డాక్టర్ దగ్గర సిద్ధారెడ్డి 16 1955న వైఎస్ఆర్ కడప జిల్లా లోని పులివెందుల దగ్గర ఉన్న వేముల మండలం లో ఎద్దుల బాలమ్మ ఎద్దులు చిన్న సిద్ధారెడ్డి దంపతులకు జన్మించారు. పదవ తరగతి వరకు ప్రేమలో ఇంటర్ విద్యను కేంద్రంలోనూ డిగ్రీ విద్యను తిరుపతిలోని s v డిగ్రీ కాలేజీలోను మాస్టర్ డిగ్రీని ,పి హెచ్ డి లను వెంకటేశ్వర యూనివర్సిటీ లో 1985లో పూర్తి చేశారు. 15 8 1980 లో సింగారెడ్డి ఓబులేష్ రెడ్డి e వెంకట సుబ్బమ్మ దంపతుల ఏకైక పుత్రిక శింగారెడ్డి మహాలక్ష్మి గారిని వేంపల్లె దగ్గర ఉన్న గండిలో వివాహం చేసుకున్నారు. ఎద్దుల మహాలక్ష్మి గారు రు ఎం.ఏలో రాజనీతిశాస్త్రం ,తెలుగు లను ఎస్వీ యూనివర్సిటీలో 1982లో పూర్తి చేశారు.
కొంతకాలం రేణిగుంట లోనూ తర్వాత పులివెందుల లోని కళాశాలలో పనిచేశారు. 1984 నుంచి 1989 వరకు కర్నూలు జిల్లా లోని సంజామలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా నియమితులయ్యారు.1989 నుంచి 2004 వరకు కదిరి ప్రాంతంలో తెలుగు ఉపన్యాసకులుగా జూనియర్ కళాశాలలో పని చేశారు. పదోన్నతితో కడప డిగ్రీ కళాశాలలో 2004 నుండి 2013 వరకు పనిచేసి పదవీ విరమణ చేశారు. సాహిత్యం భావ ప్రచారానికి తోడ్పడుతుందని బలంగా నమ్మిన వ్యక్తి ఎద్దుల సిద్ధారెడ్డి. ఆయన మార్క్సిస్టు దృక్పథం గల వ్యక్తి. ఆయన తన బోధనలో మార్క్సిస్టు దృక్పథాలను విద్యార్థులకు వివరించేవారు.రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి చెందాలని బలంగా ఆకాంక్షించిన వ్యక్తి ఈయన. కథా రచయిత విమర్శకుడు సాహితీవేత్త అయిన కేతు విశ్వనాథ రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఉండేది. బండి గోపాల్ రెడ్డి (బంగోరె)అతని మిత్రులు కూడా.ఎద్దుల సిద్ధారెడ్డి శాస్త్రీయ ఆలోచన కలిగిన వ్యక్తి . అందువలన ఆయన జన విజ్ఞాన వేదికకు కూడా చేదోడువాదోడుగా ఉండేవాడు.
ఆయన జ్ఞాపకార్థం అనంతపురం జిల్లా స్థాయిలో సాహిత్య పోటీలు నిర్వహించి విజేతలైన వారికికదిరిలో ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి కవిత కథ పురస్కారాలను సాహితీ స్రవంతి కదిరిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అందజేసింది. ఈ పురస్కారాల ప్రదానానికి ఆర్థిక సహాయాన్ని ని ఎద్దుల మహాలక్ష్మి గారు అందజేసారు. అలాగే జూలై 7వ తేదీన ఎద్దుల సిద్ధారెడ్డి స్మారకోపన్యాసాలను కూడా సాహితీ స్రవంతి ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఆర్థిక హార్థిక వ్యవహారాలను ఎద్దుల మహాలక్ష్మి గారే పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం సాహిత్య ప్రస్థానం లో వస్తున్న అత్యుత్తమ కథకు కవితకు ఎద్దుల సిద్ధారెడ్డి మహాలక్ష్మి కవిత, కథ పురస్కారాలను ఇవ్వడానికి సాహితీ స్రవంతి సంస్థకు 150000 రూపాయలు విరాళంగా ఇచ్చింది దాని డిపాజిట్ పై వచ్చే వార్షిక ఆదాయం తో ఈ పురస్కారాలు ఇవ్వడానికి రాష్ట్ర కమిటీ బాధ్యత తీసుకుంది.
No comments:
Post a Comment