Thursday, August 27, 2020

కదిరిలో విద్యార్థులకు కథల పోటీలు




2019 డిసెంబర్ లోవేమన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర, యస్ యఫ్ ఐ నాయకులు బాబ్ జాన్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా గౌరవా ధ్యక్షులు పిళ్లా కుమార స్వామి మాట్లాడుతూ విద్యార్థుల్లో మంచి సృజనాత్మక శక్తి ఉందని దానిని వెలికి తీయటానికి కథ కవిత్వ వ్యాసరచన మొదలైన సాహిత్య పోటీలు ఉపకరిస్తాయని చెప్పారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో  ఈ పాఠశాలలో నెలనెలా కథల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి చదువులో బాగా రాణిస్తారని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నాయకులు  బాబ్ బాన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాల సందర్భంగా  భగత్ సింగ్ పై వ్యాస రచన పోటీలు కూడా నిర్వహిస్తామని విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు . కార్యక్రమాన్ని  సమన్వయ  పరచిన కృష్ణ మూర్తి రాజు  మాట్లాడుతూ పిళ్లా కుమార స్వామి  సాహిత్యరంగంలో విశేష కృషి జరుపుతున్నారని, విద్యార్థి లోకాన్ని  కూడా సాహిత్య రంగం లోకి తీసుకురావడం కోసం కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో  లో తెలుగు ఉపాధ్యాయులు పవన్ ,రమణ ,హరి ప్రసాద్ రెడ్డి,  జయంతి ,చలపతి ,లతీఫ్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. బహుమతులు పొందిన వారిలో ఫర్హాన్, సోహెల్, శ్రావణ్ కుమార్ , కేదార్నాథ్ ,ఈ ఎస్ కరిష్మా విద్యార్థులు ఉన్నారు

No comments:

Post a Comment