చరిత్ర అంతమైందని జపాన్ తత్వవేత్త పుకుయామా తీర్మానిచారు.పెట్టుబదీ దారివ్యైమమని సొషలిజం అన్నది లేదని చెప్పారు.అస్తిత్వవాద ద్రుక్పధం పెరిగింది. ఆధునికాంతరవాదాన్ని సహిత్యంలోకి ప్రవేశపెట్టారు .సమిష్టి నినాదం స్తానం లొ వ్యక్తిగత నినాదం పెరిగింది. సమాజంలో వేల వేల చీలికలు వచ్చాయి.ఇక్యంగా పోరాడాల్సిన దలితులు మాదిగ దండోరా, మాలమహానాడుగా చీలిపోయారు. బహుజనుల్లో తుదుందెబ్బ,చాకిరేవుదెబ్బ, వద్దేర ఇలా కుల సంఘాలు పుట్టుకొచ్చాయి. ఫట్టనీకరణ పెరిగి పల్లెలు మాయమయ్యాయి. వాణిజ్య రంగం స్త్రీల అందాన్న్ని పెత్తుబడిగా మార్చింది.విదేశీ వలసలు ప్రారంభమైనాయి. వృద్దుల సమస్య , పిల్లల సమస్య మొదలైన కొత్త సమస్యలు రావడం మూలంగా స్త్రీ వాదానికి పదును తగ్గిపొయింది. దళిత వాదం కూడా చీలికల వలన మునుపటి వేడి తగ్గిపోయింది. ప్రపంచీకరణ వెల్లువలో సాహిత్యకారులు కొట్టుకు పోయారు. తెలంగాణా విడిపోవాలనే వాదన పెరిగింది.
ఏది అభివృద్దో ? ఏది వినాశనమో అర్థంకాని అయోమయంలో సాహిత్యకారులు ప్రపంచీకరణ చౌరస్తాలో నిలబడ్డారు. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అనే పరిస్తితి లోకి వెళ్ళారు. నోస్టాల్జియా లోకి వెళ్ళారు . బషీర్బాగ్ లో ప్రభుత్వం జరిపిన దారుణ దమనకాండ సాహిత్య కారులను కదిలించింది.అందరినీ ఒక్కటి చేసింది. ప్రపంచీకరణ ప్రపంచబ్యాంకుల వాస్తావ స్వరూపం సాక్షాత్కరించింది.ప్రపంచీకరణ ప్రతిఘటన మొదలైంది. వికసించిన విద్యుత్తేజం కవితా సంకలనం వచ్చింది.అదే సందర్భంలో ప్రజల్లో ఏర్పడిన నైరాశ్యాన్ని ఆసరాగా తీసుకొని మతోన్మాదశక్తులు విజృంభించాయి . ఈ నేపధ్యం లో మతోన్మాదానికి ప్రపంచీకరణకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే సాహిత్యకారులందరిని ఒక వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు 2001 లో సాహితీ స్రవంతి ప్రధమ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేసింది.ఈ సమావేశం లొ తెలక పల్లి రవి, వొరప్రసాదు, గార్లతో రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఏర్పడింది . దళిత స్త్రీవాదులను కలుపుకొని పోవాలని నిర్ణయించింది . 2002 లో సాహితీ స్రవంతి సాహిత్య కారుల కోసం ఒక వేదిక గా ఒక ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
సాహిత్య ప్రస్థానం పత్రిక త్రైమాసిక పత్రికగా మూడేళ్ళు నడిచి , తరువాత మాసపత్రికగా నిరంతరంగా వస్తోంది . సాహితీ సృజన లోకం లో మంచికదలికలను తీసుకు వచ్చింది . ప్రగతి శీల సాహిత్యకారుల హృద యాల్లొ సుస్తిరస్తానాన్ని సంపాదించింది. 2001 ముందు దర్పణం , గమనం , ప్రస్తానం సాహిత్య సంచికలను తెలకపల్లి రవిగారి సంపాదకత్వాన ప్రజాశక్తి సాహితీ సంస్త తరపునఅందించారు ఈ ఒరవడిలో సాహిత్య ప్రస్తానం పత్రిక అన్ని వర్గాల సాహిత్య కారులకు ముఖ్యంగా కొత్తతరం సాహితీ సృజనకారులకు మంచి వేదిక అయ్యింది .
అనంతపురం లో కూడా 2001 లోనే సాహితి స్రవంతి ఏర్పాట్లు ప్రారంభమైనాయి.ఒక కన్వీనింగ్ కమిటీ డా.geyaanand ,డా . మోక్షప్రసూన ,పిళ్ళా కుమారస్వామి రెడ్ది లతో ఏర్పడింది. వీరి ఆధ్వర్యంలో 2002లో ప్రస్తానం పత్రిక ఆవిశక్రణను నిర్వహించారు . తెలుగు భాషా సంస్క్రతులు ప్రపంచీకరణ తో వస్తున్న ముప్పు అనే అంశం పై తెలకపల్లి రవి గారు ప్రసంగించారు . సింగమనేని నారాయణ, రాచపాలెం చంద్ర శేఖర రెడ్డి మొదలైన సాహితీ వేత్తలు ప్రస్తానం పత్రిక నిరంతరాయంగా వస్తుందని ఆకాంక్షించారు .
శ్రీ శ్రీ , జాషువా , గురజాడ వర్ధంతు లను క్రమం తప్పకుండా సాహితీ స్రవంతి కన్వీనింగ్ కమిటీ నిర్వహించింది .2002లో పిళ్ళా కుమారస్వామి కన్వినర్ గా భాద్యత తీసుకొన్నారు . 2003లో యుద్ధవ్యతిరేక కవితాగలాలు పేరుతొ ఇరాక్ పై అమెరికా యుద్దాన్ని వ్యతిరేకిస్తూ కవిసమ్మేలనం నిర్వహించింది . 2004లో ముందస్తు ఎన్నికలపై కవితాగానాన్ని నిర్వహించింది .
2006లో పిళ్ళా కుమారస్వామి ,తాడేపల్లి రామకృష్ణ ,మధురశ్రీ గార్లతో కమిటీ పునర్వస్తీకరిం పబడింది . 2006లో జిల్లా వెనుకబాటుతనం,సామాజికన్యం, కులవివక్ష అంశాలపై కవిత్వసమ్మేళనం నిర్వహించింది . సెప్టెంబరు 5 గురు పూజో త్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు కథ ,కవిత్వంలలో సాహిత్య పోటీలు నిర్వహించి బహుమతులను అందజేసింది .
2007లో డిగ్రీ కళా శాల విద్యార్థులకు కథ, కవిత్వ రచనలలో పోటీలు నిర్వహించింది . పేదల భూపోరాటానికి అక్షర సంఘీభావం పేరిట శ్రీశ్రీ వర్ధంతి రోజున కవిసమ్మెలనం నిర్వహించింది . 2007లో కమిటీలొకి హరికృష్ణ (కేక ),ఎస్వీ ప్రసాదులను కలుపుకొని కార్యక్రమాలను నిర్వహించింది .
సాహితీ స్రవంతి పనిచేయడం వల్ల 2007 నాటికి రాష్ట్ర స్తాయి లో సాహిత్య రంగం లో ఇతరసంఘాల కదలికలు పెరిగాయి . రాజకీయాలతో సంభంధం లేని వ్యక్తివాదులూ, సంప్రదాయవాదులు ,పాలక వర్గాలు, కార్పోరేట్ వర్గాల పాత్రకూడాసాహిత్య రంగం లో పెరిగింది. సాహిత్య ప్రముఖుల్లో ఊగిసలాట దొరణులు కొనసాగుతున్నాయి . విశాల ప్రాతిపదికన వారందరినీ కలుపుకొని సాహితీ స్రవంతి పనిచేయసాగింది. అనంతపురం లో ఆధునికాంతర దొరణులు ప్రవేశించడం మొదలైంది . స్త్రీ ,దళిత ,మైనారిటీ ,బహుజనవాదాల పై చర్చ జరిగిన తరువాత ఇది జరిగింది .
2007లో ముదిగొండ లో భూపోరాటం చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపి ఐదుమందిని పొట్టన పెట్టుకొంది ప్రభుత్వం . ఈ సందర్బంగా వచ్చిన కవితాగ్రహాన్ని భూస్వరాలు పేరుతొ సాహితీస్రవంతి రాష్ట్ర శాఖ కవితా సంకలనాన్ని తీసుకు వచ్చింది . ఈ సంకలనాన్ని అనంతపురం లో యు .ఎ . నరసింహారావు గారు రచించిన కన్యాశుల్కం - ఆధునిక భారతీయ నాటకాలు తో పాటు సాహితీ స్రవంతి ఆవిష్కరించింది .
2009లో అనంతపురం నగరకమిటీ కన్వీనర్ గా మిద్దె మురళీ కృష్ణ గారు భాద్యత తీసుకున్నారు . జిల్లనగర స్తాయి సాహిత్య కార్యక్రమాల ను నిర్వహిస్తూ వచ్చింది . పలు సాహిత్య కార్యక్రమాలవల్ల వచ్చిన సంబందాల వల్ల 2011 లో సాహితీ స్రవంతికి జిల్లా స్తాయి కమిటీ ఏర్పడింది . ప్రధాన కార్యదర్శిగా తగరం క్రిష్ణయ్య ,జిల్లా అధ్యక్షునిగా పిల్లా కుమారస్వామి ,కార్యదర్శులు గా ఆకుల రఘురామయ్య ,ముకుందాపురం పెద్దన్న ,ఉపాధ్యక్షులుగా అంకె రామలింగామయ్య ,ఎర్రిస్వామి ,కొశాదికారిగా ప్రజ్ఞ సురేష్ , కమిటీ సభ్యులుగా ఆవుల జయప్రద (ఉరవకొండ ),సివన్న(మడకశిర),రామకృష్ణ,శేషా
2012 లో జిల్లా స్థాయి కవితా సంకలనం తీసుకు రావాలని కమిటీ నిర్ణయించింది తెలంగాణా ఉద్యమం,సమైక్యాంద్ర ఉద్యమం రావడంతో సాహిత్య రంగంలో స్తబ్దత ఏర్పడింది . సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ ఉద్యమాలపట్ల తటస్థ వైఖరితో ఉండాలని నిర్ణయించింది. ప్రాంతీయఅస్తిత్వ ఉద్యమాలు సాహిత్యకారులను చీలుస్తున్నాయని ఇవి ప్రపంచీకరణ కు ,మతోన్మాదానికి వ్యతిరకంగా పోరాడటానికి దోహదపడవని సాహితీ స్రవంతి భావించింది ఏది ఏమైనప్పటికీతెలంగాణారాష్ట్రం 2014 జూన్ 2 న .ఆవిర్భవించింది . ఆంధ్రప్రదేశ్ విడిపోయింది . సమైక్యంద్ర ఉద్యమకారుల ఆవేశాలు ఆశలు చల్లారి పోయాయి . ఆ సందర్భం లో అనంతపురం జిల్లా రాష్ట్రం లో ఎక్కడా లేనంత గ విపరీతంగా స్పందిన్చించింది .
2015లో ముందు తలపెట్టిన కవితా సంకలనాన్ని అనంతకవితా స్వరాలు పెరుతో వివిధ వర్గాల ప్రజల ఆర్ధిక సహకారం తో ప్రచురించింది . అదే సందర్భంలో జిల్లా నూతన కమిటీ ఏర్పడింది . కమిటీలో 'ప్రధానకార్యదర్శి గా ప్రజ్ఞా సురేష్ ,అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి,ఉపాధ్యక్షులుగా అం
201 5లో అనంత కవిత స్వరాలు కవితా సంకలనాన్ని పరిచయం చేసేందుకు కదిరి,హిందూపురం,ఉరవకొండ ధర్మవరం ప్రాంతాలలో జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి గారు
పర్యటించి జన కవనాలను కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా కదిరిలో ఆ శాఖ అధ్యక్షులుగా చలపతి,ప్రధాన కార్యదర్శిగా చిన్నారావు లతో ఒక కమిటీ ఏర్పడింది . హిందూపురం లో నాగసేషు,అశ్వర్థనారాయణ ప్రధానకా
2016లో అనంతపురం నగర కమిటీ రాష్ట్రం లో నే ప్రధమంగా కవులు రచయతలతో కేలండరును రూపొందించి ఆర్ట్స్ కళాశాలలో ఆవిష్కరించింది . అలాగే ఆర్ట్స్ కళాశాల తో కలిసి నెలనెలా సాహితీ సమాలోచన నిర్వహించాలని నిర్ణయించింది . ప్రధమంగా వేమనపై నిర్వహించిన సభ లో అప్పిరెడ్డి హరనాధరెడ్డి ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు .
హిందూపురం ,ధర్మవరం ,అనంతపురం కమిటీలు మాతృ భాషాదినో త్సవాన్ని నిర్వహించాయి . ప్రభుత్వం మాత్రం నిర్వహించలేదు . కదిరిలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఎర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి కోరారు . మహిళా దినోత్సవాన్ని ధర్మవరం ,అనంతపురం నగరం,హిందూపురం శాఖలు నిర్వహించాయి .
ఏప్రిల్ 2016 లో జిల్లా శాఖ కథ ,కవిత్వం లపై సాహిత్య శాల నిర్వహించింది . ఈసందర్భంగా జిల్లా నూతన కమిటీ ఏర్పడింది . ఈ కమిటీ లో అధ్యక్షులుగా ప్రగతి , ప్రధా న కార్యదర్శిగా రవిచంద్ర ,ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ (ధర్మవరం ),అశ్వర్థనారాయణ (హిందూపురం),వై .సుర్యనారాయణ రెడ్డి (అనంతపురం ),సహాయ కార్యదర్శులుగా నీరుగంటి వెంకటెసు (అనంతపురం ),ఇటికంటి మహేష్ (ధర్మవరం )పిళ్ళా కుమారస్వామి (కదిరి ) సభ్యులుగా ఎ ఎనాగేంద్ర (అనంతపురం), నర్సిరెడ్డి (పెనుగొండ),తిప్పేస్వామి(కల్యాణదుర్గం), గంగాదేవి , ధరిత్రీదేవి ,యమునా,హిదయతుల్లా ,రసూల్ ,శ్రీధర్ నాయుడు ,బుదేన్సాబ్ ,చంద్రశేఖర్ (sku), లక్ష్మినారాయణ(sku) భాద్యతలు తీసుకున్నారు
వర్తమాన పరిస్తితుల్లో సాహితీ స్రవంతి కొత్తతరం సాహితీ సృజనకారులను గుర్తించి ప్రజా సాహిత్యకరులుగా తీర్చి దిద్దాల్సిన కర్తవ్యాన్ని గుర్తించింది . తెలుగు భాషా సంస్క్రతులను రక్షించుకోవాలని తన వంతు ప్రయత్నం చెస్తూ ముందుకు సాగుతున్నది .
పిళ్ళా కుమారస్వామి ,అనంతపురం
గ్రంధాలయ వారొత్సవాల సందర్భంగా కవిసమ్మెలనమ్ సాహితీ స్రవంతి ఆద్వర్యంలో
కదిరిలో మాట్లాడుతున్న స్రవంతి రాష్త్రకమిటీ సభ్యులు పిళ్లా కుమారస్వామి


No comments:
Post a Comment