సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్
"వరుస కరువులతో ఆనంతపురం జిల్లాలో ప్రజల జీవనం దుర్భరంగా మారింది. రైతు ఆత్మహత్యలు, ఉపాధి కోసం వలసలు కొనసాగుతున్నాయి. వీటిపై
కరువులు, రచయితలు స్పందించాల్సిన అవసరముంది". అని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కుమారస్వామి
ఆధ్యక్షతన ఆదివారం నాడు 'ప్రజాశక్తి కార్యాలయంలో సాహితీ సమయం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వి.రాంభూపాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయి
ప్రసంగించారు. వరుస కరువులతో అనంతపురం జిల్లాలో ప్రజల జీవనం అస్థవ్యస్థంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే
ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు సాగునీరు, తాగునీటి వసతి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన
దుస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఇటువంటి సమయంలో కవులు, రచయితలు జిల్లా పరిస్థితుల పై తమ కలాలకు పదును పెట్టాల్సిన అవసరముందని
పిలుపునిచ్చారు. తమ కవితలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ప్రభుత్వాల తీరును , విధంగా ఉండాలని సూచించారు. దీనికి సాహితీ
స్రవంతి సభ్యులు స్పందిస్తూ కష్టాల్లోనున్న ప్రజల తరుపున తాము నిలబడేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. రైతులు, వ్యవసాయ కూలీల తరుపున నిలబడి రచనలు
సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పెట్టి జయరాం, సురేష్, గంగాదేవి, బాలభారతమ్మ, సూర్యనారాయణరెడ్డి, నవీన్ కుమార్, చంద్రశేఖర్,
సుజాత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment