సుమారు పదహారు సంవత్సరాల క్రిందట 2002లో సాహిత్య ప్రస్థానం పత్రిక ఆవిష్కరణ సభతో అనంతపురం జిల్లాలో సాహితీ స్రవంతి ప్రస్థానం ప్రారంభమైంది . పిళ్లా కుమారస్వామి రెడ్డి, డా.గేయానంద్ ,డా . మోక్షప్రసూన లతో సాహితి స్రవంతి కోసం ఏర్పడిన కన్వీనింగ్ కమిటీ 2002 నుండి పనిచెయడం ప్రారంభించింది. అప్పటి నుండి రాష్ట్ర కమిటీ నిర్ణయం అనుసరించి శ్రీ శ్రీ , జాషువా , గురజాడ వర్ధంతులను లేదా జయంతులను క్రమం తప్పకుండా సాహితీ స్రవంతి జిల్లా కమిటీ నిర్వహిస్తూవస్తోంది.
2003 లో అమెరికా ఇరాక్ పై యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీనిపై నిరసన వ్యక్తమైంది . ఆ నేపద్యంలో జిల్లాలో సాహితీ స్రవంతి "యుద్ధవ్యతిరేక కవితాగళాలు” పేరుతొ ఇరాక్ పై అమెరికా యుద్దాన్ని వ్యతిరేకిస్తూ కవిసమ్మేళనం నిర్వహించింది . ముందస్తు ఎన్నికలపైకవితాగానాన్నినిర్వహించింది. జిల్లాలోప్రజాఉద్యమాలుజరుగుతున్ననేపధ్యంలోసాహితీస్రవంతి స్పందించింది.ఈఉద్యమాలకుమద్దతుగా సాహిత్యకారులతో అనేకసాహిత్యసభలనునిర్వహించింది.2004లో సిపియం పార్టీ జిల్లాసమగ్రాభివృద్దికోరుతూ చేస్తున్నపాదయాత్రల సందర్భంగా "జిల్లా వెనుకబాటుతనం- నిర్మూలన" పై కవి సమ్మెళనంనిర్వహించింది. ఆ సందర్భంగా పార్టీ ప్రచురించిన అనంతప్రస్తానం పుస్తకరచనలో సాహితీస్రవంతి కన్వీనరు పిళ్ళా కుమారస్వామి కీలక పాత్ర వహించారు .2005లో కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటీ జిల్లాలో సామాజికన్యాయం ,కులవివక్ష అంశాలపై సైకిల్ యాత్ర నిర్వహించింది .ఆసందర్బంలో సాహితీస్రవంతి "కులవివక్ష పై కవితాసమరం" పేరుతో కవిసమ్మేళనం నిర్వహించింది .వారికి మద్దతుగా సాహితీస్రవంతి కన్వీనరు పిళ్ళా కుమారస్వామి సైకిలు యాత్రలోకూడా పాల్గొన్నారు. వివిధ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కథ, కవిత్వ రచనలలోపోటీలునిర్వహించింది.తరువాతజిల్లాలో పేదలు చేస్తున్న భూపోరాటానికి అక్షర సంఘీభావం పేరిట శ్రీశ్రీ వర్ధంతి రోజున కవిసమ్మెళనం నిర్వహించింది . 2006లో కమిటీలొకి హరికృష్ణ (కేక ),ఎస్వీ ప్రసాదులను కలుపుకొని కార్యక్రమాలను నిర్వహించింది .సాహితీ స్రవంతి ఉద్యొగఉపాద్యాయ రంగాలలోసాహిత్యకార్యక్రమాలనునిర్వహించివారిలొసాహితీసృజన గలవారిని గుర్తించాలని నిర్ణంచించింది.ఆప్పటినుండిసెప్టెంబరు 5 ఉపాద్యాయదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు కథ ,కవిత్వంలలో సాహిత్య పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయటంప్రారంభించింది. జీవితబీమా సంస్థలొ కడప డివిజన్ లొని అనంతపురం,కడప,కర్నూలు జిల్లాలొని వుద్యొగులందరికి కవితల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేసింది. సాహితీ స్రవంతి విశాల ప్రాతిపదికన అందరినీ కలుపుకొని పనిచేయసాగింది.
పేద ప్రజలు 2007లో ప్రభుత్వమిగులుభూములు పంచాలని భూపోరాటం పోరాటం చేస్తున్నారు. ఆ సందర్భంగా ముదిగొండ లో భూపోరాటం చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపి ఐదుమందిని పొట్టనపెట్టుకొంది ప్రభుత్వం. దీనికి నిరసనగా సాహితీస్రవంతి అనంతపురం శాఖ నిరసన కవిసమ్మెళనం నిర్వహించింది. అలాగే రాష్త్రస్థాయిలో వచ్చిన కవితాగ్రహాన్ని” భూస్వరాలు” పేరుతొ సాహితీస్రవంతి రాష్ట్ర శాఖ కవితా సంకలనాన్ని తీసుకు వచ్చింది . ఈ సంకలనాన్ని అనంతపురం లో యు .ఎ . నరసింహారావు గారు రచించిన”కన్యాశుల్కం - ఆధునిక భారతీయ నాటకాల” తో పాటు సాహితీ స్రవంతి ఆవిష్కరించింది.ఈ సంకలనంలో అనంతపురం కవులు చాలా మంది వున్నారు. ఈ ఆవిష్కరణకు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి గారు ముఖ్యఅతిధి గా విచ్చేశారు.
పిళ్ళాకుమారస్వామి ,రామకృష్ణ (lic),మధురశ్రీ , సురేశ్ లతో కమిటీ పనిచేస్తూ వుండింది.
రాష్ట్ర కేంద్రం భాధ్యులు వొరప్రసాద్ గారి సలహా మేరకు , జిల్లా నగర స్థాయిలో అనేక సాహిత్య కార్యక్రమాల ను నిర్వహించడం వల్ల వచ్చిన సంబందాలతో 2011 లో సాహితీ స్రవంతికి జిల్లా స్తాయి కమిటీ ని ఏర్పాటు చేసినాను.. ప్రధాన కార్యదర్శిగా తగరం క్రిష్ణయ్య ,జిల్లా అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి ,కార్యదర్శులుగా ఆకుల రఘురామయ్య, ముకుందాపురం పెద్దన్న ,ఉపాధ్యక్షులుగా అంకెరామలింగమయ్య ,ఎర్రిస్వామి ,కొశాదికారిగా ప్రజ్ఞసురేష్ , సభ్యులుగాఆవులజయప్రద(ఉరవకొండ ), సివన్న(మడకశిర),రామకృష్ణ,శేషాచార్యులు ,జూటూరి షరీఫ్ లతో ప్రధమ జిల్లా స్తాయి కమిటీ ఏర్పడింది. నూతన కమిటీ చురుకుగా అనెక కార్యక్రమాలను నిర్వహించింది.
జిల్లా వ్యాప్తంగా ఆహ్వానించగా వచ్చిన కవితలన్నీక్రోడీకరించి మల్లెల నరసింహమూర్తి, పిళ్ళాకుమారస్వామి సంపాదకత్వంలొ "అనంతకవితాస్వరాలు"పేరుతో మే 2015లో కవితాసంకలనాన్నితీసుకువచ్చాము . అదే సందర్భంలో నూతన జిల్లా కమిటీ కూడా ఏర్పడింది . కమిటీలో 'ప్రధానకార్యదర్శి గా ప్రజ్ఞా సురేష్,అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి,ఉపాధ్యక్షులుగా అంకె రామలింగమయ్య , బాలభారతమ్మ , కార్యదర్శులుగా రియాజు ద్దీన్,ఆకులరఘురామయ్య గార్లు భాద్యతలు తీసుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అనంతకవితా స్వరాలు పుస్తకావిష్కరణ సభకు మేడిపల్లి రవికుమార్ గారు తిరుపతి నుంచి వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు . ముఖ్య అతిధిగా డా. గేయానంద్ గారు పాల్గొన్నారు . నెలనెలా క్రమం తప్పకుండా సంవత్సరంపాటు సాహితీసమయం పేరుతో పిళ్లా కుమారస్వామి నివాసం లో తరువాత ప్రజాశక్తి కార్యాలయం లో నూ కవుల సాహిత్య గోష్టి నిర్వహించడం ద్వారా అనంతపురం నగర కమిటీ కూడా ఏర్పడటానికి దోహదపడింది . నగరకమిటీ లోఅధ్యక్షులుగా వై.సూర్యనారయణ రెడ్డి ,నగర ప్రధాన కార్యదర్శి గా పొకూరి చంద్రశేఖర్ ,ఉపాధ్యక్షులుగా నీరుగంటి వేంకటేశు ,కార్యదర్శిగా రవిచంద్ర భాద్యతలు తీసుకొన్నారు .
అనంత కవిత స్వరాలు కవితా సంకలనాన్ని పరిచయం చేసేందుకు కదిరి,హిందూపురం,ఉరవకొండ ధర్మవరం ప్రాంతాలలో జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి గారు పర్యటించి జన కవనాలను కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా కదిరిలో ఆ శాఖ అధ్యక్షులుగా చలపతి,ప్రధాన కార్యదర్శిగా చిన్నారావు లతో ఒక కమిటీ ఏర్పడింది . హిందూపురం లో నాగశేషు,అశ్వర్థనారాయణ ప్రధానకార్యదర్శి , అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కమిటీ ఏర్పడింది . ఉరవకొండ లో ఆవులవెంకటెసులు ,గంగాధర్ లు అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీ ఏర్పడింది . ధర్మవరం లో నూతనశాఖ ఏర్పడింది . ఈ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఇటికంటి మహేaష్ , అధ్యక్షులుగా శారద ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ తదితరులతో కమిటీ నిర్మాణం జరిగింది . ఈ కమిటీ లు గురజాడ , జాషువా వర్ధంతులను నిర్వహించాయి. వీటికి పిళ్ళా కుమారస్వామి సింగమనేని నారాయణ ఏలూరు ఎంగన్న తదితరులను పిలుచుకుని వెళ్లారు.
2016 సంవత్సరం అనంతపురం నగర కమిటీ రాష్ట్రంలోనే ప్రధమంగా కవులు రచయితలతో కేలండరును రూపొందించి ఆర్ట్స్ కళాశాలలోజనవరి లో ఆవిష్కరించింది . అలాగే ఆర్ట్స్ కళాశాల తో కలిసి జిల్లాలొని దివంగత సాహిత్యకారులపై ప్రతి నెల 3వ ఆదివారం సాహితీసమాలోచన నిర్వహించాలని నిర్ణయించింది .ప్రధమంగా మాతృభాషాదినోత్సవం రోజున వేమనపై నిర్వహించిన సభ లో అప్పిరెడ్డి హరనాధరెడ్డి ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు . హిందూపురం ,ధర్మవరం ,అనంతపురం కమిటీలుకూడా మాతృ భాషాదినో త్సవాన్ని నిర్వహించాయి . మార్చినెలలో మహిళా దినోత్సవాన్ని ధర్మవరం ,అనంతపురం నగరం,హిందూపురంశాఖలునిర్వహించాయి.ఏప్రిల్ మాసంలో జిల్లాశాఖ కథ ,కవిత్వంలపై సాహిత్యశాల నిర్వహించింది . ఈసందర్భంగా జిల్లాలోఏర్పడిన ప్రాంతీయ కమిటీ సభ్యులతో నూతన జిల్లా కమిటీ ఏర్పడింది . ఈ కమిటీ లో అధ్యక్షులుగా ప్రగతి , ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర ,ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ (ధర్మవరం ),అశ్వర్థనారాయణ (హిందూపురం),వై .సుర్యనారాయణ రెడ్డి (అనంతపురం ),సహాయ కార్యదర్శులుగా నీరుగంటి వెంకటెసు (అనంతపురం ),ఇటికంటి మహేష్ (ధర్మవరం )పిళ్ళా కుమారస్వామి (రాష్త్ర కమిటీ సభ్యులు),సభ్యులుగా నానీల నాగేంద్ర(అనంతపురం),నర్సిరెడ్డి(పెనుగొండ),తిప్పేస్వామి(కల్యాణదుర్గం),గంగాదేవి , ధరిత్రీదేవి ,
యమునా,హిదయతుల్లా ,రసూల్ ,శ్రీధర్నాయుడు ,బుదేన్సాబ్,చంద్రశేఖర్ (యూనివర్సిటీ ),లక్ష్మినారాయణ (యూనివర్సిటీ ) భాద్యతలు తీసుకున్నారు
సాహిత్యశాల లో రాయలసీమ కథా చిత్రం పై సింగమనేని నారాయణ ,కథ లేలా రాస్తారు పై శశికళ ,బండి నారాయణ స్వామి,సాహిత్య పరిణామ క్రమంపై పిళ్ళా కుమారస్వామి ,కవిత్వం లో వస్తువు పై రాధేయ ,కవితా శిల్పం పై మల్లెల నరసింహమూర్తి గార్లు భోధించారు .ఆ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు హాజరయ్యారు.
ఆంధ్రరాష్త్రం విడిఫొయాక జిల్లాలో రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమసన్నాహాలు చాలా రచయితలు మేధావులతో ప్రారంభమయ్యాయి. రాయలసీమలో అనంతపురంజిల్లా పూర్తిగా వెనుకబడి వుంది.అందువల్ల ఈ ఉద్యమం అనంతపురంలోనే ఊపందుకుంది. కొంతమంది రచయితలు బహిరంగంగా దీనిని ప్రోత్స హిస్తున్నారు. అంతేగాక ప్రపంచీకరణ ప్రభావంతొ జిల్లాలోభాషా సంస్కృతులపై పెనుప్రభావం పడుతొంది. ఈ నేపద్యంలో తెలుగు భాషా సంస్క్రతులను రక్షించుకోవాలని సాహితీస్రవంతి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నది. వర్తమాన పరిస్తితుల్లో సాహితీ స్రవంతి కొత్తతరం సాహితీ సృజనకారులను గుర్తించి ప్రజా సాహిత్యకారులుగా తీర్చి దిద్దాల్సిన కర్తవ్యాన్ని గుర్తించింది . జిల్లాలో సాహిత్యాభివృద్దికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.ఊగాది రోజున తూతూ మంత్రంగా కవిసమ్మెలనాలను నిర్వహిస్తొంది. తెలుగు భాషా సంఘం ఉనికిలోకూడా లేదు. అదే సందర్బంలో వర్ధమానసాహిత్యకారుల్లో సాహిత్యం పట్ల తపన ఉండటం గమనార్హం. వీరి తపనను గుర్తించి సాహితీ స్రవంతి సాహిత్యకార్యశాలలను విరివిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. పాత తరం సాహిత్యకారుల స్పూర్తిని పొందేందుకు నెలనెలా అనంతపురం నగరశాఖ జిల్లాలొని దివంగత సాహిత్యకారులైన వేమన,రాళ్ళపల్లి , తలమర్ల కళానిది,విద్వాన్ విశ్వం , గుత్తిరామకృష్ణ ,కొగిర జై సీతారాం , బెల్లూరు శ్రీనివాసమూర్తి,సర్దేశాయి తిరుమలరావు ల సాహిత్యం పై నెలనెలా సాహితీ సమాలొచన చేపట్టింది. వారిపై వచ్చిన ప్రసంగాలను జిల్లాలో సాహితీ స్రవంతి ప్రస్తానాన్ని , జిల్లాలో సాహిత్య స్తూల రేఖాచిత్రాన్ని జతచేసి ఒక పుస్తకాన్ని అనంత సాహిత్యాసమాలోచన పేరుతో ప్రచురించాము.ఆ పుస్తకాన్ని ఆర్ట్స్ కళాశాల లో ఆవిష్కరించాము .
సాహిత్య అకాడమీ తో కలిసి కార్మికసాహిత్యం పై 2016 డిసెంబరు 25న సదస్సు నిర్వహించాము.ఈ సదస్సుకు రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి హాజరయ్యారు.పిళ్ళాకుమారస్వామి కదిరికి తన నివార్చిన తరువాత 2016 లో క దిరి లో ఇపుడు వీస్తున్న గాలి పేరుతో నెల నెలా జిల్లాలోని కవుల రచన లపై సమీక్షా సమవేశాలు నిర్వహించాము.జూపల్లి ప్రేంచంద్ రచించిన అవేధ, రమేష్ నారాయణ రచించిన గిరిజన సంస్క్రుతులు ~ సడ్లపల్లి, దృశ్యప్రవాహం ~ వైసిపి వెంకట్ రెడ్ది ,సినిమావైరాగ్యం ~ పుస్తకాలను పరిచయం చేస్తూ సమీక్ష సమావేశాలను నిర్వహించారు.
జిల్లాస్తాయిలో కథల పోటీ నిర్వహించి పిళ్లా కుమారస్వామి తల్లిదండ్రుల పేర్లతో పిళ్లా లక్ష్మి రెడ్డి పిళ్లా రామలక్ష్మి పురస్కారం అందజేశారు.కమిటీ సభ్యురాలు బాలభారతమ్మ తన తల్లి దండ్రుల పేర్ల తో కవితా పురస్కారాన్ని అందజేశారు .
కల్బుర్గి మొదలైన సాహిత్యకారుల హత్యలను ఖండిస్తూ నిరసన సమావేశాన్ని నిర్వహించాము. స్వేచ్చా స్వరం పుస్తకం 2016 డిసెంబరులో ఆవిష్కరించాము.
2017 ఫిబ్రవరి లో సాహితీ స్రవంతి ప్రచురించిన అనంత సాహితీ సమాలోచన పుస్తకాన్ని ప్రచురించి ఆవిష్కరించాము .2017 ఏప్రిల్లో 30న వివిధ సాహిత్య సంఘాల తో కలిసి వేమన సాహిత్యం పై రాష్ట్ర సదస్సు ను నిర్వహించాము.ప్రజానాట్యమండలి వేమన రూపకాన్ని ప్రదర్సించింది. జూన్ నెలలో శ్రీ శ్రీ వర్ధంతి నిర్వహించాము. ప్రతి సంవత్సరం జరిగినట్లే జూలై 2017 లో కార్యకర్తలకు ఒక కార్యశాల నిర్వహించి నూతన జిల్లా కమిటీ ని నగర కమిటీ ని నిర్మించాము. ఈ కార్యశాలకు రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ హాజరయ్యారు. కార్యశాలలో సాహిత్యం లో ప్రాపంచిక దృక్పథం పై పిళ్ళాకుమారస్వామి కథాపరిణామక్రమం పై రాచపాలెం సంఘ నిర్మాణం పనిపద్దతులపై వొరప్రసాద్ ప్రసంగించారు.జిల్లా గౌరవాధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి , అధ్యక్షులుగా కటకం కృష్ణవేణి , ప్రధాన కార్యదర్శిగా చెన్నా రామమూర్తి ,కోశాధికారిగా అశ్వర్త రెడ్డి లను ఇతరకమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జులైలో రాయలసీమ సాహిత్యం పై ఒక పుస్తకాన్ని ప్రచురించాము . కదిరిలో జాషువా వర్ధంతి ని జరిపాము.హిందూపురం లో సాహిత్య అకాడమీ తో సంయుక్తంగా కథల్లో చేతివృత్తుల పై సదస్సు నిర్వహిన్చాము.
నవంబరులో వేమన సభ కు కొనసాగింపుగా 13 పుపుస్తకాల పై సమీక్ష సదస్సు నిర్వహించాము. డిసెంబరులో ఆధునిక సాహితీ ప్రస్తానమ్ పుస్తకాన్ని ఆవిష్కరించాము.
2018 లో ఫిబ్రవరినుండి వర్తమాన సాహితీ తరంగాలు పేరుతో ప్రతి నెలా అనంతపురం లో ప్రస్తుతం జీవిన్చి ఉన్న సాహితీ మూర్తుల రచనలను కొత్త తరానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపట్టినాం .. ఫిబ్రవరిలోలో 25 మంది సాహిత్యకారుల రచనలపై సదస్సు నిర్వహించాము.మార్చి లో మహిళా దినొత్సవం సందర్బంగ 6 గురు మహిళా రచయిరచయిత్రుల రచనల పై సదస్సు నిర్వహించారము. ఏప్రిల్ లో ఆశావాది సాహిత్య సమాలోచన సదస్సు నిర్వహించాము. జూన్ లో సింగమనేని సాహిత్య సమాలోచన సదస్సు నిర్వహించాము. జూలై లో బండి నారాయణ స్వామి సాహిత్యం పై సదస్సు ను నిర్వహించారము. ఆగష్టు లో రమేష్ నారాయనగారి సాహిత్యం పై సదస్సు ను నిర్వహించాము.
~~~~~ పిళ్లా కుమారస్వామి సాహితీస్రవంతి జిల్లా గౌరావాధ్యక్షులు
9490122229
No comments:
Post a Comment