Sunday, October 4, 2020

అనంతపురంజిల్లాలో సాహితీస్రవంతి_ నివేదిక 9/2019




                                 
            సాహితీ స్రవంతి కి పార్టీతో సరైన అనుసంధానం  జిల్లాలో లేనందున ఫ్రాక్షన్ ఏర్పాటు అవసరమని కుమారస్వామి
భావించి రాంభూపాల్ గారితో సంప్రదించి ప్రగతి,రవిచంద్ర,యమున ,కుమారస్వామి గార్లతో ఒక ఫ్రాక్షన్ ను ఏర్పాటుచేయడం
జరిగింది.
           కా!రాంభూపాల్ గారి సలహా మేరకు  కల్బుర్గి మొదలైన సాహిత్యకారుల హత్యలను ఖండిస్తూ నిరసన సమావేశాన్ని నిర్వహించాము. రాష్టృ కేంద్రం స్వేచ్చా స్వరం పుస్తకాన్ని  2016 డిసెంబరులో ఆవిష్కరించారు.ఆ సందర్భంగా అనంతపురం నుండి 50000 రూపాయల యాడ్స్ సేకరించి పంపినాము .

                     2017 ఫిబ్రవరి లో సాహితీ స్రవంతి ప్రచురించిన "అనంత సాహితీ సమాలోచన" పుస్తకాన్నిప్రచురించి ఆవిష్కరించాము .2017 ఏప్రిల్‌లో 30న వివిధ సాహిత్య సంఘాల తో కలిసి వేమన సాహిత్యం పైరాష్ట్ర సదస్సును నిర్వహించాము.ప్రజానాట్యమండలి వేమన రూపకాన్ని ప్రదర్సించింది.పార్టీ సహకారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం జరిగేది కాదు.దీని కోసం రూ. 4.85  లక్షలు విరాళాలు సేకరించాము. ఇందులో దాదాపు 3.49 లక్షలు ఖర్చు అయింది.. రాష్ట్ర కేంద్రానికి 50000 మొత్తాన్ని అక్టోబరులో పంపినాము.రాష్ట్రకేంద్రం కోరినపిమ్మట రాంభూపాల్ గారితో సంప్రదించి ఈ మొత్తాన్ని పంపాము.
      జూన్ నెలలో శ్రీ శ్రీ వర్ధంతి నిర్వహించాము. ప్రతి సంవత్సరం జరిగినట్లే జూలై 2017 లో
కార్యకర్తలకు ఒక ' కార్యశాల 'నిర్వహించి నూతన జిల్లా కమిటీని నగర కమిటీని నిర్మించాము. ఈ కార్యశాలకు రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ గారు  హాజరయ్యారు. కార్యశాలలో "సాహిత్యం లో ప్రాపంచిక దృక్పథం" పై పిళ్ళాకుమారస్వామి, కథాపరిణామక్రమం పై రాచపాలెం సంఘ నిర్మాణం పనిపద్దతులపై వొరప్రసాద్ ప్రసంగించారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి , అధ్యక్షులుగా కటకం కృష్ణవేణి , ప్రధాన
కార్యదర్శిగా చెన్నా రామమూర్తి ,కోశాధికారిగా అశ్వర్త రెడ్డి లను ఇతరకమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జులైలో 'రాయలసీమ సాహిత్యంం' పై ఒక పుస్తకాన్ని ప్రచురించాము . కదిరిలో జాషువా వర్ధంతి ని, నసీర్ అహమ్మమద్ రచించిన హిందూ ముస్లింల ఐక్యత కు ప్రతి రూపాలు అనే  పుస్తకావిష్కరణ
జరిపాము.హిందూపురం లో సాహిత్య అకాడమీ తోకలిసి  కథల్లో చేతివృత్తుల పై సదస్సు నిర్వహించాము .
                 నవంబరులో వేమన సభ కు కొనసాగింపుగా 13 పుపుస్తకాల పై సమీక్ష సదస్సు నిర్వహించాము. డిసెంబరులో" ఆధునిక సాహితీ ప్రస్తానము"  పుస్తకాన్ని ఆవిష్కరించాము.
ప్రధాన కార్యదర్శి చెన్నా రామమూర్తి ఉద్యోగ రీత్యా బదిలీ కావడం తో దాముగట్ల
హిదయాతుల్లా ను ప్రధాన కార్యదర్శి గా ఫ్రాక్షన్ లో నిర్ణయించి తీసుకున్నాము.
                        2018 లో ఫిబ్రవరినుండి "వర్తమాన సాహితీ తరంగాలు" పేరుతో ప్రతి నెలా అనంతపురం లో
ఉన్న వర్తమాన  సాహితీ మూర్తుల రచనలను కొత్త తరానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపట్టినాం .ఇది నవంబరు
నెల వరకు సాగింది.   ఇందులో పాల్గొన్న   వారికీ సాహిత్య విమర్శ ఎలా చేయాలన్న  దానిపై రాచపాళెం గారితో 
రెండు గంటలు క్లాసు కూడా నిర్వహించాము. ప్రతి కార్యక్రమంలో అధ్యక్షత వహించడానికి   కమిటీ సభ్యులకే ప్రాధాన్యత నిచ్చాము. ఈ కార్యక్రమం ద్వారా సాహిత్య కారుల్లో సాహితీ స్రవంతి పట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. అదే సమయం లో కొన్ని అవాంఛనీయ ధోరణులు తలెత్తాయి . కొంత మందిలో సాహితీస్రవంతి పట్ల అసూయ లాంటివి కూడా ఏర్పడ్డాయి.
మార్చి లో దాదాఖాలందర్ ప్రధాన కార్యదర్శిగా ,  రసూల్ అధ్యక్షులుగా ప్రగతి   ఉపాధ్యక్షులుగా నగరకమిటీ ఏర్పడింది. 
వీరి ఆధ్వర్యం లో ఉగాది కవిసమ్మేళనం,పుస్తకావిష్కరణ జరిగాయి. కొత్తగా వచ్చిన వారిలో కెరీరిస్టు లక్షణాలు ఉన్నాయి.వారిలో
ఉన్న ఈ లక్షణాన్ని మన సంఘం సమన్వయం చేసుకోలేక వారిని వదులు కున్నది. వారి సామాజిక తరగతిని బట్టి వారిని 
మనం  నిలుపు కోగలిగి ఉంటె బాగుండేది. నగర కమిటీ ని రాష్ట్ర కేంద్రం సలహా మేరకు రద్దు చేయడం జరిగింది. 
జూన్ నెలలో సాహిత్యశాల నిర్వహించాం . జూలై లో నూతన జిల్లా కమిటీ ని  నియమించడం జరిగింది. ఈ 
కమిటీ లో గౌరవాధ్యక్షులుగా కుమారస్వామి , అధ్యక్షులుగా ప్రగతి , ప్రధాన కార్యదర్శి గా హిదయతుల్లా మొదలైన 
వారున్నారు. వేమన సదస్సు సందర్బంగా నిర్ణయించిన  మేరకు వేమన సాహిత్య పీఠం కు అధ్యక్షులు గా ఏలూరి 
ఎంగన్న ,ప్రధాన కార్యదర్శిగా కృష్ణవేణి గార్లను నియమించడం జరిగింది. ఆయేషా హత్య ఉదంతానికి సంబంధించి నిరసన గళాలనుప్రజానాట్యమండలి తో కలిసి నిర్వహించాము. ప్రగతి గారు రాసిన కోయిలచెట్టుపుస్తకాన్ని కుమార స్వామి గారు రాసిన మట్టిపోగు పుస్తకాన్ని ఆవిష్కరించాము. ఎడారి బతుకులు ,కటిక పూలు పుస్తకాలను ఆవిష్కరించాము.
          హిందూపురంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బాధ్యులు నాగశేషు ,అశ్వర్థ నారాయణ లు కలిసి సాహిత్య అకాడమీ సహకారంతో అక్టోబర్ లో సింపోసియం నిర్వహించారు. గురజాడ శ్రీశ్రీ జాషువాల జయంతులను కూడా నిర్వహించారు.
                              2019 మార్చి నెలలో అనంతపురం లో మహిళా దినోత్సవం ,జూన్ లో శ్రీశ్రీ జయంతి, జూన్ నుండి ఇప్పటివరకు  నెలనెలా సాహితీ సంగమం లో భాగంగా కవిత్వంతో కరచాలనం ,కథాసంగమం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం . ఐద్వా చేపట్టిన కందుకూరి  శత వర్ధంతి కార్యక్రమాలలో ప్రధాన పాత్రను సాహితీ స్రవంతి తీసుకుంది. 
          ఈ సంవత్సరం జూన్ నెలలో కదిరిలోఎద్దుల సిద్ధారెడ్డి  స్మారక సాహిత్య పోటీలు కథ, కవిత్వంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో  కుమారస్వామి నిర్వహించారు. అదేవిధంగా ఎద్దుల సిద్ధారెడ్డి  స్మారకార్థం కడపలో రాయలసీమ సాహిత్యంపై సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కుమారస్వామి నిర్వహించారు.
                       సాహితీ స్రవంతి కోశాధికారిగా రవిచంద్ర గారు ఉన్న సమయం లో వేమన సదస్సు సందర్బంగా కుమారస్వామి,రవిచంద్ర కలిసి  సాహితీ స్రవంతి పేరుతొ అకౌంట్ ను స్టేట్ బ్యాంకు లో తెరిచారు.రవిచంద్ర గారు దీనికి తగిన సమయం కేటాయించలేక కుమారస్వామిని నిర్వహించమన్నారు.దీనికి సంబందించిన జమ ఖర్చు వివరాలను కింది పత్రం లో చూడగలరు.