సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డా! ఆశావాది సాహిత్యం పైన 22.4.2018న సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కటకం క్రిష్ణ వేణి , ఖట్టే వాలే దాదా ఖలందర్, చిట్రా రామ్మోహన్ , అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. కటకం క్రిష్ణ వేణి మాట్లాడుతూ ఆశావాది ఒక సాహితీ వట వృక్షం అనీ వర్ధమాన సాహిత్య కారులు ఆయన సాహిత్యం అధ్యయనం చేయాలని కోరారు. సాహితీ స్రవంతి జిల్లా గౌరవ అధ్యక్షులు పిళ్ళ కుమార స్వామి మాట్లాడుతూ ఆశావాది బాల్యం నుండి ఎన్నో కష్టాలు కడగండ్లు అవమానాలను చిరునవ్వుతో ఎదుర్కొని సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో ఎన్నో మైళ్లు రాళ్ళు దాటారు అన్నారు. తనది కవితా కులమని సగర్వంగా చెప్పిన ఆశావాది అందరికీ ఆదర్శనీయుడు అన్నారు.నగర కార్య దర్శి దాదా ఖలందర్ మాట్లాడుతూ ఆశావాది తెలుగు సాహిత్యానికి చేసిన సేవ విశిష్టతమైనదని అమోఘమైనది కొనియాడారు. చిట్రా రామ్మోహన్ మాట్లాడుతూ దళితులు పడే కష్టాలను తమ పద్యాల్లో వివరించిన సాహిత్య జీవి ఆశావాది అని కొనియాడారు. ఆశావాది అవధానాలపై మల్లిపూడి రవిచంద్ర మాట్లాడుతూ అవధాన ప్రక్రియ కొన్ని వర్గాలకే చెందినదనే అభిప్రాయాన్ని బద్దలు కొడుతూ దళితుడైన ఆశావాది స్వయం కృషితో అవధాన విద్యలో సాధికారత సాధించారని అన్నారు.అష్టావధానాలు ఎన్నో చేసి చాలా రచనలు చేశారు అన్నారు. ఆశావాది పద్య రచనల పై ఏలూరి ఎంగన్న మాట్లాడుతూ ఆశావాది పద్యాలు హృదయానికి హత్తుకునే విధంగా వినడానికి ఇంపుగా ఉంటాయి అన్నారు. ఆశావాది సాహిత్య వ్యాసాలలో వీటూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్తమాన సామాజిక అంశాలను తన సాహిత్య వ్యాసాల్లో వ్రాశారు అన్నారు. ఆశావాది వచన కవిత్వం అంతరంగ తరంగాలుపై దాముగట్ల హిదయతుల్ల మాట్లాడుతూ ఆశావాది కవిత్వంలో రైతాంగ సమస్యలు, ప్రపంచీకరణలో సంక్షోభ జీవితం గురించి ఎక్కువగా ఉంది అన్నారు. షేక్ రియాజిద్దీన్ తో సభ ప్రారంభం అయి సత్య నిర్ధారణ వందన సమర్పణ తో కార్యక్రమం అంతపురం ప్రెస్ క్లబ్ లో చాలా ఘనంగా జరిగింది.
No comments:
Post a Comment