్రధా  కార్యదర్శిగా రవిచంద్ర ,ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ (ధర్మవరం ),అశ్వర్థనారాయణ (హిందూపురం),వై .సుర్యనారాయణ రెడ్డి (అనంతపురం ),సహాయ కార్యదర్శులుగా నీరుగంటి వెంకటెసు (అనంతపురం ),ఇటికంటి మహేష్ (ధర్మవరం )పిళ్ళా కుమారస్వామి (కదిరి ) సభ్యులుగా ఎ ఎనాగేంద్ర (అనంతపురం)నర్సిరెడ్డి (పెనుగొండ),తిప్పేస్వామి(కల్యాణదుర్గం)గంగాదేవి ధరిత్రీదేవి ,యమునా,హిదయతుల్లా ,రసూల్ ,శ్రీధర్ నాయుడు ,బుదేన్సాబ్ ,చంద్రశేఖర్ (sku), లక్ష్మినారాయణ(sku) భాద్యతలు తీసుకున్నారు         

                  




                     సాహిత్యశాల లో రాయలసీమ కథా చిత్రం పై సింగమనేని నారాయణ ,కథ లేలా రాస్తారు పై శశికళ ,బండి నారాయణ స్వామిసాహిత్య పరిణామ క్రమంపై పిళ్ళా కుమారస్వామి ,కవిత్వం లో వస్తువు పై రాధేయ ,కవితా శిల్పం పై మల్లెల నరసింహమూర్తి గార్లు భోధించారు 

        వర్తమాన పరిస్తితుల్లో సాహితీ స్రవంతి కొత్తతరం సాహితీ సృజనకారులను గుర్తించి ప్రజా సాహిత్యకరులుగా తీర్చి దిద్దాల్సిన కర్తవ్యాన్ని గుర్తించింది . తెలుగు భాషా సంస్క్రతులను రక్షించుకోవాలని తన వంతు ప్రయత్నం చెస్తూ ముందుకు సాగుతున్నది . 

 పిళ్ళా కుమారస్వామి ,అనంతపురం 






గ్రంధాలయ వారొత్సవాల సందర్భంగా కవిసమ్మెలనమ్ సాహితీ స్రవంతి ఆద్వర్యంలో

కదిరిలో మాట్లాడుతున్న స్రవంతి రాష్త్రకమిటీ సభ్యులు పిళ్లా కుమారస్వామి

Tuesday, June 16, 2020

అనంతపురంజిల్లాలో సాహితీస్రవంతి(2018నాటి నివేదిక)

 
                                 సుమారు పదహారు  సంవత్సరాల క్రిందట 2002లో సాహిత్య ప్రస్థానం పత్రిక  ఆవిష్కరణ   సభతో అనంతపురం  జిల్లాలో సాహితీ స్రవంతి ప్రస్థానం ప్రారంభమైంది .    పిళ్లా కుమారస్వామి రెడ్డి,    డా.గేయానంద్ ,డా . మోక్షప్రసూన లతో సాహితి స్రవంతి కోసం ఏర్పడిన కన్వీనింగ్ కమిటీ 2002  నుండి  పనిచెయడం ప్రారంభించింది. అప్పటి నుండి రాష్ట్ర కమిటీ నిర్ణయం అనుసరించి శ్రీ శ్రీ , జాషువా , గురజాడ వర్ధంతులను లేదా జయంతులను క్రమం తప్పకుండా   సాహితీ స్రవంతి జిల్లా కమిటీ నిర్వహిస్తూవస్తోంది.
                                   2003 లో అమెరికా ఇరాక్ పై యుద్ధాన్ని ప్రకటించినప్పుడు  ప్రపంచ వ్యాప్తంగా దీనిపై నిరసన వ్యక్తమైంది . ఆ నేపద్యంలో  జిల్లాలో సాహితీ స్రవంతి  "యుద్ధవ్యతిరేక కవితాగళాలు” పేరుతొ ఇరాక్ పై అమెరికా యుద్దాన్ని వ్యతిరేకిస్తూ కవిసమ్మేళనం నిర్వహించింది . ముందస్తు ఎన్నికలపైకవితాగానాన్నినిర్వహించింది. జిల్లాలోప్రజాఉద్యమాలుజరుగుతున్ననేపధ్యంలోసాహితీస్రవంతి స్పందించింది.ఈఉద్యమాలకుమద్దతుగా సాహిత్యకారులతో అనేకసాహిత్యసభలనునిర్వహించింది.2004లో సిపియం పార్టీ జిల్లాసమగ్రాభివృద్దికోరుతూ  చేస్తున్నపాదయాత్రల సందర్భంగా   "జిల్లా వెనుకబాటుతనం- నిర్మూలన" పై కవి సమ్మెళనంనిర్వహించింది. ఆ సందర్భంగా పార్టీ ప్రచురించిన  అనంతప్రస్తానం పుస్తకరచనలో సాహితీస్రవంతి కన్వీనరు పిళ్ళా కుమారస్వామి కీలక పాత్ర వహించారు .2005లో  కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ జిల్లాలో సామాజికన్యాయం ,కులవివక్ష అంశాలపై సైకిల్ యాత్ర నిర్వహించింది .ఆసందర్బంలో సాహితీస్రవంతి "కులవివక్ష పై కవితాసమరం" పేరుతో కవిసమ్మేళనం నిర్వహించింది .వారికి మద్దతుగా సాహితీస్రవంతి కన్వీనరు పిళ్ళా కుమారస్వామి సైకిలు యాత్రలోకూడా  పాల్గొన్నారు.  వివిధ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కథ, కవిత్వ రచనలలోపోటీలునిర్వహించింది.తరువాతజిల్లాలో పేదలు చేస్తున్న  భూపోరాటానికి అక్షర సంఘీభావం పేరిట శ్రీశ్రీ వర్ధంతి రోజున కవిసమ్మెళనం నిర్వహించింది .                  2006లో  కమిటీలొకి హరికృష్ణ (కేక ),ఎస్వీ ప్రసాదులను కలుపుకొని కార్యక్రమాలను నిర్వహించింది .సాహితీ స్రవంతి ఉద్యొగఉపాద్యాయ రంగాలలోసాహిత్యకార్యక్రమాలనునిర్వహించివారిలొసాహితీసృజన గలవారిని   గుర్తించాలని నిర్ణంచించింది.ఆప్పటినుండిసెప్టెంబరు 5 ఉపాద్యాయదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు కథ ,కవిత్వంలలో సాహిత్య పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయటంప్రారంభించింది. జీవితబీమా సంస్థలొ కడప డివిజన్ లొని అనంతపురం,కడప,కర్నూలు జిల్లాలొని వుద్యొగులందరికి కవితల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేసింది.    సాహితీ స్రవంతి  విశాల ప్రాతిపదికన అందరినీ కలుపుకొని పనిచేయసాగింది.  
                          పేద ప్రజలు  2007లో  ప్రభుత్వమిగులుభూములు పంచాలని భూపోరాటం పోరాటం చేస్తున్నారు. ఆ సందర్భంగా ముదిగొండ లో భూపోరాటం చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపి ఐదుమందిని పొట్టనపెట్టుకొంది ప్రభుత్వం. దీనికి నిరసనగా సాహితీస్రవంతి అనంతపురం శాఖ నిరసన  కవిసమ్మెళనం నిర్వహించింది. అలాగే  రాష్త్రస్థాయిలో వచ్చిన కవితాగ్రహాన్ని” భూస్వరాలు” పేరుతొ సాహితీస్రవంతి రాష్ట్ర శాఖ కవితా సంకలనాన్ని తీసుకు వచ్చింది . ఈ సంకలనాన్ని అనంతపురం లో యు .ఎ . నరసింహారావు గారు రచించిన”కన్యాశుల్కం - ఆధునిక  భారతీయ నాటకాల” తో పాటు  సాహితీ స్రవంతి ఆవిష్కరించింది.ఈ సంకలనంలో అనంతపురం కవులు చాలా మంది వున్నారు.  ఈ ఆవిష్కరణకు సాహితీ  స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి గారు ముఖ్యఅతిధి గా విచ్చేశారు.
                 పిళ్ళాకుమారస్వామి ,రామకృష్ణ (lic),మధురశ్రీ , సురేశ్ లతో కమిటీ పనిచేస్తూ వుండింది.
                    రాష్ట్ర కేంద్రం భాధ్యులు వొరప్రసాద్ గారి సలహా మేరకు ,  జిల్లా నగర స్థాయిలో అనేక సాహిత్య  కార్యక్రమాల ను నిర్వహించడం వల్ల వచ్చిన సంబందాలతో 2011 లో సాహితీ స్రవంతికి జిల్లా స్తాయి కమిటీ ని ఏర్పాటు చేసినాను.. ప్రధాన కార్యదర్శిగా తగరం క్రిష్ణయ్య ,జిల్లా అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి ,కార్యదర్శులుగా ఆకుల రఘురామయ్య, ముకుందాపురం పెద్దన్న ,ఉపాధ్యక్షులుగా అంకెరామలింగమయ్య ,ఎర్రిస్వామి ,కొశాదికారిగా ప్రజ్ఞసురేష్ , సభ్యులుగాఆవులజయప్రద(ఉరవకొండ ), సివన్న(మడకశిర),రామకృష్ణ,శేషాచార్యులు ,జూటూరి షరీఫ్ లతో ప్రధమ జిల్లా స్తాయి కమిటీ ఏర్పడింది. నూతన కమిటీ చురుకుగా అనెక కార్యక్రమాలను నిర్వహించింది.
                జిల్లా   వ్యాప్తంగా   ఆహ్వానించగా     వచ్చిన కవితలన్నీక్రోడీకరించి  మల్లెల నరసింహమూర్తి, పిళ్ళాకుమారస్వామి సంపాదకత్వంలొ "అనంతకవితాస్వరాలు"పేరుతో  మే 2015లో కవితాసంకలనాన్నితీసుకువచ్చాము  .  అదే సందర్భంలో నూతన జిల్లా  కమిటీ కూడా ఏర్పడింది . కమిటీలో 'ప్రధానకార్యదర్శి  గా ప్రజ్ఞా సురేష్,అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి,ఉపాధ్యక్షులుగా అంకె రామలింగమయ్య , బాలభారతమ్మ , కార్యదర్శులుగా రియాజు ద్దీన్,ఆకులరఘురామయ్య గార్లు భాద్యతలు తీసుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో   జరిగిన  అనంతకవితా స్వరాలు  పుస్తకావిష్కరణ సభకు  మేడిపల్లి రవికుమార్ గారు తిరుపతి నుంచి వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు .  ముఖ్య అతిధిగా డా. గేయానంద్ గారు పాల్గొన్నారు . నెలనెలా క్రమం తప్పకుండా  సంవత్సరంపాటు  సాహితీసమయం పేరుతో పిళ్లా కుమారస్వామి నివాసం లో తరువాత ప్రజాశక్తి కార్యాలయం లో నూ కవుల  సాహిత్య గోష్టి నిర్వహించడం ద్వారా   అనంతపురం నగర కమిటీ కూడా ఏర్పడటానికి దోహదపడింది . నగరకమిటీ లోఅధ్యక్షులుగా   వై.సూర్యనారయణ రెడ్డి ,నగర ప్రధాన కార్యదర్శి గా పొకూరి చంద్రశేఖర్ ,ఉపాధ్యక్షులుగా నీరుగంటి వేంకటేశు ,కార్యదర్శిగా రవిచంద్ర భాద్యతలు తీసుకొన్నారు . 
                       అనంత కవిత స్వరాలు కవితా సంకలనాన్ని పరిచయం చేసేందుకు కదిరి,హిందూపురం,ఉరవకొండ ధర్మవరం ప్రాంతాలలో జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి గారు  పర్యటించి జన కవనాలను కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా కదిరిలో ఆ శాఖ అధ్యక్షులుగా చలపతి,ప్రధాన కార్యదర్శిగా చిన్నారావు లతో ఒక కమిటీ ఏర్పడింది . హిందూపురం లో నాగశేషు,అశ్వర్థనారాయణ ప్రధానకార్యదర్శి , అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కమిటీ ఏర్పడింది . ఉరవకొండ లో ఆవులవెంకటెసులు ,గంగాధర్ లు అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీ ఏర్పడింది . ధర్మవరం లో నూతనశాఖ ఏర్పడింది . ఈ శాఖ ప్రధాన  కార్యదర్శిగా ఇటికంటి మహేaష్ , అధ్యక్షులుగా శారద ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ తదితరులతో కమిటీ నిర్మాణం జరిగింది . ఈ కమిటీ లు గురజాడ , జాషువా వర్ధంతులను నిర్వహించాయి. వీటికి పిళ్ళా కుమారస్వామి సింగమనేని నారాయణ ఏలూరు ఎంగన్న తదితరులను పిలుచుకుని వెళ్లారు.
 
                                2016 సంవత్సరం అనంతపురం నగర కమిటీ రాష్ట్రంలోనే ప్రధమంగా కవులు రచయితలతో కేలండరును రూపొందించి ఆర్ట్స్ కళాశాలలోజనవరి లో  ఆవిష్కరించింది . అలాగే ఆర్ట్స్ కళాశాల తో కలిసి జిల్లాలొని దివంగత సాహిత్యకారులపై ప్రతి నెల 3వ ఆదివారం సాహితీసమాలోచన నిర్వహించాలని నిర్ణయించింది .ప్రధమంగా మాతృభాషాదినోత్సవం రోజున వేమనపై నిర్వహించిన సభ లో అప్పిరెడ్డి హరనాధరెడ్డి ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు . హిందూపురం ,ధర్మవరం ,అనంతపురం కమిటీలుకూడా మాతృ భాషాదినో త్సవాన్ని నిర్వహించాయి . మార్చినెలలో మహిళా దినోత్సవాన్ని ధర్మవరం ,అనంతపురం నగరం,హిందూపురంశాఖలునిర్వహించాయి.ఏప్రిల్ మాసంలో  జిల్లాశాఖ కథ ,కవిత్వంలపై సాహిత్యశాల    నిర్వహించింది  . ఈసందర్భంగా జిల్లాలోఏర్పడిన ప్రాంతీయ కమిటీ సభ్యులతో నూతన  జిల్లా కమిటీ ఏర్పడింది . ఈ కమిటీ లో అధ్యక్షులుగా ప్రగతి , ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర ,ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ (ధర్మవరం ),అశ్వర్థనారాయణ (హిందూపురం),వై .సుర్యనారాయణ రెడ్డి (అనంతపురం ),సహాయ కార్యదర్శులుగా నీరుగంటి వెంకటెసు (అనంతపురం ),ఇటికంటి మహేష్ (ధర్మవరం )పిళ్ళా కుమారస్వామి (రాష్త్ర కమిటీ సభ్యులు),సభ్యులుగా నానీల నాగేంద్ర(అనంతపురం),నర్సిరెడ్డి(పెనుగొండ),తిప్పేస్వామి(కల్యాణదుర్గం),గంగాదేవి , ధరిత్రీదేవి ,
యమునా,హిదయతుల్లా ,రసూల్ ,శ్రీధర్నాయుడు ,బుదేన్సాబ్,చంద్రశేఖర్ (యూనివర్సిటీ ),లక్ష్మినారాయణ (యూనివర్సిటీ ) భాద్యతలు తీసుకున్నారు                            
                           సాహిత్యశాల లో రాయలసీమ కథా చిత్రం పై సింగమనేని నారాయణ ,కథ లేలా రాస్తారు పై శశికళ ,బండి నారాయణ స్వామి,సాహిత్య పరిణామ క్రమంపై పిళ్ళా కుమారస్వామి ,కవిత్వం లో వస్తువు పై రాధేయ ,కవితా శిల్పం పై మల్లెల నరసింహమూర్తి గార్లు భోధించారు .ఆ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు హాజరయ్యారు.
                      ఆంధ్రరాష్త్రం విడిఫొయాక జిల్లాలో రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర  ఉద్యమసన్నాహాలు చాలా  రచయితలు మేధావులతో ప్రారంభమయ్యాయి. రాయలసీమలో అనంతపురంజిల్లా  పూర్తిగా వెనుకబడి వుంది.అందువల్ల ఈ ఉద్యమం అనంతపురంలోనే ఊపందుకుంది. కొంతమంది రచయితలు బహిరంగంగా దీనిని ప్రోత్స హిస్తున్నారు. అంతేగాక ప్రపంచీకరణ ప్రభావంతొ  జిల్లాలోభాషా సంస్కృతులపై పెనుప్రభావం పడుతొంది. ఈ నేపద్యంలో తెలుగు భాషా సంస్క్రతులను  రక్షించుకోవాలని సాహితీస్రవంతి ప్రయత్నం  చేస్తూ ముందుకు సాగుతున్నది. వర్తమాన పరిస్తితుల్లో సాహితీ స్రవంతి కొత్తతరం సాహితీ సృజనకారులను గుర్తించి ప్రజా సాహిత్యకారులుగా తీర్చి దిద్దాల్సిన కర్తవ్యాన్ని గుర్తించింది . జిల్లాలో సాహిత్యాభివృద్దికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.ఊగాది రోజున తూతూ మంత్రంగా కవిసమ్మెలనాలను నిర్వహిస్తొంది. తెలుగు భాషా సంఘం ఉనికిలోకూడా లేదు. అదే సందర్బంలో వర్ధమానసాహిత్యకారుల్లో సాహిత్యం పట్ల తపన ఉండటం గమనార్హం.  వీరి తపనను గుర్తించి సాహితీ స్రవంతి సాహిత్యకార్యశాలలను విరివిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పాత తరం సాహిత్యకారుల స్పూర్తిని పొందేందుకు నెలనెలా అనంతపురం నగరశాఖ జిల్లాలొని  దివంగత సాహిత్యకారులైన వేమన,రాళ్ళపల్లి , తలమర్ల కళానిది,విద్వాన్ విశ్వం , గుత్తిరామకృష్ణ ,కొగిర జై సీతారాం , బెల్లూరు శ్రీనివాసమూర్తి,సర్దేశాయి తిరుమలరావు ల సాహిత్యం పై  నెలనెలా సాహితీ సమాలొచన చేపట్టింది. వారిపై వచ్చిన ప్రసంగాలను జిల్లాలో సాహితీ స్రవంతి ప్రస్తానాన్ని , జిల్లాలో సాహిత్య స్తూల రేఖాచిత్రాన్ని జతచేసి ఒక పుస్తకాన్ని అనంత సాహిత్యాసమాలోచన పేరుతో ప్రచురించాము.ఆ పుస్తకాన్ని ఆర్ట్స్ కళాశాల లో ఆవిష్కరించాము . 
 
          సాహిత్య అకాడమీ తో కలిసి కార్మికసాహిత్యం పై 2016 డిసెంబరు 25న సదస్సు నిర్వహించాము.ఈ సదస్సుకు రాష్ట్ర అధ్యక్షులు  తెలకపల్లి రవి హాజరయ్యారు.పిళ్ళాకుమారస్వామి కదిరికి తన నివార్చిన తరువాత  2016 లో   క దిరి లో ఇపుడు వీస్తున్న గాలి పేరుతో నెల నెలా జిల్లాలోని కవుల రచన లపై సమీక్షా సమవేశాలు నిర్వహించాము.జూపల్లి ప్రేంచంద్ రచించిన అవేధ, రమేష్ నారాయణ రచించిన గిరిజన సంస్క్రుతులు ~ సడ్లపల్లి, దృశ్యప్రవాహం ~ వైసిపి వెంకట్ రెడ్ది ,సినిమావైరాగ్యం ~ పుస్తకాలను పరిచయం చేస్తూ సమీక్ష సమావేశాలను నిర్వహించారు.
         జిల్లాస్తాయిలో కథల పోటీ నిర్వహించి పిళ్లా కుమారస్వామి తల్లిదండ్రుల పేర్లతో పిళ్లా లక్ష్మి రెడ్డి పిళ్లా రామలక్ష్మి పురస్కారం అందజేశారు.కమిటీ సభ్యురాలు బాలభారతమ్మ తన తల్లి దండ్రుల పేర్ల తో కవితా పురస్కారాన్ని అందజేశారు . 
             కల్బుర్గి మొదలైన సాహిత్యకారుల హత్యలను ఖండిస్తూ నిరసన సమావేశాన్ని నిర్వహించాము. స్వేచ్చా స్వరం  పుస్తకం 2016 డిసెంబరులో ఆవిష్కరించాము.

                     2017 ఫిబ్రవరి లో సాహితీ స్రవంతి  ప్రచురించిన అనంత సాహితీ సమాలోచన పుస్తకాన్ని ప్రచురించి ఆవిష్కరించాము .2017 ఏప్రిల్లో 30న వివిధ సాహిత్య సంఘాల తో కలిసి వేమన సాహిత్యం పై రాష్ట్ర సదస్సు ను నిర్వహించాము.ప్రజానాట్యమండలి వేమన రూపకాన్ని ప్రదర్సించింది.                     జూన్ నెలలో శ్రీ శ్రీ వర్ధంతి నిర్వహించాము.   ప్రతి సంవత్సరం జరిగినట్లే జూలై 2017 లో కార్యకర్తలకు ఒక కార్యశాల నిర్వహించి నూతన జిల్లా కమిటీ ని నగర కమిటీ ని నిర్మించాము. ఈ కార్యశాలకు రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ హాజరయ్యారు. కార్యశాలలో సాహిత్యం లో ప్రాపంచిక దృక్పథం పై పిళ్ళాకుమారస్వామి కథాపరిణామక్రమం పై రాచపాలెం సంఘ నిర్మాణం పనిపద్దతులపై వొరప్రసాద్ ప్రసంగించారు.జిల్లా గౌరవాధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి , అధ్యక్షులుగా కటకం కృష్ణవేణి , ప్రధాన కార్యదర్శిగా చెన్నా రామమూర్తి ,కోశాధికారిగా అశ్వర్త రెడ్డి లను ఇతరకమిటీ  సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జులైలో రాయలసీమ సాహిత్యం పై ఒక పుస్తకాన్ని ప్రచురించాము . కదిరిలో జాషువా వర్ధంతి ని జరిపాము.హిందూపురం లో సాహిత్య అకాడమీ తో సంయుక్తంగా  కథల్లో  చేతివృత్తుల  పై సదస్సు నిర్వహిన్చాము.
                నవంబరులో వేమన సభ కు  కొనసాగింపుగా 13 పుపుస్తకాల పై సమీక్ష సదస్సు నిర్వహించాము. డిసెంబరులో ఆధునిక సాహితీ ప్రస్తానమ్ పుస్తకాన్ని ఆవిష్కరించాము. 
                  2018 లో ఫిబ్రవరినుండి  వర్తమాన సాహితీ తరంగాలు పేరుతో ప్రతి నెలా అనంతపురం లో ప్రస్తుతం జీవిన్చి ఉన్న సాహితీ మూర్తుల రచనలను కొత్త తరానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపట్టినాం ..   ఫిబ్రవరిలోలో 25 మంది సాహిత్యకారుల రచనలపై సదస్సు నిర్వహించాము.మార్చి లో మహిళా దినొత్సవం సందర్బంగ 6 గురు మహిళా రచయిరచయిత్రుల రచనల పై సదస్సు నిర్వహించారము. ఏప్రిల్ లో ఆశావాది సాహిత్య    సమాలోచన సదస్సు నిర్వహించాము. జూన్ లో  సింగమనేని సాహిత్య సమాలోచన సదస్సు నిర్వహించాము.     జూలై లో బండి నారాయణ స్వామి సాహిత్యం పై సదస్సు ను నిర్వహించారము. ఆగష్టు లో రమేష్ నారాయనగారి సాహిత్యం పై సదస్సు ను నిర్వహించాము.
~~~~~ పిళ్లా కుమారస్వామి సాహితీస్రవంతి జిల్లా గౌరావాధ్యక్షులు
9490122229



Monday, June 15, 2020

కదిరి లో ఎద్దులసిద్దారెడ్డి మహాలక్ష్మి సాహిత్య పురస్కారాల ప్రధానం

 1.6.19న  ఉదయం 10 గంటలకు కదిరిలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం లో సాహితీ స్రవంతి ,కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో   నిర్వహించిన కవిత, కథల పోటీలో గెలుపొందిన విజేతలకు  ఎద్దుల సిద్దారెడ్డి మహాలక్ష్మి సాహిత్య పురస్కారాల ప్రధానం జరిగింది . తదనంతరం అల్పాహారం. 
సాహితీ స్రవంతి ,కదిరి అభివృద్ధి వేదిక ఆధ్వర్యం లో కదిరి మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి సాహిత్య  పురస్కారాలను కవులు రచయితలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు పిళ్లా విజయ కుమారస్వామి రెడ్డి   అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ సాహిత్యం  సమాజానికి దర్పణంగా ఉంటుందన్నారు. సాహిత్యం బావ ప్రచారానికి తోడ్పడుతుందని ,అదే  సందర్భంలో  సామాజిక మార్పులకు దోహదం చేస్తుందనికూడా అన్నారు. సామాజిక అంశాలపైన కవిత్వం రాయమన్నప్పుడు జిల్లావ్యాప్తంగా సుమారు 70 మంది కవులు కవిత్వాన్ని రాశారన్నారు. మన జిల్లాలో  సాహిత్యకారులు అభివృద్ధి చెందుతున్నారన్నదానికి  ఇది నిదర్శనమన్నారు. మన జిల్లాలో కథా సాహిత్యం కూడా డా బాగా అభివృద్ధి చెందుతోందని అందులో మహిళలు బాగా రాస్తారని ఆయన అన్నారు కదిరి ప్రాంతంలో చాలా మంది సాహిత్యకారులు ఉన్నారని  వారిని ప్రోత్సహించేందుకు సాహితీస్రవంతి ఎల్లప్పుడూ కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఎద్దుల సిద్ధారెడ్డి  గతంలో  కదిరిలో
 తెలుగు లెక్చరర్ గా పనిచేసి  కడప లో పదవి విరమణ అనంతరం ఫిబ్రవరి మాసంలో  ఆయన మరణించారు. ఆయన జయంతి సందర్భంగా  ఆయన పేరిట కవిత్వానికి, కథలకు పురస్కారాలను అందజేయడానికి సాహిత్య పోటీలు ఏర్పాటు చేశామన్నారు . ఆ పోటీలో వచ్చిన కవితలను పరిశీలించి పురస్కారానికి ఆవుల వెంకటేశ్వర్లు రచించిన ఒక ముగింపు కోసం కవితను న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన తెలుగు ఉపన్యాసకులు సుందరమోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ కవులు సాహిత్యాన్ని సృజించడానికి ప్రధాన ప్రేరకులు గురువులేనని అన్నారు. తెలుగు భాష అంతరించదని అది సజీవమైన భాష అని ఆయన అన్నారు. కదిరి అభివృద్ధి వేదిక కన్వీనర్ జె.వి. రమణ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి కదిరి వచ్చినవారు సాహిత్యం పట్ల ఎంతో మక్కువ ఉన్న వారని , ఇది సాహిత్యాభివృద్ధికి తప్పకుండా దోహదం చేస్తుందని ఆయన అన్నారు. కదిరి అభివృద్ధి వేదిక ప్రజల ప్రాంతంలో కవులను తయారు చేస్తుందని సాహిత్యాన్ని పెంపొందిస్తుందని అందుకు అందరి సహకారం తీసుకుంటుందని ఆయన చెప్పారు. సిద్ధారెడ్డి సతీమణి మహాలక్ష్మి మాట్లాడుతూ త్వరలో రాయలసీమ సాహిత్యంపై సదస్సును సిద్ధారెడ్డి స్మారకార్థం ఏర్పాటు చేయాలని దానికి తన సహకారం అందిస్తానని తెలిపారు. తర్వాత ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి కవితా పురస్కారాన్ని ఉరవకొండ కు చెందిన ఆవుల వెంకటేశ్వర్లు కు అందజేశారు. ఎద్దుల సిద్ధారెడ్డి కథా పురస్కారాన్ని తాడిపత్రికి చెందిన వరాల శారదాదేవి కి అందజేశారు. శారదా దేవి ధనమేరా అన్నిటికి మూలం అనే కథను మాండలికంలో అద్భుతంగా రాశారని న్యాయనిర్ణేతలు కొనియాడారు. ఈ సందర్భంగా శారదా దేవి మాట్లాడుతూ ఇదే తనకు లభించిన ప్రధమ పురస్కారమని అన్నారు. తన పిల్లలకు మార్గదర్శకంగా ఉండేందుకు తాను  రాస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి విశ్వనాథరెడ్డి మహాలక్ష్మి వసంత కుమార్ రెడ్డి అవధాని మురళి ,చిన్నారావు, వందన ఉమామహేశ్వరి ,కృష్ణవేణి, గంగరాజు, సమరసింహా రెడ్డి, లాయర్ గురులింగస్వామి, స్వాతి, ముస్తఫా ,తదితర కవులు రచయితలు పాల్గొన్నారు.

కడప లో ఎద్దుల సిద్దారెడ్డి స్మారకోపన్యాసాలు

 
(21వ శతాబ్దపు రాయలసీమ సాహిత్యంలో రాయలసీమ జీవితం)

వేదిక: బ్రౌన్‌ గ్రంధాలయం, కడప
తేది : 7-7-2019, ఆదివారం, ఉదయం 10-00 గం॥లకు
  

కార్యక్రమం
ప్రారంభ సమావేశం (ఉ॥ 10- 10-45 ని॥లకు)
అధ్యక్షులు : పిళ్యాకుమారస్వామి, సాహితీ ప్రవంతి రాష్ట్ర కమిటి సభ్యులు
ముఖ్యఅతిథి : డా॥ కేతు విశ్వనాథరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
ప్రధాన అతిథి : డా॥ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ కమిటి సభ్యులు
ఆత్మీయ అతిథి : ఎ. రఘునాథరెడ్డి,జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు, కడప

రెండవ సమావేశం (ఉ!। 10-45- 11-30)
అధ్యక్షులు : జంధ్యాల రఘుబాబు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి
ఉపన్యాసకులు : జి. వెంకటకృష్ణ - రాయలసీమ కవిత్వం
కవి, కథకులు, కర్నూలు.

మూడవ సమావేశం (ఉ॥ 11-30 - 12-15)
అధ్యక్షులు : పెద్దిరెడ్డి నీలవేణి, తెలుగు ఉపన్యాసకులు, కడప
ఉపన్యాసకులు :డా. కిన్నెర శ్రీదేవి - రాయలసీమ కథ
తెలుగు ఆచార్యులు, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.

నాలుగవ సమావేశం ( మః 12-15 - 1-00)
అధ్యక్షులు : కెంగార మోహన్‌, సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటి సభ్యులు
ఉపన్యాసకులు : డా. పొదిలి నాగరాజు - రాయలసీమ నవల
తెలుగు ఉపన్యాసకులు, పాలకొల్లు,

ఐదవ సమావేశం (మ॥ 1-00 - 1-30)

అధ్యక్షులు : ఎస్.మస్తాన్‌వలి, శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు, కడప
ఉపన్యాసకులు : డా. మూల మళ్లికార్డునరెడ్డి - రాయలసీమ నాటకాలు
తెలుగు ఆచార్యులు, యోగివేమన విశ్వవిద్యాలయం 
  
సాహిత్యాభిమానులంతా హాజరుకావాలని
విజ్ణప్తి చేస్తున్నాము.

. సాహితీ ప్రవంతి
[7/7/2019, 4:45 PM] పిళ్లా విజయ్: ప్రెస్ నోట్
 సాహితీస్రవంతి ఆధ్వర్యంలో
బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో
స్మారకోపన్యాసం లో భాగంగా ఎద్దుల సిద్ధారెడ్డి స్థానిక ఉపన్యాసం లో భాగంగా
21వ శతాబ్దపు రాయలసీమ సాహిత్యంలో లో రాయలసీమ జీవితం అనే అంశంపై పై సదస్సు జరిగింది
ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు
పిల్లా కుమారస్వామి రెడ్డి అధ్యక్షత వహించారు
ఆయన మాట్లాడుతూ తూ 21వ శతాబ్దంలో లో రాయలసీమ ప్రపంచీకరణ ప్రభావానికి లోను అయిందన్నారు ప్రజా జీవితంలో కరువు తో పాటు అనేక మానవ సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు
దానివలన సాహిత్యంలో కూడా అనేక మార్పులు వచ్చాయి అన్నారు ఈ మార్పుల గురించి సాహిత్యంలోని ప్రక్రియల్లో కవిత్వం కథ నవల నాటికల్లో ఎలా ప్రతిఫలించింది ఈ సదస్సులో వక్తలు తెలియజేస్తారు అన్నారు రు
ముఖ్యఅతిథిగా హాజరైన వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు ఈశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ ప్రపంచీకరణ వలన తెలుగు భాష కు ప్రమాదం వాటిల్లుతుందన్నారు దానివలన సాహిత్యం కు ప్రమాదం వస్తోందన్నారు సాహిత్యం అభివృద్ధి చెందాలంటే సాహిత్యకారులు ఎక్కువ కావాలన్నారు సాహిత్య సభలు ఎక్కువగా జరగాలన్నారు సభలను విద్యార్థుల దగ్గరికి ప్రజల దగ్గరకు చేరువచేయాలన్నారు ఆ రకంగా సాహితీస్రవంతి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు ఆత్మీయ అతిథిగా హాజరైన జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పాలకులు మారన రాయలసీమ వెనుకబాటుతనం అభివృద్ధి అజెండా రాలేదన్నారు ఇప్పటికీ పోలవరం అమరావతి గురించే మాట్లాడుతున్నారు అందువలన రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన విషయం పైన న సాహిత్య కారులు తమ గళం విప్పాలని ఆయన కోరారు రు కర్నూల్ నుంచి వచ్చిన కర్నూల్ నుంచి ఉపన్యాసకులుగా వచ్చిన వెంకట కృష్ణ మాట్లాడుతూ రాయలసీమ కవిత్వంలో రాయలసీమ సమస్యల కన్నా నా ఆ సమస్యలకు కారణం భూతులను ఆ సమస్యల నివారణకు ప్రజలు చేయాల్సిన కర్తవ్యాలను ఉద్యమాలను తమ కవిత్వంలో లో కవులు ప్రతిబింబింప చేసారు అని అన్నారు
రాయలసీమ కవిత్వం ప్రపంచీకరణ మూలాలను కూడా పట్టుకుందని నిఅన్నారు
కథ విభాగానికి అధ్యక్షత వహించిన నీలవేణి మాట్లాడుతూ రాయలసీమ కథా సాహిత్యం కరువు ఫ్యాక్షన్ లతోపాటు ఉ మానవ సంబంధాల పైన కూడా దృష్టి పెట్టిందన్నారు రు
కుప్పం నుంచి రాయలసీమ కథపై మాట్లాడటానికి వచ్చిన శ్రీదేవి మాట్లాడుతూ తూ రాయలసీమ కథ తమ అస్తిత్వ వేదనను  అన్నారు వ్యక్తీకరించింది 
21వ శతాబ్దంలో వచ్చిన కథల్లో ఎక్కువ భాగం మానవ సంబంధాల పైన విలువల పైన స్త్రీల హక్కుల పైన బాలల హక్కుల పైన దృష్టికోణం ఎక్కువగా వచ్చిందన్నారు 
నాగరాజు పాలకొల్లు నుంచి ప్రసంగించడానికి వచ్చిన నాగరాజు నవల గురించి మాట్లాడుతూ రాయలసీమ నవలలు గతంలో ఉన్న ఫక్షం


 కరువు తగ్గిపోయిన నా కరువు మాత్రం ఫలించింది అన్నార
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇ రాసాని స్వామి ఇటీవల నవలలు తీసుకు వచ్చారన్నారు సన్నపురెడ్డి రాసిన నవలకు తానా వారు అంతర్జాతీయ బహుమతిని కూడా ప్రకటించారన్నారు రు ఈయన కరువు గురించి రాస్తే రాసాని కరువుకు మూలాల్ని బతుకు పోరాటాన్ని చిత్రీకరించారు అన్నారు స్వామి బహుజనుల జీవితాలను గురించి రాశారన్నారు రు
నాటకాలు నాటకాల విభాగానికి అధ్యక్షత వహించిన షేక్ మస్తాన్వలి మాట్లాడుతూనాటకాలు ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తాయని అన్నారు రాయలసీమ నాటకాల గురించి  మూల మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ తూనాటకాలు ప్రజలను రంజింప చేస్తూ ఆలోచింపజేస్తాయి అన్నారు రాయలసీమ నాటకాలలో యాక్షన్ తో పాటు ఉ హాస్యం ఆవేదన బలంగా ఉందన్నారు సామాజిక నాటకాలకు ఇంకా ఆదరణ తగ్గలేదని వాటిని ప్రదర్శిస్తే ప్రజలు విరివిగా హాజరవుతున్నారన్నారు మిగతా ప్రక్రియలకన్నా నాటకాలలో వచ్చిన సాహిత్యం తక్కువగానే ఉందన్నారు అనంతపురం నుంచి శ్రీరాములు కడప నుండి మల్లికార్జున్ రెడ్డి ఇలా కొద్ది మంది మాత్రమే రాస్తున్నారు అన్న ఇలా కొద్ది మంది మాత్రమే రాస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో లో కదిరి ప్రాంతపు కవి శంకర్ నారాయణ రాజు శివారెడ్డి జానుమద్ది ప్రభాకరశాస్త్రి సుధాకర్ ర్ మల్ రెడ్ ఎద్దుల మహాలక్ష్మి జనవిజ్ఞాన వేదిక నాయకులునరసింహా రెడ్డి  గాయత్రి  విద్యార్థినీ విద్యార్థులుతదితరులు లు ఈ సాహితీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుయ

డాక్టర్ ఎద్దుల సిద్ధారెడ్డి


డాక్టర్ దగ్గర సిద్ధారెడ్డి 16 1955న వైఎస్ఆర్ కడప జిల్లా లోని పులివెందుల దగ్గర ఉన్న వేముల మండలం లో ఎద్దుల బాలమ్మ ఎద్దులు చిన్న సిద్ధారెడ్డి  దంపతులకు జన్మించారు. పదవ తరగతి వరకు ప్రేమలో ఇంటర్ విద్యను కేంద్రంలోనూ డిగ్రీ విద్యను తిరుపతిలోని s v డిగ్రీ కాలేజీలోను మాస్టర్ డిగ్రీని ,పి హెచ్ డి లను వెంకటేశ్వర యూనివర్సిటీ లో 1985లో పూర్తి చేశారు. 15 8 1980 లో సింగారెడ్డి ఓబులేష్ రెడ్డి e వెంకట సుబ్బమ్మ దంపతుల ఏకైక పుత్రిక శింగారెడ్డి మహాలక్ష్మి గారిని వేంపల్లె దగ్గర ఉన్న గండిలో వివాహం చేసుకున్నారు. ఎద్దుల మహాలక్ష్మి గారు రు ఎం.ఏలో రాజనీతిశాస్త్రం ,తెలుగు లను ఎస్వీ యూనివర్సిటీలో 1982లో పూర్తి చేశారు.
         కొంతకాలం రేణిగుంట లోనూ తర్వాత పులివెందుల లోని కళాశాలలో పనిచేశారు. 1984 నుంచి 1989 వరకు కర్నూలు జిల్లా లోని సంజామలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా నియమితులయ్యారు.1989 నుంచి 2004 వరకు కదిరి ప్రాంతంలో తెలుగు ఉపన్యాసకులుగా జూనియర్ కళాశాలలో పని చేశారు. పదోన్నతితో కడప డిగ్రీ కళాశాలలో 2004 నుండి 2013 వరకు పనిచేసి పదవీ విరమణ చేశారు. సాహిత్యం భావ ప్రచారానికి తోడ్పడుతుందని బలంగా నమ్మిన వ్యక్తి ఎద్దుల సిద్ధారెడ్డి. ఆయన మార్క్సిస్టు దృక్పథం గల వ్యక్తి. ఆయన తన బోధనలో మార్క్సిస్టు దృక్పథాలను విద్యార్థులకు వివరించేవారు.రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి చెందాలని బలంగా  ఆకాంక్షించిన  వ్యక్తి ఈయన. కథా రచయిత విమర్శకుడు సాహితీవేత్త అయిన కేతు విశ్వనాథ రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఉండేది. బండి గోపాల్ రెడ్డి (బంగోరె)అతని మిత్రులు కూడా.ఎద్దుల సిద్ధారెడ్డి శాస్త్రీయ ఆలోచన కలిగిన వ్యక్తి . అందువలన ఆయన జన విజ్ఞాన వేదికకు కూడా చేదోడువాదోడుగా ఉండేవాడు. 
ఆయన జ్ఞాపకార్థం  అనంతపురం జిల్లా స్థాయిలో సాహిత్య పోటీలు నిర్వహించి విజేతలైన వారికికదిరిలో ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి కవిత కథ పురస్కారాలను సాహితీ స్రవంతి కదిరిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అందజేసింది. ఈ పురస్కారాల ప్రదానానికి ఆర్థిక సహాయాన్ని ని ఎద్దుల మహాలక్ష్మి గారు అందజేసారు. అలాగే జూలై 7వ తేదీన ఎద్దుల సిద్ధారెడ్డి స్మారకోపన్యాసాలను కూడా సాహితీ స్రవంతి ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఆర్థిక హార్థిక వ్యవహారాలను ఎద్దుల మహాలక్ష్మి గారే పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం సాహిత్య ప్రస్థానం లో వస్తున్న అత్యుత్తమ కథకు కవితకు ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి కవిత, కథ పురస్కారాలను ఇవ్వడానికి  సాహితీ స్రవంతి సంస్థకు  150000 రూపాయలు విరాళంగా ఇచ్చింది దాని  డిపాజిట్ పై వచ్చే వార్షిక ఆదాయం తో ఈ పురస్కారాలు ఇవ్వడానికి  రాష్ట్ర కమిటీ బాధ్యత తీసుకుంది.

ఎద్దుల సిద్ధారెడ్డి స్మారక పురస్కారం


               
డాక్టర్ ఎద్దుల సిద్ధారెడ్డి  ఫిబ్రవరి 2019 లో కీర్తిశేషులయ్యారు. వారు కదిరి లో,కడపలోని డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి  పదవీ విరమణ పొందారు. ఆయన మంచి సాహిత్యకారులు మరియు సాహిత్యకారులను ప్రోత్సహించేవారు. ఆయన స్మారకార్ధం ఎద్దుల సిద్ధారెడ్డి సాహిత్య పురస్కారాన్ని  ప్రతి సంవత్సరం ఇవ్వడానికి నేను  రు.150000 (ఒక లక్ష యాబై వేల రూపాయలు) లను సాహిత్య ప్రస్థానం మాస పత్రికకు ఇదివరకే పంపాను. దానిని మీరు బ్యాంకులో డిపాజిట్ చేసి  దాని మీద సంవత్సరాంతంలో వచ్చే రాబడితో సాహిత్య ప్రస్థానంలో వస్తున్న మంచి రచనకు  ఎద్దుల సిద్ధారెడ్డి సాహిత్య పురస్కారం పేరుతో పురస్కారాన్ని నిరంతరంగా మీరు అందజేయాలని దానిని వివరాలను మీ పత్రికలో ప్రచురించాలని కోరుతున్నాను. దానికి సంబంధించిన వివరాలను క్రింద కనబరచిన చిరునామాకు దయచేసి పంపవలసినదిగా కోరుతున్నాను. .
ఈ బాధ్యతను తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు మీకు నా  ధన్యవాదాలు. 
ఏద్దుల మహాలక్ష్మి