సాహితీ స్రవంతి అనంతపురం నగరంలో సాహిత్య కార్యక్రమాలను విరివిగా నిర్వహించడానికి ప్రజాశక్తి బుక్ హౌస్ దగ్గర సాహితీ స్రవంతి కార్యాలయం లో సభ్యులు హాజరై జిల్లా గౌరవాధ్యుక్షులు పిళ్ళాకుమారస్వామి, జిల్లా అధ్యక్షులు కటకం క్రిష్నవేణి,జిల్లా ప్రధానకార్యదర్సిహిదయతుల్లా సమక్షంలో నగర కమిటీ ని 6.3.2018న ఎన్నుకున్నారు. కమిటీ లో నగరాధ్యక్షులుగా నగరూరు రసూల్,ప్రధానకార్యదర్సిగా దాదా ఖలందర్,ఉపాధ్యక్షులుగా మడూరు ప్రగతి,రాముడులను,సహాయకార్యదర్సిలుగా యల్ ఆర్ వెంకటరమణ, కిశోర్ లను,కోశాధికారి గా రాంప్రసాద్ ను,కమిటీ సభ్యులు గా లహరి,సుధాకర్,నిర్మల,నానీల నాగేంద్ర,ఆదినారాయణ, జెన్నె ఆనంద్,మిద్దెమురలీక్రిష్న,జూటూరిషరీఫ్,యమునారాణి,ముకుందాపురం పెద్దన్న,రియజుద్దీన్,షేక్షావలిలను ఎన్నుకొన్నారు.తదనంతరం ఈ నెల మార్చి 18న ఉగాది కవిసమ్మేలనం నిర్వహించాలని కమిటీ నిర్నయించింది.అల్లాగే శ్రీ శ్రీ ,జషువా,గురజాడ జయంతులను నిర్వహించాలని, విధ్యార్తులకు కవితల పోటీలు నిర్వహించాలని కమిటీ సమావేశం నిర్నయించిందని జిల్లా అధ్యక్షులు క్రిష్నవేణి ఒకప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment