అనంత పురం జిల్లాలో సాహితీ స్రవంతి
ప్రస్థానం ప్రారంభమైంది. పిళ్ళా కుమారస్వామి రెడ్డి
డా. గేయానంద్,డా. మోక్షప్రసూన లతో
సాహితి స్రవంతి కోసం ఏర్పడిన కన్వీనింగ్ కమిటీ 2002 నుండి పనిచేయడం ప్రారంభించింది. అప్పటి నుండి శ్రీశ్రీ ,జాషువా, గురజాడ వర్థంతులను లేదాజయంతులను క్రమం తప్పకుండా సాహితీ స్రవంతి నిర్వహిస్తూ వస్తోంది.
2003లో అమెరికా ఇరాక్ పై యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో సాహితీ స్రవంతి 'యుద్ధవ్యతిరేక కవితాగళాలు' పేరుతో ఇరాక్ పై అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కవి సమ్మేళనం
నిర్వహించింది. ముందస్తు ఎన్నికలపై కవితాగానాన్ని నిర్వహించింది.
అనేక ప్రజాసంఘాలు 2005 లో సమగ్రాభివృద్ధి కోరుతూ చేస్తున్న అనంతపురం జిల్లాలో ప్రజాఉద్యమాలు జరుపుతున్న నేపథ్యంలో 'జిల్లా వెనుకబాటుతనం నిర్మూలన' పైసాహితీ స్రవంతి కవి సమ్మేళనం నిర్వహించింది. 2007 లో కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటి జిల్లాలో సామాజిక న్యాయం, కులవివక్ష అంశాలపై సైకిల్ యాత్ర నిర్వహించింది. ఆ సందర్భంలో సాహితీస్రవంతి 'కులవివక్షపై కవితాసమరం' పేరుతో కవిసమ్మేళనం నిర్వహించింది.వారికి మద్దతుగా సాహితీ స్రవంతి కన్వీనరు పిళ్ళా కుమారస్వామి సైకిలు యాత్రలో పాల్గొన్నారు.
వివిధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు కథ, కవిత్వ రచనలలో పోటీలు నిర్వహించింది. తరువాత జిల్లాలో పేదలు చేస్తున్న భూపోరాటానికి అక్షరసంఘీభావం పేరిట శ్రీ శ్రీ వర్థంతి రోజున కవి సమ్మేళనం నిర్వహించింది.
సాహితీ స్రవంతి ఉద్యోగ, ఉపాధ్యాయ
రంగాలలో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి
వారిలో సాహితీ సృజనగలవారిని గుర్తించాలని
నిర్ణయించింది. అప్పటి నుండి సెప్టెంబరు 5 ఉ
పాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యా యులకు కథ, కవిత్వంలో సాహి త్య పోటీలు నిర్వహించి బహుమతులను అందజే యటం
ప్రారంభించింది.
జీవితబీమాసంస్థలో కడప డివిజన్ లోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ఉద్యోగులందరికి కవితల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసింది.
సాహితీ స్రవంతి చురుకుగా పనిచేయడం వల్ల రాష్ట్ర స్థాయిలో,జిల్లా స్థాయిలో సాహిత్య రంగంలోని ఇతర సంఘాల కదలికలు పెరిగాయి.రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తివాదులూ, సంప్రదాయవాదులు, పాలకవర్గాలు, కార్పొరేట్ వర్గాల పాత్ర కూడా సాహిత్య రంగంలో పెరిగింది. సాహిత్య ప్రముఖుల్లో
ఊగిసలాట ధోరణులు కొనసాగుతున్నాయి. విశాల ప్రాతిపదికన వారందరినీ కలుపుకొని సాహితీ స్రవంతి పనిచేయసాగింది. అనంతపురంలో స్త్రీ, దళిత,మైనార్టీ, బహుజనవాదాల పై చర్చ జరిగిన తరువాత ఆధునికాంతర ధోరణులు జిల్లాలో సాహిత్య రంగంలో ప్రవేశించాయి.
పేద ప్రజలు 2007లో ప్రభుత్వ మిగులు భూములు పంచాలని భూపోరాటం చేస్తున్నారు. ఆ సందర్భంగా ముదిగొండలో భూపోరాటం చేస్తున్న ప్రజల పై కాల్పులు జరిపి ఐదుమందిని పొట్టన పెట్టుకొంది ప్రభుత్వం. దీనికి నిరసనగా సాహితీస్రవంతి నిరసన గళాలను నిర్వహించింది. అలాగే రాష్ట్రస్థాయిలో వచ్చిన కవితాగ్రహాన్ని 'భూస్వరాలు' పేరుతో సాహితీ స్రవంతి రాష్ట్ర శాఖ కవితా సంకలనాన్ని తీసుకువచ్చింది. ఈ సంకలనంలో అనంతపురం కవులు రాసిన కవితలు చాలా ఉన్నాయి.
విశాఖకు సంబంధించిన యు.ఎ. నరసింహారావు గారు రచించిన 'కన్యాశుల్కం - ఆధునిక భారతీయ నాటకాల'తో పాటు భూస్వరాలు ను కూడా సాహితీ స్రవంతి ఆవిష్కరించింది.
జిల్లా, నగర స్థాయిల్లో అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం వల్ల వచ్చిన సంబంధాలతో 2011లో సాహితీ స్రవంతికి
జిల్లా స్థాయి కమిటీ ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది.
ప్రధాన కార్యదర్శిగా తగరం క్రిష్ణయ్య,
జిల్లా అధ్యక్షునిగా పిళ్లా కుమారస్వామి, కార్యదర్శులుగా ఆకుల రఘురామయ్య,
ముకుందాపురం పెద్దన్న, ఉపాధ్యక్షులుగా అంకె
రామలింగమయ్య, ఎర్రిస్వామి, కోశాధికారిగా ప్రజ్ఞ సురేష్, సభ్యులుగా ఆవులజయప్రద (ఉరవకొండ), శివన్న (మడకశిర),రామకృష్ణ, శేషాచార్యులు, జూటూరి షరీఫ్ తో జిల్లా స్థాయి కమిటీ ఏర్పడింది. నూతన కమిటీ చురుకుగా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. జిల్లా స్థాయి కవితా సంకలనం
తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ప్రారంభించిన కొంతకాలానికి తెలంగాణా
ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో సాహిత్య రంగంలో స్తబ్దత ఏర్పడింది.
సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ ఈ ఉద్యమాలపట్ల తటస్థ వైఖరితో ఉండాలని నిర్ణయించింది. ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు సాహిత్యకారులను చీలుస్తు న్నాయని ఇవి ప్రపంచీకరణకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి దోహదపడవని
సాహితీ స్రవంతి భావించింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమ
కారుల ఆవేశాలు, ఆశలు చల్లారిపోయాయి. ఆ సందర్భంలో అనంతపురం జిల్లాలోని చాలా మంది సాహిత్యకారులు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.
అంతకుముందు జిల్లా వ్యాప్తంగా ఆహ్వానించగా వచ్చిన కవితలను సంస్కరించి మల్లెల నరసింహమూర్తి పిళ్ళా కుమారస్వామి సంపాదకత్వంలో 'అనంత
కవితాస్వరాలు' పేరుతో కవితా సంకలనాన్ని సాహితీ
స్రవంతి తీసుకు వచ్చింది. ఈ పుస్తక ఆవిష్కరణకు
ముందుగా 'చిక్కనవుతున్న పాట' పేరుతో ఒక కవితా సంకలనాన్ని సాహితీస్రవంతి ప్రచురింది. దీనిని ప్రముఖ విమర్శకులు సూర్యసాగర్ ఆవిష్కరించారు. అదే సందర్భంలో రెండవ
జిల్లా కమిటీ కూడా ఏర్పడింది. కమిటీలో ప్రధాన కార్యదర్శి'గా ప్రజా సురేష్, అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా అంకె రామలింగ మయ్య, బాల భారతమ్మ, కార్యదర్శులుగా రియా జుద్దీన్, ఆకుల రఘురామయ్య గార్లు బాధ్యతలు తీసుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అనంత కవితాస్వరాలు పుస్తకావిష్కరణ సభకు మేడిపల్లి రవికుమార్ గారు తిరుపతి నుంచి
వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా డా. గేయానంద్ గారు పాల్గొన్నారు.
అనంత కవితా స్వరాలు కవితా సంకలనాన్ని పరిచయం చేసేందుకు కదిరి, హిందూపురం, ఉరవకొండ, ధర్మవరం ప్రాంతాలలో జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి పర్యటించి జనకవనాలను కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా కదిరిలో ఆ శాఖ అధ్యక్షులుగా చలపతి, ప్రధాన కార్యదర్శిగా చిన్నారావులతో ఒక కమిటీ ఏర్పడింది. హిందూపురంలో డా|| నాగశేషు, అశ్వర్ధ నారాయణ
ప్రధానకార్యదర్శి, అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కమిటీ ఏర్పడింది. ఉరవకొండలో ఆవుల వెంకటేశులు గంగాధర్ లు అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీ ఏర్పడింది. ధర్మవరంలో నూతన శాఖ ఏర్పడింది. ఈ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఇటికంటి మహేష్, అధ్యక్షులుగా శారద, ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ తదితరులతో కమిటీ నిర్మాణం జరిగింది.
నెలనెలా క్రమం తప్పకుండా సంవత్సరం
పాటు సాహితీ సమయం కార్యక్రమాన్ని నిర్వహిం
చడం ద్వారా అనంతపురం నగర కమిటీ కూడా
ఏర్పడటానికి దోహదపడింది. నగర కమిటీలో
అధ్యక్షులుగా వై. సూర్యనారాయణరెడ్డి, నగర ప్రధాన కార్యదర్శిగా పోకూరి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా నీరుగంటి వేంకటేశు, కార్యదర్శిగా రవిచంద్ర బాధ్యతలు తీసుకున్నారు.
అనంతపురం నగర కమిటీ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కవులు రచయితలతో 2016 సం|| కేలండర్‌ను రూపొందించి ఆర్ట్స్ కళాశాలలో ఆవిష్కరించింది. అలాగే ఆర్ట్స్ కళాశాలతో కలిసి జిల్లాలోని దివంగత సాహిత్యకారులపైప్రతి నెలా 3వ ఆదివారం సాహితీ సమాలోచన ఆ కళాశాల తెలుగుశాఖతో
కలిసి నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రథమంగా మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న 'వేమన-సామాజిక దృక్పథం' పై నిర్వహించిన సభలో అప్పిరెడ్డి హరినాథరెడ్డిముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. హిందూపురం, ధర్మవరం, అనంత పురంకమిటీలు కూడా మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాయి. మార్చి నెలలో మహిళా దినోత్సవాన్ని ధర్మవరం, అనంతపురం, హిందూ పురం శాఖలు నిర్వహించాయి.
ఏప్రిల్ మాసంలో జిల్లా శాఖ కథ, కవిత్వంలపై
సాహిత్యశాల నిర్వహిం చింది. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పడిన ప్రాంతీయ కమిటీ సభ్యులతో మూడవ జిల్లా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో అధ్యక్షులుగా ప్రగతి, ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర, ఉపాధ్యక్షులుగా సత్య నిర్ధారన్ (ధర్మవరం), అశ్వథనారాయణ (హిందూ పురం), వై. సూర్యనారా
యణరెడ్డి (అనం తపురం), సహాయ కార్యదర్శులుగా నీరుగంటి వెంకటేసు (అనంతపురం), ఇటికంటి మహేష్ (ధర్మవరం) పిళ్ళా కుమారస్వామి (రాష్ట్ర
కమిటి సభ్యులు, కోశాధికారి), సభ్యులుగా నానీల నాగేంద్ర (అనంతపురం, నర్సిరెడ్డి (పెనుగొండ), తిప్పేస్వామి (కళ్యాణదుర్గం), గంగాదేవి,ధరిత్రీదేవి, యమునా, హిదయతుల్లా, రసూల్, శ్రీధర్ నాయుడు, చంద్రశేఖర్ (యూనివర్శిటీ),
లక్ష్మినారాయణ (యూనివర్శిటీ) బాధ్యతలు
తీసుకున్నారు.
సాహిత్యశాలలో రాయలసీమ కథా చిత్రంపై
సింగమనేని నారాయణ, కథలెలా రాస్తారు పై శశికళ,
బండి నారాయణస్వామి, సాహిత్య పరిణామ క్రమంపై పిళ్ళా కుమారస్వామి, కవిత్వంలో వస్తువు పై రాధేయ, కవితా శిల్పంపై మల్లెల నరసింహమూర్తి బోధించారు. సాహితీ స్రవంతి ఆవిర్భావంపై జంధ్యాల రఘుబాబు వివరించారు.
ఆంధ్రరాష్ట్రం విడిపోయాక జిల్లాలో రాయలసీమ ప్రత్యేక ఉద్యమ సన్నాహాలు రచయితలు మేధావులతో ప్రారంభమయ్యాయి. రాయలసీమ, అందులోఅనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. అందువల్ల ఈ ఉద్యమం అనంతపురంలోనే రాజుకుంటున్నది. కొంత మంది రచయితలు బహిరంగంగా దీనినిప్రోత్సహిస్తున్నారు. అంతేగాక ప్రపంచీకరణ ప్రభావంతో జిల్లాలో భాషా సంస్కృ
తులపై పెనుప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు భాషా సంస్కృతులనురక్షించు కోవాలని సాహితీస్రవంతి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగు తున్నది.
వర్తమాన పరిస్థితుల్లో సాహితీ స్రవంతి కొత్తతరం సాహితీ సృజనకారులను
గుర్తించి ప్రజాసాహిత్యకారులుగా తీర్చిదిద్దాల్సిన కర్తవ్యాన్ని గుర్తించింది. జిల్లాలో సాహిత్యా
భివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉగాది రోజున తూతూ మంత్రంగా కవిసమ్మేళనాలను నిర్వహిస్తోంది. అధికార భాషాసంఘం నామ మాత్రంగా కూడా లేదు. అదే సందర్భంలో వర్ధమాన సాహిత్యకారుల్లో సాహిత్యం
పట్ల తపన ఉండటం గమనార్హం. వీరి తపనను గుర్తించి సాహితీ స్రవంతి సాహిత్యకార్యశాలలను విరివిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.
పాతతరం సాహిత్యకారుల స్ఫూర్తిని పొందేందుకు నెల నెలా అనంతపురం నగరశాఖ జిల్లాలోని
దివంగత సాహిత్య కారులపై సాహితీ సమాలోచన ను చేపట్టింది. వేమనపై అప్పిరెడ్డి హరినాథ రెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సాహిత్యంపై అంకె శ్రీనివాస్, గుత్తిరామకృష్ణపై సాయినాథ్, తలమర్ల కళానిధిపై ఆశావాది ప్రకాశరావు మరియు
ఆయన కుమారుడు తలమర్ల శ్యామ్ సుందర్, బెల్లూరు శ్రీనివాసమూర్తి సాహిత్యంపైఏలూరి ఎంగన్న ఆయన కుమార్తె సర్దేశాయి తిరుమలరావుపై రాచపాళెం, విద్వాన్ విశ్వంపై ఏలూరి ఎంగన్న, కోగిర జైసీతారాంపై ఆయన కుమారుడు కోగిరజయచంద్రా రెడ్డి, ఏలూరి ఎంగన్నతో కలిసి ప్రసంగించారు.
సాహితీస్రవంతి, సాహిత్య అకాడమి సహకారంతో 'కార్మిక సాహిత్యం' పై 2016 డిసెంబరు 25న సదస్సు నిర్వహించింది. కదిరిలో 'ఇప్పుడు వీస్తున్న
గాలి' పేరుతో నెలనెలా వర్తమాన కవులు, రచయితల పుస్తకాలపై సమీక్షలు,సాహిత్య గోష్టి నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం వేమన, రాళ్ళపల్లి, తలమర్ల కళానిధి, మొదలైన సాహిత్యకారుల విగ్రహాలను కలెక్టరు కార్యాలయం బయట నెలకొల్పాలి. సాహిత్య ప్రస్థానం పత్రికను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సాహిత్యకారులు తమపుస్తకాలను ప్రచురించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహా యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
( అనంత సాహితీ సమాలోచన నుండి)
___పిళ్లా విజయ్
No comments:
Post a Comment