కుమారస్వామి తరువాత సాహిత్య పరిణామక్రమాన్నివివరిం
1942 లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది . ప్రపంచ యుద్ధం జరుగుతూ వుంది . ఫాసిజం రష్యా చేతిలో ఓడిపోతూ వుంది 1943లో తాపిధర్మారావు అధ్యక్షతన అభ్యుదయ రచయతల సంఘం ఏర్పడింది శ్రీ మహాప్రస్తానం, ఆరుద్ర త్వమేవాహం ,సోమసుందర్ వజ్రాయుధం,రమణారెడ్డి అ డవి ,గంగినేని ఉదయిని మొదలైన కవిత సంపుటాలు వచ్చాయి . చాసో కుంకుడాకు ,బొండుమల్లెలు ,కుక్కుటేశ్వర మ్ మొదలైన కథలు రచించారు . 1935-45 వరకు అభ్యుదయం మొదటి దశ ,ఆతరువాత 1945 -50వరకు రెండవ దశగా భావించవచ్చు . రెండవ దశలో తిలక్,కుందుర్తి ,మొదలైన వారున్న్నారు. వీరంతా నెహ్రూ ప్రభావంలో వున్నారు. వీరు శాంతి గీతాలను ఆలపించారు. 1950 నుండి 1965 వరకు సాహిత్యరంగంలో స్తబ్దత ఏర్పడింది . అయితే 1952 లో సాహిత్య అకాడెమీ ఏర్పడింది . 1952 లో పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన కథకు అంతర్జాతీయ బహుమతి లభించింది . ఈ కాలం లో సాహిత్యం ఒక వుద్యమంగా సాగలేదు 1955లో లో ప్రేమ కథలు వచ్చాయి . ఈ కథలన్నీ మధ్య తరగతికి చెందిన కాలేజీచదువుకొనే అబ్బాయి అ మ్మాయి ల ప్రేమ కథలు ..55-67 మధ్య తిలక్ కథలు వచ్చాయి . ఇవన్నీ పునాదిలేని కథలు . 1952లో కమ్యూనిస్తుపార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది . అభ్యుదయ కవులంతా సినిమారంగం లోకి వెళ్ళిపోయారు . 1964లో కమ్యునిస్టు పార్టీ చీలిపోయింది . 1950లో అమెరికాలో బీట్నిక్స్ కవులు వచ్చారు . బ్రిటన్లో యాంగ్రీయంగ్మన్ కవులు నేక్డ్ పొయట్స్ వచ్చారు . 1958లో బెంగాల్ లో ఆకలితరం కవులు తిరుగుబాటు చేసారు . వీరి ప్రభావం వల్ల కావచ్చు 1965లో స్తబ్దతను బద్దలు చేస్తూ దిగంబరకవులు వచ్చారు . తమకవిత్వానికి దిక్ లని పేరు పెట్టారు .
వీరునగ్నముని ,నిఖిలేశ్వర్,జ్వాలాముఖి ,చెరబండరాజు , మహాస్వప్న ,భైరవయ్య . వీళ్ళు లైంగిక ప్రతీకలను తమ కవితల్లో వాడారు . అశ్లీలత ఎక్కువ . సమాజానికి షాక్ ట్రీట్మెంట్ అనేవాళ్ళు . ఇవన్నీ స్త్రీలను కించపరిచేవిధంగా ఉండేవి .పుండ్లు పడిపోయిన వక్షం ,పుచ్చిపోయిన పిండం ,మెదడు పురుగు తినేసింది. చర్మం కుళ్ళిపోయింది . అవయవం పుచ్చిపోయింది . కళ్ళకి కన్నం పడింది .
1969-71లో కిర ణ్ బాబు ,దేవిప్రియ,ఓల్గా ,కమలనాథ్ లు పైగంబరకవులుగా వచ్చారు . 1968-70 ,వరంగల్ లో కిషన్రావు ,సుదర్సన్రాలవు , లోచన్ ,యాదగిరిరావు ,వరవరరావు ,టంకశాల అశోక్ తిరగబడు కవులుగా వచ్చారు . 1967 లోసి పి యం పార్టీ చీలిపోయింది . సిపిఐ (యమ.ల్ ) ఎర్పడింది . అదే సందర్బంలో 1970 లో శ్రీ శ్రీ షష్టి పూర్తీ జరుగుతుండగా రచయతలారా మీరెటువైపు ? అనే కరపత్రం వేసి శ్రీ శ్రీ తో సహా చాలామంది విరసం ఏర్పాటు చేసారు . శ్రీ శ్రీ అధ్యక్షుడు గా అయ్యాదు. కోకు ,రావిశాస్త్రి ,కే.వి.ఆర్ ,కారా, గద్దర్ ,వంగపండు,నగ్నముని,జ్వాలాముఖి ,కే.శివారెడ్డి ,వరవరరావు ,నిఖిలేశ్వర్ మొదలైన వారు చేరారు . సృజన మాసపత్రిక ప్రారంబ మైన్ది. కాని 1975 నాటికి విరసం తన ప్రాభవం కోల్పోయింది . విరసం లో చీలికలు వచ్చాయి . జనసాహితి ఏర్పడింది . ఇదికూడా మళ్ళీ చీలిపోయింది .
1980లో స్త్రీ వాదం దళిత వాదం ప్రవేశించాయి . 1960-70 లలో యూరప్ దేశాలలో వచ్చిన స్త్రీ వాదం 1980 లలో ఆంధ్రదేశం లో ప్రవేశించింది .1980లో రష్యాలో పెరిస్త్రోయికా గ్లాస్నోస్త్ మొదలైన మార్పులు వచ్చాయి . 1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్బవించింది . రామారావు మహిళకు ఆస్తిహక్కులో సమానవాటా ఇస్తానని ప్రకటించి అధికారములోకి వచ్చాడు . మగకీ ఆడకీ శీలాన్నీ ఆస్తినీఎ సమంగా వర్తిమ్పించండి / కాగితాల మీద వేదికల మెడ కాదు. ,నిజంగా సమంగా వర్తిమ్మ్పించండి ఇలా కవిత వచ్చింది . 1993లో నీలిమేఘాలు కవితా సంకలనం వచ్చింది . స్త్రీ వాదం క్రింది సమస్యలను ప్రస్తావించింది . 1 స్త్రీని పురుషుడు దోపిడీ చేస్తున్నాడు . 2. స్త్రీఎ పురుషుల మధ్య సమానత్వం వుండాలి . 3.స్త్రీ పునరుత్పత్తి లో నిర్ణయాధికారం స్త్రీ కి వుండాలి . ప్రపంచీకరణ ,వ్యాపార ధోరణులు ప్రభావం తో స్త్రీ వాదం బలహీన పడింది .
1969 నుండి దళిత సాహిత్యం ముందుకు వచ్చింది .పూలే, అంబేద్క ర్ ,మార్క్స్ ఆలోచనా ప్రభావంతో దళిత సాహిత్యం రూపు దిద్దుకుంది .నలుపు పత్రిక నదిచిన్ది.1970లో వికసించింది 1980లో ప్రవాహంగా రూపుదిద్దుకుంది . 1983లో రామారావు ప్రభుత్వం వచ్చింది . ఆకాలం లోనే వేంపెంట ,చుండూరు ,కారంచేడు సంఘటనలతో దళిత సాహిత్యం ప్రబలంగా వచ్చింది . నాకు చరిత్ర లేదు, నాలుగు వేదాల్లోంచి, పాదాఅలలొంచి నన్ను తొలగించారు అంటూ బోజ్జాతారకం రాసారు . నిజం చెప్పండి ,పంచముడంటే వేలు లేని వాడ్నేనా అర్థం,మా ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు అని ప్రశ్నించాడు సత్తీష్ చందర్ .
మైనారిటి వాద సాహిత్యం పుట్టుమచ్చతో ప్రారంబమైనా గుజరాత్ లో మోడీ నాయకత్వం లో ముస్లిం ల పై పై జరిగిన అమానుష కాండ తరువాత గుజరాత్ గాయం వచ్చింది . జలజల , ఆజా ,మొదలైన మైనారిటి వాద సాహిత్యం ముందుకు వచ్చింది . నేను పుట్టక ముందే ,దేసద్రోహుల జాబితాలో , నమోదైవుంది నా పేరు అంటూ ఆక్రోశం వ్యక్తం చేసాడు ఖాదర్ మొహిద్దీన్ .
1990 తరువాత ప్రపచీకరణ ప్రారంబం అయ్యాక మనిషి మాయమై పోయాడు . 20 వ శతాబ్దంలో మనిషి మరనిస్తున్నాడని ఫ్రామ్ అన్నాడు . వ్యకి వాదం,ఆసలు, స్వార్థం, వుద్యొగాకవశాలు సంపాదనలు ప్రదానమైనాయి .
బషీర్బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపు పై ప్రజాపోరాటం పై ప్రభుత్వం జరిపిన మారణకాండ తో కవులు రచయతలు మెల్కొన్నారు. వికసించిన విద్యుత్ తేజం కవితా సంకలనం వచ్చింది . వ్యక్తులుగా విడిపోయిన సాహిత్యకారులను ఒక్క్కటి చేసేందుకు సాహితీ స్రవంతి ఏర్పడింది . ప్రపంచీకరణ మతోన్మాదం ఉగ్రవాదం లకు వ్యతిరేకంగా కలిసి వచ్చే సాహిత్యకారులందరిని ఒకవిశాలవెదిక మీదకు తెచ్చేందుకు సాహితీ స్రవంతి కృషిచేయడం ప్రారంబించింది . 2001 లో ఏర్పడిని ఈ సంస్త సాహిత్య ప్రస్తానం పత్రికను తప్పకుండా ప్రచురిస్తోంది . నూతన సాహిత్యకారులకు ప్రోత్సాహానిస్తోంది . సాహితీ యవనికపై చెరగని ముద్రను ముద్రను వేస్తోంది .
రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు గారు మాట్లాడుతూ రాయలసీమ లో వేమన , బ్రహ్మంగారు,అన్నమయ్య ప్రసిద్ద్దకవులని పేర్కొన్నారు . రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం వామపక్ష రాజకీయాలకు పెట్టింది పేరని చెప్పారు.
తరిమెల నాగిరెడ్డి ,నీలం రాజశేఖర రెడ్డి,రవూఫ్ మొదలైన వారంతా వామపక్షరాజకీయాలను పెంపొందించా రని ఆయన అన్నారు . నేటి రచయతలు సింగమనేని , రాచపాలెం మొదలైన వారంతా మార్క్సిస్టు దృక్పథం తో రాస్తున్న రచయతలని వారి మధ్య మీరు వుండటం అదృష్టమని ఆయన అన్నారు . కథ కవిత్వం పై సాహిత్య సాల నిర్వహించడం యువరచయతలకు చాల ప్రోత్సాహ కరంగా ఉంటుందని ఆయన అన్నారు .
కథా రచయిత్రి శశికళ గారు కొన్ని కథ లను చెప్పి కథలెలా రాస్తారో వుదహరించారు. చిన్నపిల్లల కథలు కొన్ని వినిపించి పిల్లలకు వుత్సాహాన్ని కలిగించారు .
బండి నారాయణ స్వామి తన చావుకూడు కథను చెప్పాడు . కథలో సంఘటలన్నీ ఒక చోట నుంచీ తీసుకోలేదని వేరు వేరు ప్రాంతాలలో జరిగిన వాటిని కలిపి ఒక కథగా రాసానని అయన వివరించారు . కథలెలా రాస్తారు అన్న ఒక వ్యాసం నకళ్ళ ను కొన్నింటిని తెచ్చి అందరికి పంచారు .
భోజనాంతరం కవిత్వం పై సాహిత్యశాల నిర్వహించారు
కథావస్తువును ఎలా గుర్తించాలో ప్రముఖ కవి రాధేయ గారు వివరించారు . చేనేత కార్మికుల వ్యధ లైనా,రైతుల ఆత్మహత్యలైనా , విద్యార్ధి విజయమైనా , మహిళల ఆక్రందనైనా కవిత్వంలో ఒదిగించవచ్చని చెప్పారు .మన చుట్టూ వున్న సమాజమే మనకు కవితా వస్తువును అందిస్తుందని ఆయన అన్నారు. రాసిన కవితను పలు మార్లు దిద్దుకోవాలని ఆయన చెప్పారు . కవిత్వం బాగా రాయాలంటే మంచి కవితా పుస్తకాలను బాగా చదవాలని ఆయన కొరారు.
కవితా శిల్పాన్నిగురించ ప్రముఖ కవి మల్లెల నరసింహమూర్తి గారు చక్కగా వివరించారు . నల్ల ద్రాక్షపందిరి లోని కవితలను ఆయన వుదహరించి ఎలా తీర్చి దిద్దాలో ఆయన వివరించారు . ఘూర్కా శిఖామణి రాసిన కవితను ఉదహరిస్తూ సిల్పనిర్మానం ఎలాచేయాలో వివరించారు . మన చుటూ వున్నా విషయాలను మనం గమనించి వాటిని పద చిత్రాలలోనూ , భావ చిత్రాలలోనూ రాయాలని ఆయన చెప్పారు . ఎలా చెప్పితే పాటకునికి హత్తుకుంటుందో అదే శిల్పమని ఆయన చెప్పినారు . శిల్పము ,వస్తువు కవిత్వానికి రెండు రథ చక్రాలాంటివని అన్నారు . కవిత్వం కావాలి కవిత్వం లేదంటే వచనమై తేలిపోతావ్ అని అంటాడు త్రిపురనేని శ్రీనివాస్ . శిల్పం మెరుగు పరుచుకోవాలంటే కవిత్వం ఒక శ్వాసగా ధ్యాసగా చదవాలి అని ఆయన ఆన్నారు .
No comments:
Post a Comment